హెచ్‌1బి వీసాలకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

2

వాషింగ్టన్‌,,మార్చి17(జనంసాక్షి):2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌-1బి వర్క్‌ వీసాలను అమెరికా ఏప్రిల్‌ 1వతేదీనుంచి దరఖాస్తులను స్వీకరించనుందని గురువారం యూఎస్‌ అధికారులుయ వెల్లిడించారు. అమెరికా కంపెనీలలో పనిచేసే వారిలో ఎక్కువమంది భారతీయులే దాంతో యూఎస్‌ కంపెనీలు సైన్స్‌, ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్‌-1బి వీసాలను వినియోగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈసంవత్సరంలో తొలి ఐదు పనిదినాల్లో 65వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఆశిస్తున్నట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. హెచ్‌-1బి వీసా దరఖాస్తులు ఎన్ని వచ్చాయన్న దానిపై ఈ సంస్థ పర్యవేక్షించిన అనంతరం అధికారికంగా వెల్లడించనుంది. ఒకవేళ యూఎస్‌సీఐఎస్‌ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో హెచ్‌-1బి దరఖాస్తులు అందినట్లయితే కంప్యూటర్‌ ఆదారిత లాటరీ విదానం ద్వారా దరఖాస్తులను ఎంపిక చేస్తామని అధికారిక ప్రకటన విడుదలైంది.