హైకోర్టు విభజన జరగాల్సిందే

C

– దద్ధరిళ్లిన లోక్‌సభ

– కేంద్రం తీరుపై మండిపడ్డ తెరాస ఎంపీలు

– పోడియంలోకి దూసుకొచ్చిన ఎంపీలు

– రెండు సార్లు సభ వాయిదా

– 15 రోజుల్లో పరిష్కరిస్తామన్న మంత్రి సదానంద

న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):

హైకోర్టు విభజన అంశం లోచీసభను కుదిపేసింది. విభజన విషయంలో తాత్సారం చేస్తున్నారంటూ టిఆంఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీనిపై తక్షణ చర్య తీసుకోవాలంటూ సభలో ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకం తిరస్కరించారు. విభజన జరిగి 11 నెలలు అయినా ఇంకా సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ టీఆంఎస్‌ ఎంపీలు లోచీసభలో నిరసనలకు దిగారు. ప్లకార్డులతో పోడియంలోకి దూసుకుని వచ్చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగగా సభను స్పీకం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ  విభజనపై హైకోర్టు ప్రధాన న్యామూర్తితో పాటు ఇరు రాష్ట్రాల సిఎంలతో చర్చించాల్సి ఉందన్నారు. అలాగే ఒక ఎస్సెల్పీ హైకోర్టులో  పెండింస్త్రలో ఉందన్నారు. అయితే కేంద్రం విభజనకు సుముఖంగా ఉందని, పదిహేను రోజుల్లో ఇరు రాష్ట్రాల ఎంపిలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విభజన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద/నడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు, ఎంపీలు వస్తే చర్చిద్దామని సూచించారు. హైకోర్టు విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి లేఖరాశారని సదానందగౌడ తెలిపారు.  తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంతకుముందు స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానం విభజన చేపట్టాలని డిమాాం చేస్తూ లోచీసభలో తెరాస సభ్యుల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ఉన్నత న్యాయస్థానం విభజన అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తోందన్నారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయడానికి కేంద్రంగా సిద్దంగా ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్లపకార్డులు ప్రదర్శించడం సరికాదని, వాటిని వదిలేయాలని తెరాస సభ్యులను కోరారు. దీంతో మంత్రి తీరుపై టిఆంఎస్‌ ఎంపిలు మండిపడ్డారు.  వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే టీఆంఎస్‌ సభ్యులు మాట్లాడటానికి స్పీకం అనుమతించారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందంరెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు విభజన విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సమస్యలు లేకున్నా జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటని ఎంపి జితేందం రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టులో ఉన్న ఎస్సెల్పీని డిస్పోజ్‌ చేశారని అన్నారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని విభజన బిల్లులో స్పష్టంగా ఉందని తెలిపారు. న్యాయవాదులు కూడా 45 రోజులపాటు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారని వివరించారు. గతంలో ఏపీ బాం అసోసియేషన్‌ మొత్తం ఢిల్లీకి వచ్చి మంత్రి రవిశంకంను కలిశారని గుర్తు చేశారు. అప్పుడు వారంలోపు హైకోర్టును విభజిస్తామని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. సీఎం కేసీఆం కూడా ప్రస్తుతం హైకోర్టు ఉన్న బిల్డింస్త్రలో ఏపీ హైకోర్టు ఉండటానికి ఒప్పుకున్నారని, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం గచ్చిబౌలిలో ఓ భవనాన్ని చూపించారని అన్నారు. ప్రస్తుతం హైకోర్టులో తెలంగాణకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని తెలిపారు. తెలంగాణ కేసుల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదనతో తెలిపారు.

ప్రత్యేక హైకోర్టును ఎప్పుడు నోటిఫై చేస్తారు

ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని  లోచీసభలో టీఆంఎస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకం టీఆంఎస్‌ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్బంగా టీఆంఎస్‌ ఎంపీ వినో’ మాట్లాడారు. చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఎప్పుడు నోటిఫై చేస్తారో ప్రకటన చేయాలన్నారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి వెంటనే స్పందించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు హైకోర్టు విభజనే లేదనడం సరికాదన్నారు. పార్లమెంట్‌లో చట్టం పాసైంది, ప్రత్యేక హైకోర్టుకు అభ్యంతరమేంటన్నారు. ఈమేరకు కేంద్రం కూడా కోర్టులో అఫిడెవిట్‌ దాఖలు చేసిన విషయాన్ని వినో’ గుర్తు చేశారు.

హైకోర్టు ఏర్పాటులో ఆలస్యంపై ఖర్గే మండిపాటు

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని లోచీసభలో టీఆంఎస్‌ వినిపిస్తోన్న వాయిస్‌కు కాంగ్రెస్‌ మద్దతు లభించింది. ఇవాళ లోచీసభలో ఉమ్మడి హైకోర్టు విభజనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే టీఆంఎస్‌ సభ్యులకు మద్దతు తెలిపారు. హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. రెండు రాష్ట్రాలు ఉన్నపుడు రెండు హైకోర్టులు ఉండటంలో తప్పేంటన్నారు. రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సమంజసమన్నారు. విభజన చట్టం మేరకు చర్య తీసుకోవాలని అన్నారు.

టిఆంఎస్‌ ఎంపిల ఆందోళనతో సభ వాయిదా

అయితే మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని టిఆంఎస్‌ ఎంపిలు హైకోర్టును విభజించాలంటూ టీఆంఎస్‌ ఎంపీలు సభలో డిమాాం చేశారు. ఎంపీలు ఫ్లకార్డులతో స్పీకం పోడియం  చుట్టుముట్టి హైకోర్టు విభజించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లోక్సభ స్పీకం సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. టీఆంఎస్‌ ఎంపీలను ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. ఏదైనా అంశం చర్చించాలనుకుంటే జీరో అవం లో ప్రస్తావించవచ్చని ఆమె టీఆంఎస్‌ ఎంపీలను కోరారు. అయినా ఎంపీలు తమ పట్టు వీడక పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని  విభజన అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయినా టీఆంఎస్‌ ఎంపీలు శాంతించలేదు. ఉదయం కూడా సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంతో సమస్యకు పరిస్కారం చేపట్టాలని డిమాాం చేశారు. దీంతో స్పీకం సభను 11.20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయ్యాక ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాాం చేస్తూ టీఆంఎస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. లోచీసభ జైతెలంగాణ నినాదాలతో ¬రెత్తుతోంది. ఇవాళ సభ ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాాం చేస్తూ టీఆంఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకం సుమిత్రా మహాజన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. స్పీకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆంఎస్‌ ఎంపీలు పొడియాన్ని చుట్టు ముట్టారు. వుయ్‌ వాంట్‌ జస్టిస్‌, జైతెలంగాణ , వుయ్‌ వాంట్‌ హైకోర్టు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో స్పీకం సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ 11.20 గంటలకు తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా టీఆంఎస్‌ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆంఎస్‌ ఎంపీలు సభ బయటా డిమాాం చేశారు.  పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆంఎస్‌ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.

గాంధీ విగ్రహం ముందు ఆందోళన

పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. కాగా, హైకోర్టును విభజించాలంటూ లోచీసభలో ఇవాళ టీఆంఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం కావాలనే తాత్సారం చేస్తోందని ఎంపి కేశవరావు అన్నారు. 11 నెలలు అయినా దీనిపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలం అయ్యిందన్నారు. ఇది కావాలని చేస్తున్నట్లుగా ఉందన్నారు. సభ ప్రారంభానికి ముందు తెరాస ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.పలపకార్డులు ప్రదర్శిస్తూ హైకోర్టును విభజించాలని నినాదాలు చేశారు. హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా తెరాస సీనియంనేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన చేపట్టాలని తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని కేకే తెలిపారు. తెరాస ఎంపీలు కవిత, జితేందంరెడ్డి, బాల్కాసుమన్‌ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.