హైకోర్టు విభజిస్తాం

2
-రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే 2నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం

-సదానంద గౌడ

హైదరాబాద్‌,మార్చి14(జనంసాక్షి):  హైకోర్టు విభజన గురించి తెలం గాణ ప్రభుత్వం లేక ఇస్తే రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. తెలంగాణ రాష్టాన్రికి త్వరలో ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ప్రకటించారు.   ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పిస్తే ఈ పక్రియను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కొత్త హైకోర్టుకు స్థలం, భవనాలు చూపిస్తే హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదిం పజేస్తానని హావిూ ఇచ్చారు. ఈమేరకు తాను రాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వయంగా లేఖ రాస్తానని తెలిపారు. సీఎం నుంచి ప్రతిపాదనలు అందగానే వారంలో పక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణ న్యాయవాదులు ఆందోళన విరమించుకుని కోర్టు విధులకు హాజరుకావాలని కోరారు. ప్రస్తుతమున్న ఏపీ హైకోర్టు మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.