హైదరాబాద్‌పై ఆంక్షలు అంగీకరించం
– సెక్షన్-8 ఒప్పుకోం
-ఎలాంటి ఫోన్ ట్యాపింగ్‌లు జరుగలేదు
– గవర్నర్ స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్15(జనంసాక్షి): హైదరాబాద్ పై ఎలాంటి ఆక్షంలు తెలంగాణ సమాజం అంగీకరించదని, ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లఉ తెలంగాన సర్కారు చేయలేదని సీఎం ఏసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఇటీవలి ఓటుకు నోటు కేసు కీలక స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు, స్టీఫెన్‌సన్ మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో సీడీల కేసులో ఫోరెన్సిక్ నివేదిక త్వరలో రానుంది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఏసీబీ ఉంది. ఈ క్రమంలో మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయినట్టు సమాచారం. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించాలన్న కేంద్రం ఆదేశాల దృష్ట్యా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో గవర్నర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గవర్నర్ సలహాదారులు ఎపివిఎన్ శర్మ, మహంతిలు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమై ఫోన్ ట్యాపింగ్ సహా, సెక్షన్-8 అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కేసీఆర్, గవర్నర్ సమావేశం అయినట్లు తెలియవచ్చింది. మరోవైపు రేవంత్ కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై పలు విషయాలను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎంతో సహా మొత్తం 120 మంది ఫోన్లను ట్యాప్ చేసిందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి, రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దాలని, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకుని స్పష్టమైన నివేదిక ఇవ్వాలని గవర్నర్‌కు ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ సలహాదారులను పంపి ఏపీ అభిప్రాయాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తెలుసుకున్నారు. అందులో భాగంగానే సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఏపీ తెలిపిన అభ్యంతరాలను కేసీఆర్ ముందుంచి ఆయన అభిప్రాయాలను గవర్నర్ అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలియవచ్చింది. ఏపీ ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, అలాగే సెక్షన్-8కు అంగీకరించే ప్రసక్తేలేదని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషాన్ని గవర్నర్‌కు స్పష్టం చేసినట్లుగా సమాచారం. మొత్తానికి వీరిభేటీ పలు అనుమానాలను బలపరుస్తోంది.