హైదరాబాద్‌లో 120 అడుగుల అంబేెడ్కర్ విగ్రహం
హైదరాబాద్,ఏప్రిల్ 9(జనంసాక్షి):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించనుంది. తెలంగాణలో అంబేద్కర్ జయం తోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంబేద్కర్ జయంతి సంద ర్భంగా ఈనెల 14న విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాయకత్వంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా కన్వీనర్గా కమిటీ ఏర్పాటు చేశారు. అటు హైదరాబాద్లో అంబేద్కర్ స్క్వేర్ కూడా ఏర్పాటు చేయాలన్నారు సీఎం. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వ హించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ నెల ఒక కార్య కమం జరగా లన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేపట్టాలని చెప్పారు. దళితుల అభ్యున్నతి, చైతన్యం కోసం కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు.