హైదరాబాద్‌ నేనే అభివృద్ధి చేశా..

2
తెలంగాణ కూడా నేనే..

2019లో అధికారం మాదే

కృష్ణపట్నం మిగులు విద్యుత్‌పై చర్చించుకుందాం రా!

కరీంనగర్‌ సభలో చంద్రబాబు

కరీంనగర్‌,మార్చి3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత అభివృద్ది, హైదారబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి, చివరకు తెలంగాణ ఏర్పాటు టిడిపి వల్లనే సాధ్యామయ్యాయని ఆ పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డామన్నారు. చివరకు కరీంనగర్‌ కూడా టిడిపి హయాంలోనే అభివృద్ది చెందిందని అన్నారు. కరీంనగర్‌లో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో  బాబు మాట్లాడుతూ రెండు రాష్టాల్ల్రో టిడిపి పనిచేస్తుందని, 2019లో టిడిపిదే అధికారమని అన్నారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చిన పరిష్కరించడానికి తామే చొరవ చూపుతున్నామని, ఇరు రాష్టాల్రు కలసి చర్చించుకుని సమస్యలు పరిస్కరించుకోవాల్సి ఉందన్నారు. ఇక్కడ పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. టిడిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామని, బాబ్‌ఈ కోసం పోరాడమని, చివరకు రైతులకు 9 గంటల కరెంట్‌ ఇచ్చామని అభివృద్ది పనుల జాబితాను బాబు ఏకరువు  పెట్టారు. తెలంగాణలో ఎక్కువ సాగునీరు ఇచ్చింది తెదేపా హయాంలోనేనని  చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది తెదేపానేన్నారు. మాదిగలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చింది తెదేపానేనని, వారికి న్యాయం చేయడం తెదేపా సిద్దాంతమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వెనకబడిన వర్గాలవారిని రాజ్యాధికారంలోకి తెచ్చింది తమ పార్టీయేనని చంద్రబాబు చెప్పారు. పేదవారి కోసం కట్టుబడి ఉన్న పార్టీ ఒక్క తెదేపానేనన్నారు. చివరకు కరీంనగర్‌ జిల్లా అభివృద్ధి తెదేపా హయాంలోనే జరిగిందన్నారు. ఇది కాదని ఎవరైనా అనగలరా అని అన్నారు. . కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో సుసంపన్నంగా ఉండటానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లనే ఆని అన్నారు. టీడీపీ చొరవతోనే తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చాయని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజక్టుల కోసం టీడీపీ చొరవచూపిందని ఆయన చెప్పారు. కొంతమంది నేతలు టీడీపీకి ద్రోహం చేస్తే కార్యకర్తలే పార్టీని కాపాడారని ఆయన అన్నారు. టీడీపీని విమర్శించే హక్కు ఏపార్టీకీ లేదని అన్నారు. ప్రపంచం గర్వించే నాయకుడు పీ.వీ.నరసింహారావు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణరెడ్డి పుట్టిన గడ్డ ఇదని అన్నారు. పివి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం తెలుగువారికి గర్వకారణమని చంద్రబాబు అన్నారు. సమస్యలు వస్తే చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అదే తమ అభిమతమని అన్నారు. ఇరు రాష్టాల్ర మధ్య ఏర్పడిన జలవివాదాన్ని గవర్నర్‌ వద్ద కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకున్నామని, ప్రభుత్వాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఇరు రాష్టాల్ల్రో పార్టీని కాపాడుకుంటున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ సమస్య వచ్చినా పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒక కుటుంబమే విడిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసునని ఆయన అన్నారు.చట్టపరంగా ఇంకా కొన్ని విభజన కావాల్సి ఉందని అన్నారు.ఉద్యోగుల విభజన పూర్తి కావాల్సి ఉందని అన్నారు.మంచి వాతావరణంలో ఇరు రాష్టాల్రు, కేంద్రం కలిసి కూర్చుని పరిష్కారం చేసుకోవాలని సూచించానని అన్నారు. కరెంటు గురించి మాట్లాడుతూ ఇక్కడ పంటలు వేసుకోలేదని, దానికి కారణం విూకు తెలుసునని అన్నారు. రెండు ప్రాంతాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మాట్లాడుదామన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చలకు సిద్దమని చంద్రబాబు అన్నారు. గ్యాస్‌ ధర కూడా తగ్గిందని, దీని ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చని అన్నారు.గతంలో తెలంగాణలో తొమ్మిది గంటలు విద్యుత్‌ ను వ్యవసాయానికి సరఫరా చేసిన ఘనత తమదేనని ఆయన అన్నారు. విద్యుత్‌ కోటా తెలంగాణకు ఎక్కువ ఇచ్చారని అన్నారు. తాము ఎపిలో ముందుచూపుతో ఎక్కువ ధర పెట్టి కొన్నామని చంద్రబాబు తెలిపారు. కరీంనగర్‌ లో జరిగిన సభలో చంద్రబాబు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సహకారంపై పలుమార్లు విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రభుత్వం పరంగా సహకరించుకుందామని,పార్టీ పరంగా ఎవరికి వారు పనిచేసుకుంటారని అన్నారు. తాము ఎక్కడా తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పారు.కృష్ణపట్నంపై తొలిసారిగా చర్చలకు సిద్దమని చంద్రబాబు ప్రకటించడం విశేషం.తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక పోరాటాలు చేసిన చరిత్ర టిడిపిది అని అన్నారు. బయ్యారం భూములను నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. అల్లుడికి కట్టబెడితే పోరాడామని, అందువల్లే ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ వస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకసారి ఓడినా,మరోసారి ఉవ్వెత్తున లేచే పార్టీ చరిత్ర టిడిపిదని చంద్రబాబు చెప్పారు.ఆ రోజు తెలంగాన కోసం తీర్మానం పాస్‌ చేశాం…దానికి కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి మారలేదని, ఆ తీర్మానాన్ని మళ్లీ పంపించామని తెలంగాణ తీర్మానం గురించి చెప్పారు. తమ విధానం ఎక్కడ మారిందని ఆయన ప్రశ్నించారు. విభజన వల్ల వచ్చే ఇబ్బందులను పరిష్కరించాలని చెప్పామే తప్ప , వద్దనలేదని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన పార్టీ టిడిపిదని ఆయన అన్నారు. విభజన చట్టంలో పెట్టిన హావిూలు అమలు కావడం లేదని అన్నారు. ఇక్కడ ఆదాయం పెరిగిందటే అది టిడిపి ఘనత అని అన్నారు. అక్కడ అదికారం వచ్చింది కనుక అక్కడ ఇరవైనాలుగు గంటలు తిరుగుతూనే ఇక్కడ పార్టీని కాపాడుకుంటున్నానని అన్నారు. నాగార్జున సాగర్‌ వద్ద రెండు రాష్టాల్ర పోలీసులు ఘర్షణ పడుతుంటే తాను స్వయంగా సిఎం కెసిఆర్‌కు ఫోన్‌ చేశానని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడనుంచో వచ్చినవారు కారని, అంతా మన స్కూల్‌ నుంచి వచ్చినవారేనని ఆయన అన్నారు.సాగర్‌ సమస్యపై కెసిఆర్‌ కూడా ముందుకు వచ్చి సమస్య పరిష్కారానికి ఒప్పుకున్నారని అన్నారు. 1956 ప్రాతిపదికన పీజులు రీయింబర్స్‌ మెంట్‌ గురించి వచ్చినప్పుడు అది కరెక్టు కాదని చెప్పానని, కోర్టు కూడా అదే చెప్పిందని అన్నారు. ఎమ్సెట్‌ పై కూడా సర్దుకుపోదామని మంత్రికి చెప్పామని అన్నారు. కలసి పనిచేసుకుంటే మంచిదని, చీటిమాటికి పోలీస్‌ స్టేషన్‌ కు,కోర్టు కు వెళితే అందరం నష్టపోతామని ఆయన అన్నారు. ఎక్కడ ఉన్నా తెలుగు జాతి అంతా ఒక్కటే అని చంద్రబాబు అన్నారు సర్వమత సమ్మేళనానికి పుట్టినిల్లు కరీంనగర్‌ జిల్లా అని తెదేపా అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశం దశ, దిశ నిర్దేశిరచిన పీవీ పుట్టిన గడ్డ ఇదేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాక్షసపాలన సాగిందన్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారని, త్యాగాలు చేసిన వారందరికి శిరస్సు వంచి వందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పుట్టిన పార్టీ తెదేపా అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీని నాయకులు వీడారు తప్ప కార్యకర్తలు వీడలేదని, వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. జై తెలంగాణ నినాదంతో ఆయన తన ప్రసంగం ముగించారు.