హోదాకోసం పార్లమెంటును స్థంబింపజేయండి

1

– ఆంధ్రా ఎంపీలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు

– వినోదం కోసమే సినిమాలు

తిరుపతి,ఆగస్టు 27(జనంసాక్షి): ఎపికి ప్రత్యేక ¬దాపై జనసేన బాణం ఎక్కుపెట్టింది. ఎప్పుడు ప్రశ్నిస్తారంటూ వస్తున్న విమర్శలకు సమాధానంగా ప్రశ్నించడానికి ముందుకు వచ్చింది.  ప్రత్యేక ¬దాపై మూడుదశల్లో పోరాటాలు చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం ఉద్యమించాలని నిర్ణయించింది. ఆత్మగౌరవ నినాదంతో పవన్‌ పోరాటానికి సిద్దం అయ్యారు. ఎట్టకేలకు పవర్‌ స్టార్‌ జూలు విదిల్చాడు.. ఎప్పుడు ప్రశ్నిస్తావ్‌ అని అంతా అడుగుతున్నందుకు ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని అంటూ కేంద్ర,రాష్ట్ర సర్కార్‌లను దుమ్ముదులిపి పారేశారు. ప్రత్యేక ¬దా కోసం పోరాడతాం. దాన్ని సాధించేదాకా పోరాడతాం అని ప్రకటించారు. ఇందుకోసం మూడు దశల కార్యాచరణను వెల్లడించారు. తిరుపతి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన జనసేన సభలో పవన్‌ కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాలను దుమ్ము దులిపారు. పదిహేను ఏళ్ల ప్రత్యేక¬దా కావాలన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెనక్కి పోవడం దారుణమన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని హెచ్చరించారు. అదే సందర్భంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారు కేసుల గురించి భయపడుతున్నారా అని ప్రశ్నించారు.  ఇలా ప్రశ్నిస్తూనే ఇక జనసేన ప్రత్యక్ష పోరాటాలకు దిబోతున్నట్లు ప్రకటించారు.  తొలిదశలో రాష్ట్రమంతా తిరిగి ప్రత్యేక ¬దా అవసరంపై ప్రజలను చైతన్యపరచడం, రెండో దశలో ఎంపీలపై ఒత్తిడి తేవడం మూడోది కేంద్రంతో ప్రత్యక్ష పోరాటం అని ఆయన ప్రకటించారు. రాష్ట్రాన్ని  రెండుగా విభజించాలని బీజేపీ 1997లో తీర్మానం చేసిన చోట అంటే కాకినాడ లో సెప్టెంబర్‌ 9న మొదటి బహిరంగ సభ పెడతానని ఆయన చెప్పారు.. రాష్ట్ర విభజన చేస్తున్నట్లు నాటి కాంగ్రెస్‌ ¬ంమంత్రి చిదంబరం ప్రకటించిన తేదీ (డిసెంబర్‌ 9) కావడంతో అదే 9వ తేదీని పవన్‌ ఎంచుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రధాని మోడీని సమర్థించాల్సిన అవసరం లేదని కూడా పవన్‌ ఘాటుగానే హెచ్చిరించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని అన్నారు.  ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందని అయితే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత గౌరవం తనకు లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని, అక్కడేవిూ బ్రహ్మరాక్షసులు లేరని అక్కడ ఉంది కూడా మనలాంటి మనుషులే కదా అని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎంపీలు మేడమ్‌.. మేడమ్‌.. అని బతిమలాడేవారని, ఇప్పుడు ఎంపీలు సార్‌.. సార్‌.. అని బతిమలాడుతున్నారని విమర్శించారు. వారికి అర్థమయ్యేలా నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడాలని అన్నారు. ప్రత్యేక¬దా కోసం పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు సూచించారు. రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అని తన పోరాటంలో తాను గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. వెనకడుగు వేయనని పవన్‌ స్పష్టం చేశారు. గోసంరక్షణ చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్త ఒక ఆవును పెంచుకోమనండని పవన్‌ సూచించారు. గోమాత పేరుతో సమస్యలను గాలికి వదిలేయవద్దని అన్నారు. టిడిపి ప్రభుత్వం, విపక్షాలు ఒకటే మాటగా ఉండాలన్న పవన్‌.. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా ఉండకూడదని పేర్కొన్నారు. అన్ని రిస్క్‌లు ఎదుర్కొనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘మోదీని పార్లమెంట్‌లో తొలిరోజు కలిశా.. మళ్లీ ఇంతవరకు కలవలేదు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలిశా. భాజపాలో చేరమని నన్ను అడిగారు. జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ కన్నా ఎక్కువ అని చెప్పా. జాతీయ సమగ్రత, సామరస్యత కోరే పార్టీ జనసేన అని చెప్పా. అమరావతి విషయంలో కొందరు నాపై కుల ముద్రవేశారు. మనది ఒకటే కులం, ఒకటే మతం.. మానవతా కులం.. మానవతా మతం.. నా కుమార్తె క్రిస్టియన్‌, నా కుమార్తె తల్లి రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చికి చెందినవారు. నాకు కులం, మతం అంటగడితే అరికాలి నుంచి మంటెక్కుతుంది. నేను ఏం చేసినా అబద్ధాలు చెప్పను. మిమ్మల్ని మభ్యపెట్టను అని పవన్‌ పేర్కొన్నారు.  విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని  పవన్‌కల్యాణ్‌ అన్నారు. తల తెగినా అడుగు వెనక్కి పడే ప్రసక్తి లేదన్నారు.  ఏదైనా మాట్లాడేటప్పుడు తాను ఆచితూచి మాట్లాడతానని అన్నారు. ఒక దేశపు సంపద అంటే ఖనిజాలు కావని, యువతే దేశ సంపద అని పునరుద్ఘాటించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, సమాజం, దేశంపై వ్యామోహం ఉందని అన్నారు. తాను రూ.కోట్లు సంపాదిస్తానని, కోట్ల పన్ను కడతానన్న పవన్‌.. తనకు సమాజం విూద బాధ ఉందన్నారు. వర్తమాన రాజకీయాలు, నేతలు యువతకు మేలు చేయకపోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. జనసేన పార్టీ పెట్టి 2సంవత్సరాల 9 నెలలు కావస్తోంది. ప్రస్తుతం మూడు అంశాలపై సభలో మాట్లాడతా. జనసేన ప్రస్థానంపై మాట్లాడాలి. ఈ రెండేళ్ల తెదేపా, భాజపా పాలన పైనా మాట్లాడాలి. అడగాల్సినవి ఉన్నాయి. తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. సినిమాల్లో అన్యాయాలను ఎదుర్కోవచ్చు, సమస్యలకు పరిష్కారాలు చూపొచ్చు. సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా రెండు గంటల్లో పరిష్కరించవచ్చు. కానీ నిజజీవితంలో సమస్యల పరిష్కారం అంత సులువు కాదు. నేను ఏ తెదేపా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానో ఆ ప్రభుత్వం తీరు గమనిస్తున్నా. పవన్‌ జనసేన.. మోదీ భజనసేన అని కొందరు అన్నారు. గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌ అన్నారు. భజనసేన అనేది కరెక్టే.. ప్రజా సమస్యలపై నేను భజనసేననే..’ అని పవన్‌కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీకి, తెలుగుదేశానికి భజనసేన అని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లోనే గబ్బర్‌సింగ్‌ రాజకీయాల్లో రబ్బర్‌సింగ్‌ అంటూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటినీ పడాల్సిన అవసరం ఉందనీ, పడతానని పేర్కొన్నారు.

నరేంద్రమోడీపైనా విమర్శలు

ఇందిరా మైదానంలో జనసేన బహిరంగసభలో ప్రసంగించిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ అంటే అభిమానమే కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత అభిమానం మాత్రం తాను మోదీపై చూపలేనని స్పష్టం చేశారు. ¬దాపై మోదీ ఏవిూ తేల్చకపోవడంపై పవన్‌ కన్నెర్ర చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని నాడు చెప్పిన మోదీ.. చనిపోయిన తల్లిపై కప్పే వస్త్రం ఏదైతేనేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చి తీరాలన్నారు. కేంద్రాన్ని చూసి ప్రభుత్వం భయపడాలా? అని ప్రశ్నించారు.

ఏ కథానాయకుడితోనూ విభేదాల్లేవు

సినీ రంగంలో తనకు ఏ కథానాయకుడితోనూ విభేదాలు లేవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను సినీ జీవితం కన్నా, నిజ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటానని తెలిపారు. సినిమాను కేవలం వినోదంగానే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. జనసేనాని వినోద్‌ రాయల్‌ హత్య తనకు చాలా బాధ కలిగించిందన్నారు. క్షణికావేశం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చిందన్నారు. బిడ్డ హత్యకు గురైనా ఆ తల్లి తన బిడ్డ కళ్లను దానం చేసిందని పేర్కొన్నారు. వినోద్‌రాయ్‌ తల్లికి తాను పాదాభివందనం చేస్తున్నానన్నారు.