10న సురవరం రాక

కడప, జూలై 29 : కడపలో వచ్చే నెల 10వ తేదీన ప్రముఖ కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి 26వ వర్ధంతి జరగనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. 20 ఏళ్లు ఎంపిగా.. ఒక మారు ఎమ్మెల్సీగా జిల్లాకు సేవలందించిన గొప్ప మహానుభావుడు ఈశ్వరరెడ్డి అని ఆయన తెలిపారు. నేటి యువతకు ఆయన జీవన విధానం మార్గదర్శకనీయమని చెప్పారు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.