12 శాతం ముస్లిం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 19(జనంసాక్షి):మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ముస్లిం రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రూపొందించిన వెబ్ సైట్‌ను ఉత్తమ్ ప్రారంభించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మైనార్టీలను మోసం చేస్తున్న సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందులోభాగంగా 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ… ఈ నెల 21న అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాల సేకరణ చేస్తామని చెప్పారు. ఈ రిజర్వేషన్ల సమగ్ర సమాచారాన్ని పబీబెతిపస|బజీసలజీబితినీని.తిని వెబ్ సైట్లో పొందుపర్చామన్నారు. 2004లో ఎన్నికల మావిూ మేరకు రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్పారు. కానీ… సీఎం కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే… అమలు చేస్తామన్న హావిూ ఇచ్చి రెండేళ్లవుతున్న నెరవేర్చలేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేవారు.