ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ పరిపాలన – 17

భూమికి,మనిషికి సంబంధాన్ని నిర్థేశించే రెవెన్యూ పాలన ప్రారంభం పూర్వాపరాల చరిత్రను వివరిస్తున్నారు.

మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ఆంధ్రరాష్ట్రభాగంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949సెప్టెంబర్‌ 17నుంచి జమిందారీ రద్దు చట్టం,ఎస్టేట్‌ భూముల చట్టాలు అమల్లోకి వచ్చినట్టుగానే , 1948సెప్టెంబర్‌ 13న నిజాంను ఓడించిన దరిమిలా హైదరాబాద్‌ దక్కన్‌ భూభాగాన్ని భారతదేశంలో కలిపిన తరువాత ,హైదరాబాద్‌ రాష్ట్ర భూభాగంలోకి ఉన్న జాగీర్దారుల పరిపాలన వ్యవస్ధను 1949 సెప్టెంబర్‌ 14న రద్దు చేశారు జాగీర్దురుల రద్దు చట్టంలో పాటు లక్షల ఎకరాలలో సాగు చేసుకుంటున్న కౌలు దారులకు భూమి దక్కడానికి గాను కౌలు దారులు వ్యవసాయ భూపరిమితి చట్టం 1950జూన్‌ 10న నుంచి అమలు లోకి వచ్చింది నిజాం స్వంత ఖర్చుల కోసం ఉంచుకున్న సర్ఫ్‌ఇఖాష్‌ భూములను 1949ఫిబ్రవరి 5నస్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ చట్టాల రావాడానికి వెనుక గల కారణాలకు శతాబ్దాల తరబడి ప్రజల రాచరిక వ్యవస్ధ ద్వారా పడుతున్న శ్రమలు వాటిని తొలగించడానికి ప్రజామోదం పొందిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలురావాడానికి గల నేపధ్యంలో ఇలావుంది. హైదరాబాద్‌రాష్ట్రంలో సాగులోఉన్న భూమి సుమారు ఐదు కోట్ల మూప్త్పె లక్షల ఎకరాలాగా ఉంది .ఇందులో జాగీర్దుల 1922 సంవత్సారానికి 1167మంది ఉంటే 1949నాటికి వీరు 1500కు సంవత్సరానికి గాను పెరిగింది. 40000చదరపు మైళ్లకు వ్యాపించి ఉండి, సుమారు ఒక కోటి యాభైలక్షల ఎకరాలు వీరిస్వంతం పరిపాలన ప్రత్యక్ష పన్నుగా, భూమిశిస్తు రూపంలో ఇతరరూపంలో అందేవి సుమారుగా మూడు కోట్లఎకరాలు ఉంటే అందులో స్ధానిక ంగా లేని భూ స్వాములకు 1891 లోఒ క లక్ష ఎకరాలు. 1875నుంచిచేస్తున్న క్రమబద్ధమైన సర్వే సెటిల్‌ మెంట్‌ ద్వారా 1921లో సంవత్సరానికి గాను వీరి హక్కుల కింద ఉన్న భూమి 7.6లక్షలకు పెరిగింది .ఇవి కాకుండా సర్ఫ్‌ఇఖాస్‌ భూములు 5682 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1373గ్రామాల్లో ఉన్నాయి . పైమూడు రకాల భూములతోపాటుగా సంస్ధనాలా ఆధీనంలో 497 గ్రామాలకు 5030 చదరపు మైళ్ల విస్తీర్ణం వ్యాపించి ఉన్నాయి పై నాలుగు రకాల భూములులలో హైదరాబాద్‌ రాష్ట్రంమొత్తం ఇనాందారుల సంఖ్య 82000ఉండాగా ,ఇందులో 52000 మంది దివాని ప్రాంతంలో 26000 మందిజాగీర్దుల ఆధీనంలో ని భూములోఇతర ప్రాంతాలలో ఉన్నారు. ఈ ఇనాందారుల ఆధీనంలో సుమారు 8లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ భూములను ఎక్కువగా జాగీదార్లులవద్ద ,రాజాలవద్ద దేశ్‌ ముఖ్‌ లవద్ద ప్రభుత్వ ఉన్నత అధికారుల వద్దదేవాలయాల్లొ ,దర్గాలోసేవలందించే వారి వారి జీవనానికి ఇచ్చిన వే ఎక్కువగా ఉన్నాయి. ఇలా భూకేంద్రీకరణ వేధింపులలోనే రైతు ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు జరిగి సామాన్య ప్రజల మేలు కోసం. ప్రభుత్వ ం ఈ చట్టాలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భూభాగంలో కౌలుదారీ చట్టాలు

వ్యవసాయ సంస్కరణలు కమిటీ సూచనలు ,సిఫార్సులను అనుసరించి హైదరబాద్‌ రాష్ట్ర కౌలు ,వ్యవసాయ భూపరిమితి చట్టం1950 జూన్‌నుంచి అమలు లోకి వచ్చింది. ఈచట్టం ద్వారా కౌలు దారులకు రక్షణ కౌలు పరిమాణ నిర్ణయం ,యాజమాన్యం హక్కులు పొందే అవకాశం వచ్చింది. ఈచట్ట పరిధి నుంచి వివిధ  ఛారిటబుల్‌ , మత సంబంధమైన ఇనాం భూములకు మినాహా యింపు నిచ్చారు. ఈ చట్టంలోని

ముఖ్యాంశాలుః

-1342 ఫసలీ నుంచి 1352 ఫసలీ మధ్యకాలంలో ఆరు సంవత్సరాలకు తక్కువ కాకుండా భూములకుకౌలు కు తీసుకొని సాగుచేస్తున్న వారిని ,లేదా 1948 నుంచి ఆరు సంవత్సరాలు కౌలు దారులగా ఉన్న వారిని రక్షిత కౌలుదారుగా గుర్తిస్తారు.

-1953 సంవత్సర నుంచి భూములను కౌలు కు ఇవ్వడానికి నిషేధించారు.

-సరైన సమయంలో అంటే భూమి కౌలుకు తీసుకున్న కాలంలో సక్రమంగా కౌలు చెల్లిస్తున్నప్పుడు కౌలుదారులను తొలగించకూడదు

-కౌలుదారు తనంతట తనే భూమిని భూస్వామికి అప్పగించ దలచిప్పుడు తహసిల్దారుకు రాత పూర్వకంగా నెల రోజులముందే తెలపాలి .తహసిల్దార్‌ అంగీకరించినప్పుడు మాత్రమే అప్పగింత చెల్లుతుంది.

-కౌలుదారు తన ఆధీనంలో ని భూమిని భాగాలుగా చేసి వేరే వారికి కొంత భూమి అందులో కౌలు కివ్వడం జరిగితే  కౌలు ఒప్పందం రద్దు అవుతుంది.

– కౌలుదారు డు భూమికి నష్టం కలిగించినా, వ్యవసాయేత ర కార్యక్రమాలకు భూమిని వినయోగించినా భూస్వామిని స్వాధీనం చేసుకోవచ్చు

-కౌలుదారుడు తన అధీనంలో ఉన్నభూమిని భూ తన బ్యాంకులకు ,సహకార సంఘలకు తనఖా పెట్టవచ్చు.

1950లో సంవత్సరానికి కౌలుదారీ రద్దు చట్టంలో ని రకరకాల షరతులను వినియోగించుకొని భూస్వాములకు కౌలుదారు లను భూముల నుంచి వెళ్ల గొట్టారు. దాన్ని 1952లో సవరణ బిల్లు ప్రవేశపెట్టి1953సంవత్సరానికి భూములనుంచి సాగుదారులను తొలగించడానికి వీలు లేకుండా హైదరాబాద్‌ ప్రినెన్షన్‌ ఆఫ్‌ ఎవిక్షన్‌ ఆర్డినెన్స్‌ ను ప్రభుత్వ తీసుకొచ్చింది. దీని ద్వారా1952లో మార్చ్‌ 21న బేదకల్‌ అయిన భూముకు మళ్ళి వాళ్ల కే ఇప్పిచాలని , కౌలుదారుల అనుమతి లేకుండా అమ్మిన భూములను తిరగి గుర్తించి తిరిగి వారికే  అప్పగించాలని ,కౌలు పరిమాణన్ని భూమిశిస్తు మాగా ణి భూములను మూడు రేట్లుగా ,తోటలకు ఐదు రేట్లు మాత్రమే భూస్వాములపొందాలని నిర్ణయించి ఈచట్టం ద్వారా ప్రకటించారు. భూస్వామికి కౌలుదారునికి తప్పని సరిగా ఒక కుటుంబ కమతాన్ని వదలి అందుకు మూడురెట్లు భూమిని తీసుకోవచ్చు. లేదా కౌలు దారుని కుటుంబ కమతంలో 1భై 3వంతు భూమిని వదిలి అందుకు రెండు రెట్లు భూమిని తీసుకోవచ్చు నని ఆర్డినెన్స్‌ తెలిపింది. ముఖ్యంగా భూమిని కౌలుదారుడు కొనదలచితే తాను భూ స్వామికి ఇస్తున్న కౌలు ఎనిమిది రెట్లుగా బావుల ద్వారా సాగుచేసే భూములకు ,మగాణి భూములకు ఆరు రెట్లు , మెట్టకు పదిహెను రెట్లు కౌలు ధరగా నిర్ణయించారు.ఆ వెలను ఎనిమిది సంవత్సరాల కాలంలో 16 వాయిదాలలో చెల్లించడానికి కౌలుదారుకు అవకాశం కల్పించారు. కౌలు దారు తాను సాగు చేసే మొత్తం పొలాన్ని కొనలేని పక్షంలో ఎంత కొనగలడో అంతకు దానికి మొత్తం చెల్లించి కొనుక్కోవచ్చు .ఒకవేళ భూస్వామి ఇందుకు ఒప్పుకోలేక పోతే ట్రిబ్యునల్‌ కేసు వేసుకొని కౌలుదారు భూమిని పోందే అవకాశం కల్పించారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్‌ 38ద్వారా కౌలుదారులు పలు విధాలుగా భూమిని పొందే అవకాశం వచ్చింది. సెక్షన్‌ 38 ఎ ద్వారా భూస్వామికి ధర చెల్లించి భూమిని పొందొచ్చు 38 బి ద్వారా తనంతట తనే భూమిని కౌలుదారుకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన భూమిని వదులుకోవచ్చు . 38సి ద్వారాభూ స్వామికి కుటుంబ కమతం కన్నా ఎక్కువ భూమిలేని సందర్భంలో కౌలుదారుకు ధర చెల్లించి కొనుకునే అవకాశం ఉంది. సెక్షన్‌38డి ద్వారా రక్షిత కౌలుదారుకు భూస్వామి నుంచి నోటిసు అందుకున్న తరువాత కౌలుదారు ఆరునెలలుకూడ భూమిని ధర చెల్లించి కొనుక్కునే సదుపాయం ఉంది. సెక్షన్‌ 38ఇ ద్వారా ప్రభుత్వానికి విస్త్రుత మైన అధికారులు సంక్రమించి ,భూస్వామికి రక్షిత కౌలు దారుకు భూమిఇవ్వకూడదని నిర్ణయించుకున్నా కూడ., విచారణ ద్వార భూమికి భూస్వామికి నిర్భంధంగా స్వాధీనం చేసుకొని కౌలుదారుకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. యకౌలు దారునకు రెవెన్యూ విభాగాధికారి ద్వారా ఆక్కుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌ ని జారీ చేస్తారు, దీనిని ప్రభత్వ గజెట్‌ సంఖ్య 29తేదీకి 1954 ఫిబ్రవరి 4న ప్రచురించిన దానిక ిముందు తేదీన రక్షిత కౌలుదారు అధీనంలో ఉన్న భుమికి వర్తిం పచేసి ఒఆర్‌సి జారీ చేస్తారు. ఈ చట్టంలో సెక్షన్‌ 40ద్వారా రక్షిత కౌలుదారు వారుసులకు కూడ యాజమాన్యం హక్కులు లభిస్తాయి కుటుంబా కమతానికి లెక్కించే భూమికి మూడురెట్లు భూమిని ఒకభూస్వామిని తన యాజమా న్యం హక్కుకింద ఉంచుకునే అవ కాశం వుంది. ఒకకుటుంబ కమత నికి భూమి రకాన్నిబట్టి ఇలా విబ óజించారు. నీటి పారుదల ద్వారా సంవతత్సరానికి ఒకపంట పండే భూమి ఆరునుండి తొమ్మిది ఎక రాలు ,మెట్టలో నల్ల రేగడి భూమి 24నుండి 36 ఎకరాలు మెట్ట భూమిలో చల్క భూములు 48 నుంచి 72 ఎకరాలు ఒక కుటుంబ కమతంగా నిర్ణయించారు. పంట కు అయ్యేఖర్చుకు యాభై శాతం మినహాయించి ప్రభుత్వం అక్కడి స్ధానిక పరిస్ధితలు కనుగుణంగా భూమిని యాజమాన్యం హక్కుకు వదిలేయవచ్చు. మూడు కుటుంబ కమతాల కన్నా ఎక్కువ ఉన్న భూమిని రెవిన్యూ అధికారులు కౌలు దారులకు ,ఇతరులకు చట్టంలోని వివిధ సెక్షన్లఆధారంగా కేటాయిస్తారు.

జాగీరు రద్దు చట్టం 1949

1941సెప్టెంబరు 14న హైదరాబాదు జాగీరు రద్దు నిబంధనల చట్టం చేశారు. ఈ చట్టం ద్వారా 1949 సెప్టెంబర్‌ 18 నుంచి 1949 సెప్టెంబర్‌ లోపు 7860 గ్రామాలలోని 975 జాగీర్ధార్లను తొలిగించడమే కాకుండా వారి ఆధీనంలోని భూమి శిస్తు లెక్కలను ఇతర భూ రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీరు వసూలు చేసే భూమి శిస్తుకు 12.5 శాతం రాయితీ కూడా ఇచ్చారు. జాగీర్థార్లకు వారు కోల్పోయిన భూమికి బదలాయింపు రుసుం (కమ్యూటేషన్‌) ఇవ్వడానికి జాగీరు అడ్మినిస్ట్రేటర్‌లను సహాయ జాగీరు, అడ్మినిస్ట్రేటర్‌లను నియమించారు. జాగీర్థారులు కమ్యూటే షన్‌ పొందడానికి గాను వారి ఆధీనంలో ఉన్న ఇనాంలు, ఇతర భూముల విచారణ పూర్తి చేయడానికి వారి వారసుల నిర్థారణకు, వీరికి ప్రభుత్వాలు కాని, సమర్థ అధికారులు కాని గ్రాంట్‌ చేసిన పత్రాలను పరివీలించడానికి వాటిని సమయ నిర్థారణకు పత్రాలను బట్టి వారికి జాగీరు భూములలో ఇచ్చిన హక్కులకు సంబంధించి విచారణ జరిగిన తరువా మాత్రమే వారికి కమ్యూటేషన్‌ను, పెన్షన్‌ను మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని విచారించడానికి, 1952లో అతియత్‌ ఎంక్వైరీ ను చేశారు. (అతియత్‌ అంటే దానం చేయడం) ఈ చట్టం ద్వారా విచారణ జరపడానికి అతియత్‌ డిప్యూటి కలెక్టర్‌ అతియత్‌ కలెక్టర్‌ నాజిమ్‌ అతియత్‌ చివరగా బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ దగ్గర అప్పీలుతో విచారణ ముగిసి మీదా, ఇతర ఆదాయాలు వసూలు చేసుకోవడానికి ఉన్న హక్కులు లేదా వసూలయిన వాటిలో వీరికిచ్చిన వంతు ప్రతిఫలాన్ని నిర్థారించే పత్రాలను (వీటిని ముతఖబ్‌ లేదా వాసిఖ్‌ అంటారు. వీటిని నిజాం పాలనలో జాగీర్థారులు ఇతరలుకు భూమిని ఇవ్వడానికి ఎన్నుకొన్నా తరువాత ఇచ్చే దృవపత్రం. వీటిని రిజిష్టరుగా కూడా తయారు చేస్తారు) పరిశీలించి, వీరికి వచ్చే కమ్యూటేషన్‌ను వీరి వాటాకు వచ్చే భూమిని నిర్ణయించి ఈ అతియత్‌ కోర్టులు ఉత్తర్వులిస్తాయి. అతియత్‌ కోర్టులు సివిల్‌ కోర్టులకు వారసత్వం లాంటివి పంపిస్తేనే సివిల్‌ కోర్టుల విచారణ పరిధిలోకి వస్తాయి కాని మిగతా గృహవసరాలకు ఉపయోగం చుకునే స్ధలాలు,వాటి చుట్టూ ఉండే ఓలం తోటలకు మినహాయింపు.

– ఎస్‌ సరళా వందనం

(వీక్షణం సౌజన్యంతో )