2జి కుంభకోణం – మీడియా ద్రోహం

మర్యాదస్తులకి ఈ అవమానం ఎంటని మధ్యతరగతీ, మీడియా బాధపడు తు న్నాయి. అనిల్‌ అంబానీ, వేణుగోపాల్‌ధూత్‌ వం టి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఈ కుంభకోణం లో ప్రత్యక్ష పరోక్ష సంభందమున్నప్పటికీ చట్టం వాళ్ల జోలికి పోదు. కనీసం వాళ్లనేమీ చేయరా అని అడిగే ప్రయత్నంచేయదు మీడియా. ప్రజల కోసం పనిచేసే వాళ్లని దేశ ద్రోహులనీ. జాతి వ్యతిరేకులనీ చిదంబరం మన్మోహన్‌ సింగ్‌ అంటే అక్షరం పోల్లుపోకుండా రాసి మద్దతిచ్చే చానళ్లుగా పేపర్లు వాల్లే ఇంత ద్రోహనికి పాల్పడ్డారని రాయవు. పైగా సంర్దిస్తాయి. కూడా ప్రజా ఉద్యమాల్లో భాగంగా ప్రజలు బంద్‌లను పిలుపిస్తే ఆ రోజు దేశానికి ఎన్నివేల కోట్ల రూపాలయలతో ఏంచెయ్యెచ్చో రాయవు. రెండు సంవత్సరాలుగా పాటు అంద్రప్రదేశ్‌ లాంటి రాప్ట్రాల్లో పన్నుల లేకుండా చెయ్యెచ్చోని విదేశీ అప్పు తీరొచ్చని రాయవు. ఎందుకంటే ఇలాంటి ఐడియాలు ప్రజలకివ్యడం మీడియాకి నచ్చదు. అసలు మీడియా ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తుందని అనుకోవడం భ్రమ. ఎందుకంటే తనెటువైపుందో మీడియాకు తెలుసు. అంతిమంగా ఎవరి ప్రయోజనాల్ని కాపాడాలో దానికి తెలుసు అందుకే ప్రత్యామ్నాయ మీడియను అభివృద్ది చేసుకోవడం అన్ని వధాలా సహాకరించడం ప్రజలకు తక్షణ అవసరం భిన్నస్వరాల్నీ భిన్నధృక్కోణాల్ని ప్రతిఫలించే ప్రజలకు ప్రజా ఉద్యమాలకు ప్రత్యామ్నాయ మీడియా దోహదం చేస్తోంది. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు. ఉద్యమాలు ఎలా అవసరమో వాటిని పరిపుష్టం చెయడానికి వ్యవస్థ నిజస్వరూపాల్ని బహిర్గతపరచడానికి ఇది ఎంతో అవసరం.