2015 కు ముందు ఆధార్ పొందిన వారు మరోసారి నమోదు తప్పనిసరి
కొత్తగూడ అక్టోబర్ 21 జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఈ డిస్ట్రిక్ మేనేజర్ ప్రశాంత్ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు,లబ్దిదారులు ఎంపిక,బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు,కుల,ఆదాయ,స్థానికత ధ్రువీకరణ పత్రాలకు,స్థలాల రిజిస్ట్రేషన్లకు,సిమ్ కార్డుకు,రేషన్ కార్డులకు,స్కాలర్షిప్ పొందుటకు ఇలా అన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు.2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ యుఐడిఏఐ ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి నమోదు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఎస్ ఆన్లైన్ డిస్ట్రిక్ మేనేజర్ రాకేష్ శర్మ,టీఎస్ డిస్ట్రిక్ మేనేజర్ రఘుపతి,ఎంపీడీవో భారతి,డిప్యూటీ తాసిల్దార్ నర్సయ్య,ఆధార్ ఆపరేటర్లు రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area