23 నుంచి న్యాయ అవగాహనా సదస్సులు
శ్రీకాకుళం, జూలై 21 : ఈ నెల 23 నుంచి న్యాయ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా సాధికారిత సంస్థ కార్యదర్శి ఎం.సువర్థరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అరసవల్లి పురపాలక ఉన్నత పాఠశాలలోను, 24వ తేదీ ఉదయం 10గంటలకు పట్టణంలోని గుజరాతీ పేటలోగల వరం ఉన్నత పాఠశాలలోను, 25వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోను, 26వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు అఫీషియల్ కాలనీలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్లోనూ, 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాగోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను, 30వ తేదీ సాయంత్రం 4గంటలకు పట్టణంలోని ఆర్టిసి కాంప్లెక్స్ దగ్గరలో గల వికాస్ ఉన్నత పాఠశాలలోను, 31వ తేదీ ఉదయం 10గంటలకు కిల్లిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.