26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25:

ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఐదు ప్రధాన కూడళ్ల నుంచి క్రీడా జ్యోతితో ప్రారంభమై, స్థానిక వినాయక గార్డెన్‌ వద్దకు రన్‌ చేరుకుంటుందన్నారు. వినాయక ఘాట్‌వద్ద 9కోట్ల రూపాయలతో నిర్మించిన వాకర్స్‌ ట్రాక్‌ను మంత్రి టి.జి.వెంకటేశ్‌ ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం ఆ ట్రాక్‌లో క్రీడాకారుల కోసం 5-కె రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు 25వేల రూపాయల నగదు అందజేస్తామన్నారు. ఒలంపిక్‌ డే రన్‌లో మంత్రితో పాటు అధికారులు, రాజకీయ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొంటారని రవూఫ్‌ తెలిపారు.