30న కె విశ్వనాధ్‌చే ఘంటసాల విగ్రహావిష్కరణ

కాకినాడ,జూలై 5 :ఈనెల 30వ తేదీన కళాతపస్వి కె విశ్వనాధ్‌, కేంద్రమంత్రి  ఎంఎం పళ్ళంరాజుచే ఘంటసాల వెంకటేశ్వర్రావు  కాంస్య విగ్రహం ప్రారంభించనున్నట్టు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలాత్రిపుర సుందరి ఆలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఘంటసాల విగ్రహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎస్సై కృష్ణారావు, డిఇ, ఎఇలు సత్తి కృష్ణారెడ్డి, పంపన దయానందబాబు, యాళ్ళ నారాయణమూర్తి, కొలగాని దుర్గాప్రసాద్‌ ఉన్నారు.