31న యూపీఏ భేటీ


ఆర్‌ఎల్డీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌
మిత్రులు అనుకూలమే
తర్వాతే సీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ, జూలై 28 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ విష యమై రెండు పర్యాయాలు కోర్‌ కమిటీ భేటీ నిర్వహించిన అధి ష్టానం, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షు డితో విస్తృత చర్చలు జరిపిన కాంగ్రె స్‌ ఇక ఈ అంశంపై ఇక పార్టీ వైఖరి ప్రకటించడమే తరువాయి అని చెప్పింది. 2009 డిసెంబర్‌ ఏడు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుర్తింపు పొందిన అన్ని రాజ కీయ పార్టీల అభిప్రాయాలు సేకరించిన కేంద్ర ప్రభుత్వం ఇకపై ఎలాంటి సంప్రదింపులు జరుపబోదని స్పష్టం చేశారు. ఈమేరకు యూ పీఏ భాగస్వామ్య పక్షాలతో మొదట భేటీ నిర్వహించాలని నిర్ణయిం చింది. ఈమేరకు ఈనెల 31న యూపీఏ భాగస్వామ్యపక్షాలు రాష్ట్రీయ లోక్‌దళ్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఈ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవపాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ ఇప్పటికే పలుమార్లు తెలం గాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. వరంగల్‌ కేంద్రంగా టీఆర్‌ఎస్‌ తెలంగాణ సాధన కోసం నిర్వహించిన సమావేశంలో పాల్గొని తెలం గాణ ఏర్పాటు ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షు డు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ పలు సందర్భా ల్లో తెలంగాణకు మద్దతు ప్రకటించారు. తమ పార్టీ తెలంగాణ శాఖను కూడా ఆయన ఏర్పాటు చేయించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, కేంద్ర మంత్రి ఫారుక్‌ అబ్దుల్లా కూడా విభజనకు అనుకూలంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో యూపీఏ భేటీ నామమాత్రమే కానుంది. యూపీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాన్నే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ముం దు పెట్టి పార్టీ పరంగా తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తనను కలిసిన పలువురు కేంద్ర మంత్రులు, సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ ఆమె నిర్ణయాన్ని ఆమోదించి తీరాల్సిందనేనని స్పష్టం చేశారు.