ఖమ్మం జిల్లాలో జల దిగ్భంధంలో 35 గ్రామాలు

హైదారాబాద్‌: ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లివాగు వంతెన పై నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలోని ఉండ్రజు పేట వద్ద రహదారి పైకి వరద నీరు చేరడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకోవడంతో 16 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులుగా ఉంది.