350 ఆలయాల్లో మనగుడి సంబరాలు

శ్రీకాకుళం, జూలై 27 : శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి శ్రావణ మాసం సంబరాలు పూజ సామాగ్రి జిల్లాకు కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపానికి చేరింది. జిల్లాలో మూడు డివిజన్లలో 350 దేవలయాల్లో నిర్వహించనున్న మనగుడి ఉత్సవాలకు తిరుపతి టిటిడికి చెందిన ఎనిమిది మంది అధికారులు వచ్చారు. మనగుడి జిల్లా ఇన్‌ఛార్జిగా తిరుమల తిరుపతి దేవస్థానం సూపరిటెండెంట్‌ పి.బాలరాజును, శ్రీకాకుళం ఇన్‌ఛార్జిగా తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి, హేమశేఖర్‌, పాలకొండ డివిజన్‌కు పార్థసారథి, చంద్రకుమార్‌ రాజు, టెక్కలికి ఎవిడి నాగేశ్వరరావు, కామరాజులను నియమించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు మనగుడి పూజ సామాగ్రిని పంపిణీ చేయనున్నారు.