39వ రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్ష
ములుగు,ఆగస్ట్31(జనం సాక్షి):-
ములుగు జిల్లా లోని లక్ష్మీదేవిపేట కేంద్రంగా చుట్టూ 15 గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 39వ రోజుకి చేరాయి.మండల ఏర్పాటు జరిగే వరకు దీక్షలు కొనసాగుతాయని మండల సాధన సమితి నాయకులు తెలిపారు.
ఈ రిలే నిరాహారదీక్షలో తండ రమేష్, అంతటి రాము,జిముడ రాజు,కొండ శంకర్,చెన్న శ్రీనివాస్,గట్టు సాంబయ్య,పబ్బ రమేష్,రత్నం రత్నాకర్,రవి,దేవేందర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.