5న జిల్లాస్థాయి నృత్యపోటీలు

మహబూబ్‌నగర్‌: ఈనెల 5న జిల్లాస్థాయిలో భరతనాట్యం, కూచిపూడి, జానపదనృత్య పోటీలు జిల్లా కేందం మున్సిపల్‌ టౌనుహాల్‌లో నిర్వహించనున్నట్లు చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మెట్టుకాడి శ్యాంసుందర్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సాంప్రదాయ కళల పరిరక్షణకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల కళాకారులు ఆరోజు ఉదయం 10:30 గంటలకు జరిగే పోటీల్లో పాల్గొనాలని కోరారు. వివరాలకు 97001 81778, 97056 82007 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.