ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ
ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎడతెరిపి లేకుండా గత యాభై సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వేలాది మంది రైతంగ వీరులు తమ ప్రాణాల్నీ దారిపోశారు. ఇంత వరకు కోలిక్కివచ్చినట్లు కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ అయితేనే తమ బతుకులు బాగుపడతాయని నాలుగు కోట్ల మంది ప్రజలు గం పెడు ఆశలతో వున్నారు. సమాఖ్యంద్రు ల్లో తమ బతుకులు వెట్టి చాకిరిగానే మిగిలాయని తెలంగాణ ప్రాంతంలో ఉన్న సహజ వనరు లను సీమాంధ్ర దోపిడి దారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా అవకాశవాధంగా తెలంగాణ వాదాన్ని చక్కభజన చేస్తున్నారు తప్ప తెలంగాణపై చిత్తశుద్ధి కోరవడింది. ఓ ట్లు, సీట్లు అధికారం కో సం పాకులాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అంతిమ నిర్ణయం కాని ఇక్కడ ప్రజస్వామ్య హక్కులను పూర్తిగా కాలరాయ బడినాయి. తెలంగాణ ముక్కోటి గొంతుకలు ప్ర త్యేక రాష్ట్రం కావాలని తన వాయిసీను వినిపించడమే కాదు. ప్రజా పోరాటాల్లోకి తమ పాత్ర క్రియశీలకమయినది. విద్యార్థులు యు వజనులు, కార్మికులు, కులసంఘాలు, సకల జనులు ఆకాంక్షలను పోలీసు బలప్రయోగం ద్వారా అణచివేస్తున్నారు. ఎంతసేపటికి తెల ంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్ల సంబంధం అంగడు తున్నారు. ఏదో ఒక విధంగా తెలంగాణ ఉద్యమాన్ని జోరం దుకునే సమయంలో ఆందోళనకారులు ఉద్యమాకారులపై తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి జైలు నాలుగు గోడల మధ్య నిర్భందిస్తూ వేదిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భూ విముక్తి కోసం నాలుగు వేల మంది రైతంగవీరులు తమ రక్తలను దారపోశారు. 3.500గ్రామాలను విముక్తి పథం నడిపించా రు. నైజాంకు గోరి కట్టించారు. ఉద్యమ చరిత్ర తెలంగాణకు ఉంది. త్యాగాల చిరునామా తెలంగాణ ఏ పల్లేలో వెళ్లి చూసిన అమరవీ రుడి చరిత్రలు కనిపిస్తుంటాయి. 1969లో 369మంది అతి కృరంగా కాల్చి చంపారు. గతంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్య మాన్ని బుజాన వేసుకున్నప్పటికీ మంత్రి పదవులు గవర్నర్ పదవికి తెలం గాణ ప్రజలు అత్యగౌవన్ని తాకట్టుపెట్టినాడు. తెలంగాణ ప్రజా సమి తికి 11ఎంపీ సీట్లు గెలిపిస్తే చివరకు మరసిపోలేని ద్రోహం చేసా డు. కాంగ్రెస్‌లో కలిపేశారు. ప్రజలకు చరిత్రలో మరసిపోలేని ద్రో హం చేసాడు. తెలంగాణ ఉద్యమం బలంగా వస్తున్నప్పుడల్లా పాల కులు ఎదో ఒక విధంగా ఉద్యమాన్ని ఎలాగోలా నీరుగార్చే విధంగా ప్రయత్నిస్తారు. అది పూర్తిగా నిర్వీర్యమవుతుంది. 1994లో ప్రారంభ మైన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అప్పటి సీమాంధ్ర ముఖ్యమం త్రి నారాచంద్రబా బునాయుడు ప్రజా ఉద్యమాలపై తీవ్రమయిన రాజ్యాహింసను ప్రయోగించారు. పాట తూటనైందుకు బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికించారు. కవులు కళాకారులు బుద్ది జీవులపై దాడి చేయించారు. తెలంగాణ పాలిట చంద్రబాబు ముర్ఖం గా వ్యవహరించారు. అధికారం కోల్పోగానే మళ్లీ టీడీపీ నేతలు తె లంగాణ జపం చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం రెండు కళ్ల వాడి నని ఇప్పటికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాడు. ఎటు తేల్చుకోలేని పరిస్థితి టీడీపీది. సామాజిక తెలంగాణ కోసం తెలం గాణ పార్టీ ఏర్పాటు చేసిన దేవెందర్‌గౌడ్ తిరిగి టీడీపీ గూటికి చేర డంతో అంతర్యమేమిటి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం గంటకో చిత్తం, పుటకో మాట తెలంగాణ ఇస్తామంటారు. ఇవ్వనే ఇవ్వరు సీమాంధ్ర నేతలు లాబీయింగేలు బాగా పనిచేస్తున్నాయి. నాటి నుం చి నేటి దాకా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఇక బీజేపీ పార్టీ తెలంగాణపై చిలుక పలుకులు పలుకుతుంది. ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే నెల రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు ఎట్టుకోవడం రాజకీయ వ్యభిచారం కాదా గతంలో బీజేపీ చేసిన కాకినాడ తీర్మానంను కాకులు ఎత్తుపోయినట్లయింది. చత్తీస్ ఘడ్ జార్ఖండ్ ఉత్తరాంచలే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఇప్పుడు తెలంగాణపై బీజేపీ సవతి తల్లిప్రేమ ఎలా. నవ్వలో ఏడువాలో అర్ధం కానీ పరిస్థితి దాపురించింది. ఉమ్మడి రాష్ట్రాల అభివృద్ధి తమ ద్యేయమని సీపీఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. కేంద్రం లో తెలంగా ణ ఇస్తామంటే తాం అడ్డుకుంటాము లేక ఇచ్చే వాళ్ల ము తెచ్చే వాళ్లము అంటూ రాఘవులు అంటాడు. సీపీఐ ఇతర వామపక్ష పార్టీలు తెలంగాణ ఉద్యమంలో క్రీయా-శీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంత సేపటికి తెలంగాణను రాజకీయ పావులుగా వాడుకుం టున్నారు. తప్ప ప్రేమతోకాదు. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటన నీరుగారింది. దీంతో సీమాంధ్రలో కృతి మ ఉద్యమాన్ని సృష్టించారు. సీమాంధ్ర ప్రజలలో బలంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆకాంక్ష ఉంది. లగడపాటి రాజగోపాల్ కావూరి సాంబశివరావు రాయి పాటి సాంబశివరావు టీజీ వెంకటేష్‌ల వ్యాపా రులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ సహజ వనరులను జలగ లుగా దోచుకుం టున్నారు. అందుకే వీళ్లు సీమాంధ్రజనం చేస్తున్నారు. ఏర్పాటు వాధులని వింతగా మాట్లాడుతున్నారు. అన్నద మ్ముల్లా కలిసుందా మని చెబుతున్నారు. కాని ఎందుకు కలిసుండాలో సమాధానం చెప్పడం లేదు. వీడిపోయేందుకు తెలంగాణ ప్రజలు లక్ష జవాబు లు చెబుతున్నారు. సీమాంధ్రనేతలు నాటికి వచ్చిన అ న్నంను గుంజుకున్నట్లుగా వుంది. వాళ్లు పాపల వచ్చిన అన్నంను గుంజుకున్నట్లుగా వుంది. వాళ్లు పాపల బైరవులుగానే మిగిలిపోక తప్పదు. తెలంగాణ ప్రాంతానికి యుగ యుగలుగా పోరాట చరిత్ర వుంది. దోపిడి అణచివేతలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటలు ముం దుండి నడిపించారు. త్యాగాలు వారికి సొంతం. బాంచెన్ దొర కాల్మొక్త అనే చరమ గీతం పాడారు. వేలాది మంది భూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు అణచివేతలకు దోపిడికి గురవుతున్నా రు. విద్యార్థులు, యువకులు ఇప్పుటి వరకు సుమారు 1350మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. లక్షలాది మంది జైళ్ల పాలయ్యారు. లాఠీలు, తుటాలకు అనారోగ్య బారిన పడి చావు బతుకుల మధ్య జీవిస్తున్నారు. అయినా కేంద్రంలో సోనియాకు మనస్సు కరగడం లేదు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు ద్రోహం చేసిన కమిటయింది. తెలంగాణ వాధాన్ని అడ్డుపెట్టుకుని దీనిని ఎన్నికల స్టంటుగా మార్చు కుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ప్రజలపై గౌరవం లేని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు నెహ్రూ ఇందిర గాంధీ రాజకీయ గాంధీ నేటీ సోనియా దాకా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారు. ఇది జగమేరి గిన అక్షర సత్యం. తెలంగాణ ఉద్యమం ఉవ్వేత్తున జరుగు తున్న క్రమంలోనే దోపిడి కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఔటర్‌రింగ్ రోడ్డు ద్వారా ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా రైతులు భూ నిర్వాసి తులుగా లక్షలాది మంది మారారు. తెలంగాణ ఇవాళ తాడు బొంగు రం లేకుండా పోయింది. ఉనికి ప్రశ్నర్థకంగా మారింది. పోలవరం ప్రాజెక్టు మూలంగా సీతరామునికి బంధం కలిపిన సీతరా ముని గుడి చారిత్రకమయిన నీట మునిగి పోతుంది. భద్రచలం డివిజన్ పూర్తిగా నీట మునుగుతుంది. పోలవరం ప్రాజెక్టు కేవలం బహుళ జాతి సంస్థల మెప్పుకోసమే దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఓపెన్ కాస్ట్‌లతో సింగరేణి పూర్తిగా బొందలగడ్డగా మారుతుంది.
-దామరపల్లి నర్సింహారెడ్డి
తరువాయి భాగం రేపటి సంచికలో..