స్థానిక వనరులు స్థానికులకే దక్కాలి


‘బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు’ అనే నినాదంలో ప్రాంతీయ అకాంక్షలతో సాటుద స్థానిక సంపద, స్థానికులకే దక్కాలనే ప్రజాస్వామిక విలువ ఉంది. దీనిని ప్రాంతీయ అసమా నలతలపై పోరాటంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు సామ్రాజ్యావాద వ్యతారేక ఉవ్యమానికి ప్వాలంభన, స్వయం నిర్ణయాధికార లక్ష్యాల్లో చాటుతున్నారు. దోపిడి, అసమ అభివౄద్ధి ఆధారంగా సడుస్తున్న వ్యవస్థపై మౌలిక ప్రశ్న ఇందులో ఉంది. పెట్టుబడిదాని విస్తరణకు చవకగా ముడిసరుకులు దొరికే ప్రాంత లను, వాటిని మార్కెట్‌ చేసుకోవాడనికి అనువైన కేంద్రాలను అఢివృద్ధి చుసుకుంటున్నాయి. అట్లా చవకగా రొరికే వనరుల కోసమైతేనేమి, భూముల కోసమైతేనేమి వలసలు అంతర్గత వలస లు సాధారణ తెలంగాణలో ఎన్నో అనుకూలతలు చూశారు. ఆ తర్వాత పరిణాయలు అంశాలున్న కీలకంగా అది అసమ అభివృద్ది దని, వనరుల దొపిడిని ప్రశ్నింస్తోంది. రాష్ట్ర అభివౄద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురూనా రాయలసీమలో దీనికి బిన్నమైన స్థితి ఉంది. రెండు ప్రాంతాలు అనేక హామిలకు గురి అయ్యాయి. అయితే రాయలసీమకు బాయటినుండి పెట్టుబడులు రాలేదు (అందుకు అనుకునమైన పరిస్థితి లేదు) పెట్టుబడిదారులు అబివృద్ధి కాలేదు. ఇక్కడ భూస్వామ్య భావజాలం పునాదిపై ఎదిగి వచ్చిన నాయక త్వం. భూమిని. గనులను కొల్లగోట్టి అమ్ముకునే ఒక లంపెన్‌ దళారీ వ్యవస్థ అబివృద్ధి చెందింది.అది రాయలసీమ గుదిబండగా మారింది. రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పై వర్గం నుండి ఎదిగి వచ్చిన రాయలసీమవాళ్లే ఉంటారు. రాయలసీమ సాంఘీక, రాజకీయర్థిక రంగాలన్నీ వీళ్ల అదీనంలో ఉంటాయి. ఇక్కడి ఇక్కడి ఫ్యూడల్‌ పునాదులను కాపాడుకుంటూ వీళ్లు రాష్ట్ర స్థాయిలో వ్యవహారాలు నడుపుతారు. కోస్తా, ప్రాంతపు నామకులకు పూర్తి అనుకూలంగా ఉండే వీళ్లవల్ల రాయలసీమకు మరింత నష్టమే జరిగింది. రాయలసీమ అభివృద్ధి కోసం జరిగిన ఉధ్యమాలు ముఠా నాయకులుకు సోపానాలుగా మారాయి. అట్లా ఈ ప్రాంతం నుండి ప్రామిసింగ్‌ లీడర్‌గా ఎదిగి వచ్చిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అయిదే ళ్లూ చాలా హడావిడి చేశాడు. అందులో బ్రహ్మీణీ ఉక్కు పరిశ్రమమ స్థాపన ఒకటి. దాని చుట్టూ ఆయన స్వర్డమే చూపించాడు. ఆది ఖనిజ సంపదను ఇక్కడే వినిమోగంలోకి తేవాలనే డిమాండ్‌ను అంత బలంగా ముందుకు ఫ్యాక్షన్‌ రక్తపు ముడుగుగా ప్రసిద్ధికెక్కిన జమ్మలమడుగు పారిశ్రామిక కేంద్రంగా తన తలరాత మార్చుకోబో తుందని జమ్మలమడుగే కాదు, మన ముఖ్యమత్రి కడప జిల్లా రూపమే మారుస్తాడని ఆనాడు ప్రజా ప్రతినిథులన్నారు. అనుచర గణం కేరింతలు, జనం చప్పట్ల మధ్య అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌లో సుపుత్ర పరివార సమేతంగా జమ్మలమడుగులో అడుగుపెట్టి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి వెళ్లారు. 1.7 మిలియన్‌ టన్నుల భారీ సామర్థ్యంతో నిర్మించబోయే భారీ ఉక్కు ఫ్యాక్టరీ, ఒక పెద్ద విమానాశ్రయం వస్తుందని, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు మాదిరి ఇక్కడ విమానాలొచ్చి దిగుతాయని, లక్ష మందికి ఉపాధి కల్పించబడుతుందని అర చేయి లో అన్నీ చూపిం చారు. అన్నట్లుగానే చకచకా పనులు ప్రారంభమయ్యాయి. ప్రారం భమయ్యి అవి కొనసాగుతూనే వచ్చాయిగాని ఫ్యాక్టరీ నిర్మాణం అప్పుడప్పుడే పూర్తయ్యేలా కనిపించలేదు. ఇంకో సంవత్సరం లో….ఇంక కొద్ది నెలల్లో … అంటూ పత్రికల్లో ప్రకటిస్తూ వచ్చారు. భూసేకరణ దగ్గరి నుండి ప్రహరిగోడ నిర్మాణం, మైలవరం నీళ్ల మళ్లింపు వంటి అనేక విషయాల్లో నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తూ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఈగ వాలనివ్వలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు బ్రాహ్మణి స్టీల్స్‌ అధినేత గాలి జనార్ధన్‌రెడ్డి అంగరక్షకుల్లా వ్యవహరించారు. బాలగోపాల్‌ వంటి పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాలు రూల్సు మాట్లాడి తే, ప్రభుత్వం, అధికారులు ఆయన కోసం ఏకంగా రూల్సు మార్చి చూపించారు. ఇంత హంగామా చేసి నాటకం రక్తి కట్టిస్తూ గాలి జనార్థన్‌రెడ్డి మాత్రం ఫ్యాక్టరీ కోసమని లీజుకు తీసుకున్న ఇనుప ఖనిజం గనులను దర్జాగా దిగమింగేసి కలిసిరాని కాలంలో జైలుకె ళ్లాకగాని బ్రాహ్మణీ స్టీల్స్‌ అనేది ఒక కల్పనఅని, ఇనుప ఖనిజాన్ని తెగనమ్ముకోవడం కోసం వైఎస్‌ సహకారంతో దాన్ని స్సష్టించారని అర్థం కాలేదు. 2007లో బ్రాహ్మణీ ఉక్కు పరిశ్రమ కోసం ప్రభుత్వం 10,750 ఎకరాల భైమిని కేటాయింనప్పటిక నుండి వరుసగా జరిగిన కుంభకోణాలు బైటికి వచ్చాయి. 20 వేలకోట్ల రూపాయల విలువైన కాప్టిన్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం కేటాయంచిన భూమితో పాటు ఇంకో 4 వేల ఎకరాలు ఇక్కడే నిర్మాణమయ్యే విమానాశ్రయం కోసం కేటాయి స్తున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి ఆనాడు పెద్ద సబ పెట్టి మరీ ప్రకటించాడు. ఈ నాలుగువేల ఎకరాలకు కూడ విమానాశ్రయం కోసం అభివృద్ది చేసేందుకు గాల జనార్ధన్‌రెడ్డికే ఇచ్చారు. సేకరిం చిన భూములకు ఎకరానికి 18, 500 లెక్కన ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. 18 కోట్ల రూపాయలతో భూములు కొని దాన్ని చూపించి గాలి జనార్ధన్‌రెడ్డి 350 కోట్ల రూపాయల బ్యాంకు రుణం పొందాడు. ఇనప ఖనిజం గనుల తవ్వడానికి కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు ఆ గనులు క్యాప్టివ్‌ యూనిట్‌ అని చెప్పి వేరే ఎవ్వరినీ పోటీకి రానివ్వలేదు. క్యాప్టివ్‌ యూనిట్‌ అంటే అది ఫ్యాక్టరీలో ఉత్పత్తి కోసమే వాడాలి తప్ప బైట అమ్ముకోడానికి వీల్లేదు. తీరా వాటిని గాలి జనార్ధన్‌రెడ్డికి కేటాయించాక ఖనిజాన్నిఎ క్కడైనా అమ్ముకోవడానికి పర్మిషన్‌ ఇచ్చారు. ఎప్పటి నుండో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా కాదని ఇంకా నిర్మాణంలో కూడడా లేని బ్రాహ్మణీకి గనులు కేటాయిం చారు. ఆనాడు రాయలసీమ అభివృద్ది కేనని చెప్పారు. రాయలసీమ భూమిని, గనులను కబ్జాదారుకిచ్చి రాయలసీమను రాయలసీమ నాయకులే వంచించారు. ఇదేమీ కొత్త కాదు. ఇక్కడ రాజకీయా ధిపత్యం భూమి మీద, భూగర్భ సంపద మీద ఎంతగా పెరుగుతూ వచ్చిందో ప్రజలు అంతకంతకూ దారిద్య్రంలోకి నెట్టబడుతూ వచ్చారు. సిబిఐ విచారణలో ఎంత తవ్వారు, ఇవరికి అమ్మారు, ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు ఎవరిచ్చారు’ ఏం తేలింది, ఎంతమంది గుట్టు బయటపడింది. అన్న విషయాలు అలా ఉంచితే ఈ కేసుల హడావుడి కాన్న ముందు గడిచిన నాలుగేళ్లలో ఇనుప ఖనిజం రవానా ఎన్ని ప్రనాణాలను బలిగొన్నదో లక్కేలేదు. దారి పొడవునా మనుషులు, పశువుల ప్రాణాలు గాల్లో కలిపేస్తూ రోడ్లను నాశనం చేస్తూ, ఎర్రటి దుమ్మును ఎగజిమ్ముతూ గాలిజనార్ధన్‌రెడ్డి , జగన్మో హన్‌రెడ్డి అనుయాయుల వాహనాలు ఖనిజాన్ని ఓడరేవుకు చేర్చా యి. క్రిష్ణపట్నం రేవు ప్రాంతాన్ని కలుషితం చేస్తూ దర్జాగా ఇనుప ఖనిజాన్ని దేశం దాటించి అమ్ముకున్నారు. దేనికీ, ఎవరికీ జవాబు పడనవసరం లేదన్నట్లే వ్యవహారాలు నడిపారు. అడ్డుచెప్పిన అధికారులకు ప్రాణం మీదకి తెచ్చుకున్నంత పనైంది. కొండ దేవతను కొట్టి ఏడుకొండల వాడికి బంగారు కిరీటం చేయించగల ఘనులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను మేనేజ్‌ చేయగలిగారు. ఓబుళాపురం గనుల దగ్గర రాష్ట్రాల సరిహద్దుల గొడవ వచ్చి అవి సీజ్‌ చేసే దాకా ఇది నడిచింది. అది కూడా రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత ఆయన వారసుని దెబ్బకు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పి వచ్చేదాకా.
సిబిఐ విచారణ కూడ ఏదో శత్రు దేశంలో గూఢచర్యం లాగా అత్యంత రహస్యంగా, ఉపగ్రహ చిత్రాలతో చేయవలసి రావడం కర్ణాటక నుండి కడప దాకా విస్తరించి ఉన్న ఫ్యాక్షన్‌ కారిడార్‌ పవరేంటో చెప్పకనే చేప్పింది. ఇదంతా అలా ఉంచితే ఇప్పుడు బ్రాహ్మణి పరిశ్రమ కోసం సేకరించిన భూముల్ని, పాక్షికంగా నిర్మాణమైన కట్టడాలను ఏం చేయబోతున్నారనేది రాయలసీమ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన ప్రశ్న, బ్రాహ్మణీ ఇంస్ట్రీస్‌కు కేటాయించిన భూములనైతే రద్దుచేశారు. వస్తుందనుకు న్న పరిశ్రమ పోయినట్లేనా అని ప్రజలు ఆందోళన చేందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పారిశ్రామిక కేంద్రాల కోసం ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే రాయలసీమలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించండి మొర్రో అన్న చోటప్రభుత్వాలు పలవు. మీ అభివృద్ది మాకొద్దు. మా వ్యవసాయం మేము చేసుకుంటాం అనేచోట మాత్రం బలవంతంగా పరిశ్రమలు పెడుతున్నారేమటి అని ఇక్కడి ప్రజలు అడుగుతారు. యురేనియం ప్లాంటును పులివేం దుల ప్రజలపై బలవంతంగా రుద్దిన సంగతీ చెపుతున్నారు. విషయం ఏమిటంటే అసలు అభివృద్ది ప్రజల కోసం కాదు. కాలువలు తవ్వేది కాంట్రాక్టర్ల కోసం, భూములు సేకరించేది రియల్‌ ఎస్టేట్‌ కోసం పరిశ్రమలు స్ధాపించేది బహుళజాతి కంపె నీల కోసం అనేదే. తరతరాలుగా కరువుతో అల్లాడుతున్న అనం తపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చి అభివృద్ది చేయాల్సిన పాలకులు ఆ పని చేయకపోగా, లక్షల కోపట్లు విలువజేసే ప్రకృతి సంపదను అప్పనంగా అయినవాళ్లకు కట్టబెట్టేసి అడవులు, మైదా నాలు, కొండలు, గ్టులు నాశనం చేశారు. గాలి జనార్థన్‌రెడ్డిని శిక్షించినా, ఆయన అక్రమ సంపాదనను స్ధాధీనం చేసుకున్నా ధ్వంసమైన ప్రకృతి తిరిగిరాదు. ప్రకృతి ఎంతగా దెబ్బ తింటుందో దాని చుట్టూ ఉండే వాతావరణం, ప్రజల జీవితాలు అంతగా దెబ్బతింటాయి. ఈ ప్రజలకు ఏ విధంగా పరిహారం చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పదు, అది చెప్పలేదు కూడా, ఎందుకంటే దాని అభివృద్ది ప్రణాళికలో వీటికి సమాధానాలుండవు, చివరికి ఏ ఫ్యాక ్టరీ కోసమైతే కాప్టివ్‌ మైన్స్‌ కేటాయించారో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు. ప్రజలు భూములూ కోల్పోయారు, ప్రకృతి సంపదనూ నష్టపోయారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, అనంతపురం మైనింగ్‌ కంపెనీ, ఇంకా 3,4 కంపెనీలకు గనులను కేటాయిం చడంలో కాబినేట్‌ పాత్రలేదు. అది వైఎస్‌ తీసుకున& నిర్ణయమేనని ఆ మధ్య కడప జిల్లాకే చెందని మంత్రి చేత ప్రకటన ఇప్పించి, ఇప్పుడు భూకేటాయింపులు రద్దుచేసి చేతులు దులుపుకోవాలని ఫ్రభుత్వం చూస్తోంది. బ్రాహ్మణీ స్టీల్స్‌ ప్రభుత్వం స్వాథీనం చేసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని ఒకవైపేఉ రాయలసీ మ ప్రజలు అడుగుతుంటే ఇప్పుడు అటు బయా&్యం గనులు, ఇటు ఓబుళాపురం గనులు (రాజశేఖర్‌రెడ్డి అల్లుడు, మిత్రుడు దోచుకోగా మిగిలినవి) విశాఖకు తరలించాలని చూస్తోంది. ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమం స్ధానిక వనరులు స్థానికులకే దక్కాలనే విలువను, పోరాట నినాదాన్ని సమున్నతంగా నిలిపింది. దీనిని ఈ రోజు రాయలసీమ ప్రజలూ, అందుకుంటున్నారు. నిజానికి బ్రాహ్మ ణీ ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదం తీసుకొని ఏడాది క్రితమే రాయలసీమ విద్యార్థి వేదిక ముందుకురాగా, బ్రాహ్మణీ స్థానంలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మంచాలని వామపక్ష ప్రజాసంఘాలు ఆందోళనలు చేశాయి. ఇప్పుడది రాయలసీమ రాష్ట్ర నినాదంతో పాటుగా విస్తరిస్తున్నది. రాయలసీమ నాలుగు జిల్లాల ప్రజలు నాలుగు దిక్కులు వలసపోమే దౌర్భాగ్యం పోవాలంటే నీళ్లు, నిధులు, అభివృద్దిలో న్యాయమైన వాటా దక్కాల ని రాయలసీమ కూడా గొంతెత్తుతున్నది.
– పి. వరలక్ష్మి
వీక్షణం సౌజన్యంతో…