సర్వేజనా సుఖినోభవంతు

చైనా గోడలా కంపౌండ్‌వాల్‌ .యుద్ద డేరాల ముందు పహా రా కాస్తున్న సైనికునిలా సెంట్రీ .కన్ను తెరిచి అవకాశాన్ని చూస్తున్న వైర్‌లెస్‌ సెట్టు.నోరు తెరిచిన తిమింగలంలా పోలీసు స్టేషన్‌.స్టేషన్‌ ప్రక్కగా వేపచెట్టుకింద ఎస్సై దర్శనం కోసం ఆకుసాని మల్లయ్య ,చాతకానట్టుగా ,చిక్కిపోయినట్టుగా ఉన్నాడు.అయినా కళ్లు చురు గ్గున్నాయి.వయస్సు ముప్పై దాటి ఉండదు.కాసెపటికి ఎస్సై నుంచి పిలుపు వచ్చింది.స్టేషన్‌లోకి వెళ్లాడు మల్లయ్య.గుడ్ల గూపలా అరుస్తుంది వైర్‌లెస్‌సెట్టు.కొత్త మనిషికి అక్కడికి వెళ్లాలంటే గుండెల దురుతాయి.మల్లయ్య పాతకాపు కాబట్టి ధైర్యంగా వెళ్లాడు. సింహా సనం మీద కూర్చున్న రాజులా కుర్చీమీద కూర్చుని సిగరెట్టు కాలు స్తూ ఏవో కాగితాలు చూస్తున్నాడు ఎస్సై.తను వచ్చిన గుర్తుగా చిన్నగా దగ్గాడు మల్లయ్య.
”ఎంరా మల్లిగా ఎటో వచ్చినవు?”అన్నాడుఎస్సై కాగితాలు చూస్తునే.
”ఇక్కడికే వచ్చిన్నయ్య .పానం కొంచెం బాగలేదు.”
”ఏం అయిందిరా?”
సమాధానం లేదు
”ఏంఐందిరా ?మాట్లాడవేంది?”గట్టిగా ప్రశ్నించాడు ఎస్సై.
”రోగం అంటుకుంది మందులు కొనలేకపోతున్నాను”చెప్పాడు మల్లయ్య.
”సరేలేరా!ఈ వారం పదిరోజుల్లో ఏదైనా చూద్దాం”
వంగి దండంపెట్టి వెళ్లిపోయాడు మల్లయ్య.
దొంగా !దొంగా!అరుస్తూ బయటకు పరుగెత్తుకొచ్చాడు విశ్వనాథం.ఆ అరుపువిని ఇంటిముందు పడుకొన్న నౌఖరు ఎల్లయ్య లేచి దొంగల వెంట పడ్డాడు.అప్పటికే ఇద్దరు దొంగలు గోడ దూకి పారిపోయారు. మూడోవాడు గోడదూకి పారిపోయే ప్రయత్నం చేస్తున్న ప్పుడు ,వాడి కాలులాగి గట్టిగా పట్టుకున్నాడు ఎల్లయ్య కొద్ది సేపటికి విశ్వనాథం అతని భార్యా కొడుకు అక్కడికి చేరుకున్నారు.ఆ దొంగని విశ్వనాథం ,అతని కొడుకు రమేశ్‌గట్టిగా పట్టుకుంటూ…
”నువ్వు పోయి మిగితావాళ్లను పట్టుకోపోరా ”అన్నారు.
ఆ దొంగని వదిలి బయటకు పరిగెత్తాడు ఎల్లయ్య.కానీ అప్పటికే ఆ ఇద్దరు దొంగలు మాయమైపోయారు. రండుమూడు సందులు చూసి పదినివమిషాల తరువాత తిరిగొచ్చాడు ఎల్లయ్య.దొరికిన దొంగని చేతులు కాళ్లుకట్టేసి కొడుతున్నారు విశ్వనాథం,అతని కొడుకు రమేశ్‌.ఆ దొంగ ముఖంలో పసితనం చాయలు పోయి యవ్వనం గుర్తులు కన్పిస్తున్నాయి.వయస్సు ఇరవై దాటి ఉండదు.
ఎల్లయ్యని చూస్తునే ”ఏమైందిరా?”అన్నాడు.
వాళ్లెటో పారిపోయిండ్రయ్యా”జవాబిచ్చాడు ఎల్లయ్య.


విశ్వనాథం వడ్డీ వ్యాపారి .నగదు కుదువబెట్టుకుని అరువులు ఇస్తూ ఉంటాడు.సాధారణంగా నగలు ఇనపపెట్టెలో పెడుతుంటాడు కానీ ఆరోజు బీరువాలో పెట్టాడు.దొంగలు బీరువా తాళంతీసి దొంగ తనం చేశారు.ముప్పై తులాల నగలు ,ఇరవైవేల రూపాయల నగదు దొంగతనం జరిగింది.ఒక్కనగ తప్ప అన్ని నగలూ పారిపోయిన దొంగలే తీసుకెళ్లి పోయారు.రాత్రి మూడవుతుంది.ఏం చేయాలని కొద్దిసేపు ఆలోచించారు తండ్రీ కొడుకులు.నగల జాబితా తయారుచేశారు.దొంగని తీసుకుని విశ్వనాథం రమేశ్‌ ఎల్లయ్య బయల్ధేరారు.కాసేపటికి స్టేషన్‌ చేరారు.సెంట్రీ తుపాకీతో కాపలా కాస్తున్నాడు.ఆ రాత్రి నలుగురు మనషుల్ని చేసి అరర్టయ్యారు.
”ఎవర్రా అదీ?”గట్టిగా ప్రశ్నించాడు.
”చింతకింది విశ్వనాథాన్ని.దొంగతనం చేస్తు దొంగ దొరికాడు” సమాధానమిస్తూ స్టేషన్‌ కంపౌండ్‌లోకి ప్రవేశించాడు విశ్వనాథం. అతన్ని అనుసరించారు రమేశ్‌ ,ఎల్లయ్యదొంగతోపాటు.
”నువ్వాసేటు”అన్నాడు సెంట్రీ.
సెంట్రీ దగ్గరకొచ్చి సంగతంతా వివరించాడు విశ్వనాథం.ఇప్పుడే ప్రయత్నం చేస్తే మిగితా ఇద్దరు దొంగలు దొరుకుతారని ఎస్సై గారి లేవమని అడిగారు.
”ఆ రాత్రి లేపితే బండబూతులు తిడతాడు ఎస్సై” అంటూ లోపలికి వెళ్లి హెడ్‌కానిస్టేబుల్‌ రషీద్‌ను లేపుకొచ్చాడు.
సంగతంతా వివరించాడు విశ్వనాథం.అర్థరాత్రి నిద్ర పాడైపోయినందుకు కోపంగా ఉం ది అసలే అన్నల గొడవలతో చచ్చి పోతుంటే ఇదేంటిరా? అనుకొన్నా డు .లోపలికెళ్లి కర్ర తీసుకొచ్చి దొంగని నాలుగు బాదాడు అయి నా కోపం పోలేదు.
”లంజాకొడుకా!మమ్మల్ని చావగొడుతున్నారు గదరా”! అం టూ మళ్లీ నాలుగు బాదాడు.
మిగితా ఇద్దరి సంగతి చూడమని ,దరఖాస్తు తీసుకొమ్మని చెప్పాడు విశ్వనాథం.”సేటు!నువ్వు పొద్దున ఎనిమిదింటికి రా!అప్పుడు ఎస్సై గారుంటారు.గప్పుడు చెప్పు నీ కథంతా.ఈ దరఖాస్తు కూడ అప్పుడే ఇవ్వు.ఈడు దొరికిండు గదా వాళ్లెక్కడికి పోతారు.?నువ్వు ఫికర్‌ చేయకు,ఇగపో”అన్నాడు ఆవులిస్తూ.
”లాకప్‌తీసి వీన్ని దాంటో వెయ్యి”సెంట్రీకి చెప్పిలోపలికి వెళ్లిపోయాడు.ఏం చేయాలో తోచలేదు విశ్వనాథానికి .ముప్పై తులాల నగలు కళ్లముందు గిర్రున తిరుగుతున్నాయి.ఎస్సై క్వార్టర్స్‌ స్టేషన్‌ ప్రక్కనే .కానీ అక్కడికి వెళ్లాలంటే బయమేసింది.ఎక్కువ మాట్లాడితే ఒకటి పోయి ఒకటైపోతుందని తండ్రీ కొడుకులు నౌఖ రుతోపాటు ఇంటికి తిరుగుమొఖం పట్టారు.
ఉదయం ఏడున్నరకి విశ్వనాథం ,రమేశ్‌,ఎల్లయ్యతోపాటుపోలీసు స్టేషన్‌కి వచ్చాడు.వేపచెట్టు కింద నిల్చున్నాడు.ఎస్సై ఇంకా రాలేదు. ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చదువుకొన్నాడు.దొంగ లాకప్పులో ఉన్నాడో ,లేదో చూసుకొన్నాడు.మిగితా ఇద్దరు దొంగలు దొరుకు తారా?తన నగలు దొరుకుతాయా..?ఆలోచిస్తు వేప చెట్టుకింద నిల్చొన్నాడు విశ్వనాథం.
ఎనిమిదన్నర ప్రాంతంలో ఎస్సై వచ్చాడు.హెడ్‌ కానిస్టేబుల్‌ వషీద్‌ రాత్రి సింఘటన గురించి వివరించాడు.కాస్సెపటికి విశ్వనాథాన్ని లోపలికి పిలిచాడుఎస్సై భయపడుతూ భయపడుతూ ఎస్సై ముందు నిల్చున్నాడు విశ్వనాథం.
ౖౖౖౖ”ఏమిటయ్యా సేటు!ఎన్ని గంటలకి జరిగింది?”
”రాత్రి మూడు గంటల ప్రాంతంలో సార్‌”
”ఇంట్లో ఎవరూ లేరా?”
”మేమందరం ఉన్నాం సార్‌”
”గంత మొద్దు నిద్ర పోతున్నారా”
”……….”
”సేఫ్‌లో పెట్టుకోకుండా బీరువాలో ఎందుకు పెట్టినావు?”
”………….”
”వాళ్లిదరిని కూడా పట్టుకోకపోయిండ్రా,ముగ్గురున్నారు మొద్దులకి మొద్దులు”
”నగల సంగతేమోకానీ ఇదెక్కడి బాధరా?”అనుకొన్నాడు విశ్వనాథం.
”దరఖాస్తు తెచ్చినవా?”
”తెచ్చినసార్‌”వినయంగా తను తెచ్చిన ఫిర్యాదును ఎస్సైకి అందజేశాడు విశ్వనాథం.
”అన్నీ వివరంగా రాసినవా?”
”రాసినా సారు”
ఈ రోజే గట్టిగా ప్రయత్నం చేస్తే మిగితా ఇద్దరు దొంగలు దొరుకుతారని చెబుతామనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు.
”మళ్లీ ఎప్పుడు కన్పించాలి సార్‌?”
”నేను చెప్పి పంపుతాను .లేకపోతే రేపోసారి వచ్చిపో”
నమస్కారం పెట్టి సెలువు తీసుకున్నాడు విశ్వనాథం.
విశ్వనాథం వెళ్లిపోయిన తరువాత కానిస్టేబుల్‌ని పిలిచి దొం గని తీసుకురమ్మని చెప్పాడు ఎస్సై లాకప్పు నుంచి దొంగను తెచ్చి ఎస్సై ముందు నిల్చుండబెట్టాడు.ఇంకా ఏం చూస్తున్నావన్నట్టుగా కానీస్టేబుల్‌ వైపు చూశాడు ఎస్సై.ఆ చూపులను అర్థం చేసుకుని లోపలికి వెళ్లి లాఠీ తెచ్చి వీపు మీదా,చేతుల మీదా నాలుగు బాదాడు.”అమ్మా ,అ య్యా”అన్నాడు దొంగ.
”ఏం పేరురా?”
”గంగాధర్‌”
”ఏ ఊరు”
”ఈ ఊరేసార్‌”
” ఏం చేస్తున్నావు”
”ఇంటర్మీడియట్‌ ఫేయిలైనాను సార్‌”
”ఎన్ని దొంగతనాలు చేసినావురా”
”ఇదే మొదటిది సార్‌”
” మీ తండ్రి ఏం చేస్తాడురా”
”ఇంజనీర్‌ సార్‌”
”అయితే ఇదేం బుద్దిరా నీకు”
”ఎవరెవ్వరు కలిసి చేసిండ్రురా”
కానిస్టేబుల్‌ వైపు చూశాడు ఎస్సై.మళ్లీ నాలుగు లాఠీ దెబ్బలు
”చెప్పురా ఎవరెవరు చేశారు?”
”నేను, శ్రీను ,క్రిష్ణా కలిసి చేశాం సార్‌”
”వాళ్లేం చేస్తుంటారు రా”
”నాలాగే ఇంటర్మీడియట్‌ ఫేయిలైనారు సార్‌”
వాళ్ల వివరాలు చెప్పాడు.
”ఇంకా ఎన్ని దొంగతనాలు చెసినార్రా?”
”లేదు సార్‌ .ఇదే మొదటిది”
”అంటే మళ్లీ చేస్తారా”
”…….”
”లమ్డీ కొడుకులు!నిద్ర పట్టకుండ చేస్తున్నారు.వీన్ని తొమం డిరా”చెప్పాడు.ఆకొడుకుల ఇండ్లకు పోయి వాళ్లను ,వాళ్లు లేకపోతే వాళ్ల అయ్యలను తీసుకురాండ్రి ”హెడ్‌ కానీస్టేబుల్‌కి హుకూం జారీ చేశాడు.
(తరువాయి భాగం వచ్చే బుధవారం)