ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ

(సోమవారం తరువాయి భాగం)
ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తెలంగాణకు ఒక్క నయపైసా కూడా ఇవ్వనని ఎమి చేసుకుంటారో చేసుకోండని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యంగంగా మాట్లాడాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు 4సీఎల్‌ , అజాంజుహీ మిల్లు, నిజాం సాగర్‌ ఐడీపీఎల్‌ ప్రగాటూ ల్‌ని మూసీవేసినప్పటికీ ప్రభుత్వాలు తెలంగా ణ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా పార్టీ మౌనంగా కొత్త జీవోలు తేచ్చి హింసించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మౌనంగా దాల్చుతుంది. టీడీపీ పార్టీ అంటనే సమాఖ్యంద్ర పార్టీ ఈ పార్టీతోని 2009లో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతే ప్రజలు బొందపెట్టారు. టీడీపీతో పొత్తు అవకాశం కాదా అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీపై దినది నంగా వ్యతిరేకత పెరుగుతుంది. రాజకీయ నేతలు ఇప్పుడు వలస పక్షులుగా మారారు. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు వ్యాపార పార్టీగా మారింది. ఒకప్పుడు తెలంగాణకు బద్ధ శత్రువులర ుున కడియం, శ్రీహరి, గంగుల కమలాకర్‌, మాజీ డీసీ పేర్వారం రాములు, మరికొంత మంది సీమాంధ్ర తొత్తులుగా ముద్రపడింది. వీరిని ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వనించడం మర్మమేమిటీ. సీమాంధ్ర పార్టీల లో ఉంటే తాం గేలవమని విధితేనే టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. వీరు తెలంగాణ కోసం ఉద్యమిస్తారా.? టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటా రనే నమ్మకం కూడా లేదు. ఇదే టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన వ్యవస్థా పకులు ఎవ్వరు లేరు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రావడం వెళ్లిపోవడం ఇది ఫ్యాషన్‌గా మారింది. ఇవ్వన్నీయూ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీనేతలయిన కేసీఆర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌లకు సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలిసి వ్యాపారాలు కూడా దర్జగా కొనసాగుతున్నాయి. సీమాంధ్ర నాయకు లయిన లగడపాటి, రాయపాటి, కావురి, టీజీ, వెంకటేష్‌లతో కలిసి చెట్టాపట్టాలేసు కుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఇవాళ కేసీఆర్‌ కుటుంబ పార్టీగా మారిం ది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన వారిని తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేయడం అనాయితిగా మారింది. అసలు తెలంగాణ తెస్తారో లేదో అనే నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. మీడియా ముందు మాత్రం ఒకరి ఒకరు దుషించుకుంటారు. ఫోన్‌ల లో ప్రేమలుకొన సాగతున్నాయి. ఇటీవలనే కరీంనగర్‌ కదనభేరీ మహాసభ అమ్మల్‌ టీర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవ సభలలో కేసీఆర్‌ అసలు రంగు బయట పడింది. ఆయన నిజారూపం ఏమది 2014 అసెంబ్లీ హైదరాబా ద్‌కు వస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాది అని మాట్లాడా డు. ఇన్ని సీట్లు గెలిచినప్పటికీ తెలంగాణ రాదని కేసీఆర్‌ అంతరాత్యకు తెలుసు టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టినప్పుటి నుంచి కేసీఆర్‌ ఎన్నికలు ఒక అస్తాంగా వాడుకుంటుండు తప్ప తెలంగాణ పార్టీ ఏర్పడటంలో ఇంకా అమడు దూరంలో వుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోతుంది. ఇందులో పని చేసే నేతలంతా పదవుల వ్యామోహం తప్ప ప్రత్యేక తెలంగాణ కోసం పని చేయడం లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం లేదు. 33రోజులు సకలజనుల సమ్మే సమయంలో స్పూర్తి కోల్పోయింది. సకలజనుల సమ్మేలో పాల్గొనకుండా కేసీఆర్‌ ఇతర నాయకులు లాబీయింగ్‌ ద్వారా తెలంగాణ వస్తుందని అశించి ఢిల్లీ పెద్దల చుట్టు ప్రదక్షణలు చేశారు. ఉద్యమం ఉవ్వేత్తున జరుగుతున్నప్పుడల్లా ప్రజాక్షేత్రంలో పాల్గొనకుండా ఢిల్లీలో కనిపిస్తాడు కేసీఆర్‌. అమెరికా సామ్రాజ్య వాదం గుల్లాదిపత్యం చెలాయించినట్లుగా టీఆర్‌ఎస్‌ చెలాయిస్తుంది. ఉద్యమమే తామని తామే ఉద్యమం అన్నట్లుగా ఒంటత్తు పోకడలతో వ్యవహరిస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్న వారందరు టికేట్‌ ఆశించి ఈ టికేట్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి ఖరీదుగా కొనుక్కొవల్సిందే. టీడీపీ కాంగ్రెస్‌ మాజీ ఐపిఎస్‌ ఐఎఎస్‌ డాక్టర్లు ఇంజనీర్లు బడా కాంట్రాక్టర్లు వివిధ రాజకీయాల పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పలు విమర్శలు ఎదురవుతు న్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి బుర్జువ పార్టీగా మారింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్‌కు తెలంగాణ పై, తెలంగాణ ఉద్యమకారులపై నమ్మకం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక వేళ చిత్తశుద్ధి ఉన్నట్లయితే పదమూడు సంవత్సరాలలో పార్టీ కోసం తెలంగాణ కోసం శ్రమించిన కార్యకర్తలకు టికెట్లుయిచ్చి గెలిపించుకునే వారు 2014ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేయడమంటే ప్రజల గౌరవన్ని కించపరుస్తుంది. బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో సందేహం లేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే వారందరికి విడదీయడానికి ప్రయత్నిస్తూన్నారు. కేంద్రంలో తామే ప్రత్నమయంగా ఉంటామని కళలు కంటున్నారు. తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్‌ స్థానాలు 17, స్థానాలు గెలిచినా తెలంగాణ రాష్ట్రం వచ్చేటట్లు కనిపించడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అంతాంత మాత్రంగానే వచ్చాయి. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చెంపలు లొట్టబోయి నవి టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్రాం రావడం ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణ కోరుకునే వారందరిని ప్రజలు ప్రజాస్వా మిక వాధులు ప్రజా సంఘాలను వివిధ రాజకీయ పార్టీలను కలుపుకుపోవడంలో నియంతృత్వ పోకడలు అవలంభిస్తుంది. ఒంటరిగా ఏ పార్టీతోను తెలంగాణ రాదు సమిష్టిగా ఉద్యమిం చినప్పుడే తలెంగాణ సద్యమవుతుంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ లు ఒంటరిగా ప్రభుత్వాన్ని నెలకొల్చే సత్తా లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నికల ఓట్ల, సీట్లుగా మలచుకోవడం సబుబు కాదూ. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉద్యమాలను నిర్మించడంలో విఫలమవుతున్నారు. లాబీయింగ్‌లు ఎన్నికల ద్వారా తెలంగాణ వస్తుందని నమ్ముతున్నారు. 2001 నుంచి 2009దాకా తెలంగాణ వాదం బలంగా గెలిచింది. బ్రహ్మరథం ఒట్ల రూపంలో పట్టారు. కానీ తెలంగాణ రాలేదు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలం గాణ ఇస్తారనే నమ్మకం లేదు. ఎన్నికలు ఒక డ్ర్రామ అధికారాన్ని డబ్బులు పెట్టి కొంటున్నారు. గతంలోలాగా బీజేపీ మళ్లీ మోసం చేస్తుందని సందేహాలు అనేక అనుమానాలకు తావిస్తుంది. యూపీఏ ప్రభుత్వంలో చేరినప్పటికి చివరకు తెలంగాణకు భంగపాటు తప్పలేదు. కేసీఆర్‌ ఫాం హౌస్‌లో చివరకు కార్పొరేట్‌ వ్యవసాయా న్ని నడిపిస్తున్నాడు. ఇది కార్పొరేట్‌ వ్యవసాయమంట రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరు. కార్పొరేట్‌ వ్యవసాయం మాత్రం బాగా నచ్చిందంట కేసీఆర్‌కు ”ఆలు లేదు సోలు లేదు ‘కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ రాకముందే తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు సుభిక్షంగా బతుకుతారని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల స్థలమని, ఉపాధి కల్పిస్తామని ఉదరగోడుతున్నారు. తెలంగాణ భూములు ఉపాధి అంత తాకట్టుపె ట్టబడినది. ప్రజలు ఆకలిచావులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రేపటి తెలంగాణలో బతుకులు మార్చేస్తారట. అసలు ఇంతకీ తెలంగాణ వస్తాదా ఇవన్నీ ఓట్ల కోసమేనా మరోసారి ప్రజలను వంఛీచడమేనా తెలంగాణ వస్తాదో రాదోనని జనలలో ఆయోమ యలు నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని బలహినతలు, విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు అన్ని పార్టీలను కలుపుకుపోవడంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పెద్దన్న పాత్ర పోషించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నికలకు ముడ ిపెట్టకుండా ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత లేవదీసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామిక ఉద్యమా లను బలోపేతం చేసినప్పుడే ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుందని కేసీఆర్‌ గుర్తెరగాలి అప్పుడే తెలంగాణ సాధ్యం.
-దామరపల్లి నర్సింహారెడి