నూతన పాలసీని విరమించుకోవాలి
మద్యం విధానంలో ఖజానా నిప్పుకునేందుకు ఇక నుంచి మద్యం దుకాణాలన్నిబారులు కాబోతున్నాయి. రెండు లక్షలు చెల్లిస్తే చాలు దుకాణం పక్కన దర్జాగా బార్ పెట్టుకోవచ్చు. తాగుడుకు బానిసై ఎంతో మంది అనారోగ్యాల బారినపడి చనిపోతున్నారు. మందు బాబులకు ఇదో వరం లాంటింది. తాగుబోతు భర్తలున్న కుటుం బాల్లోని మహిళల పాలిట శాపం లాంటిది. మద్యం అమ్మకాలపై ఆదాయం ఇరవైకోట్ల రూపాయలు దాటినాయి. లైసెన్స్ ఫీజు రూపంలో మరో 2.400కోట్లు సమకురాయి. 2014సంవత్సరం అమ్మకాల ద్వారా పదివేల కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు రూపం లో మూడు వేల కోట్లు వెరసి 28వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం పాలసీ రూపొందించింది. నూతన మద్యం పాలసీలో మద్యం దుకాణాల లానీయింగ్‌కు సర్కారు తలొగ్గింది. మద్యం వ్యాపారుల సూచనలు ప్రభుత్వం తూచతప్పకుండా పాటిస్తుంది. మద్యం దుకాణం వద్ద మద్యం తాగేందుకు అనుమతి లేదు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో మద్యం సేవించేందుకు అనుమతి వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6596మద్యం దుకాణాలున్నాయి. ఇందులో నాలుగువేల దుకాణాల వరకు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. మిగతావి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. పల్లేలు పర్మిట్ రూములు అనుమతిస్తే ప్రభుత్వానికి రెండు వైపుల ఆదా యం లభిస్తుందని అంచనా. పర్మిట్ రూమ్‌కు ఏటా రెండు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసేందుకు వీలుంటుంది. దీంతో ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం పెరుగుతుందని అంచనా ప్రస్తుతం ప్రభుత్వం ఖజానాకు అబ్కారీ శాఖ నుంచి పదివేల కోట్ల రూపాయలు వస్తుంది. దీని స్థానాన్నే మరో ఐదు వేల కోట్ల రూపాయలు చేరుతుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో సర్కార్ బెల్టుషాపుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో బెల్టుషాపులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇరవై వేల బెల్టుషాపులున్నాయి. వీటిని తొలగించినట్లయితే ప్రభుత్వ ఆదా యం భారీగా తగ్గుతుంది. మద్యం దుకాణాల వేలం ద్వారా సిండ ికేట్లు మాఫియాల ఆసాంఘిక కార్యకలాపాలు పెరిగాయి. ప్రభుత్వం 2017లో లాటరీ పద్దతి ప్రవేషపెట్టి ఆదాయం కొల్పోయమని ప్రభుత్వం దిగులుపడుతుంది. మద్యం షాపుల యాజమానులు అడిందే ఆట, పాడిందే పాట. 2012లో 61596షాపులు మంజూరు చేగా 617దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. వాటిని ప్రభుత్వ మండల కేంద్రాలను తరలిస్తామని నూతన పాలసీలో పేర్కొంది. తమకు కమీషన్ కేంద్రాలను తరలిస్తామని నూతన పాలసీలో పేర్కొంది. తమకు ఫీజు విధింపులో వెసులు బాటు కల్పిం చింది. ఇప్పుడు పరిధికి మించి అమ్మకాలు ఆరుశాతం దాటితే 8శా తం డ్రివిలేజ్ ఫీజు వ్యాట్ విధిస్తున్నారు. ఆదనంగా మద్యం అమ్మ కాల ద్వారా లైసెన్స్‌లిచ్చి ట్రేజ్ మార్జిన్లను సవరించి ధరలు పెంచి పిండుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతుండటంతో మద్యం దుకాణాలను పాతదారికి అప్పగించేం దుకు నిర్ణయించింది. తాగుబోతు భర్తల హింసలు భరించలేక మహిళలు మహిళ సంఘాలు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చిన బెల్టుషాపులను ఎత్తివేయాలని మొత్తుకున్న ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు లేదు. మద్యం రవాణా అమ్మకాలపై నిఘా కొరవడడ ంతో పొరుగు రాష్ట్రాల నుంచి అడ్డు అదుపులేకుండా కల్తీ నాన్ డ్యూటీ పెయిజ్ లిక్కర్ అక్రమంగా రవాణా జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. కల్తీ మద్యం తాగి అమాయకులు బలవుతున్నారు. సారాయిపై నిషేదం ఉన్నా ఎరులైపారుతొంది. చావులకు దారితీస్తుంది. తాగుబోతుల బలహీన తలను సొమ్ము చేసుకోవడంపై ప్రభుత్వం చూస్తుంది. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ముందుకు రావడం లేదు. నేటికి అనేక మారుమూల గ్రామీణ ప్రంతాలలో కనీసం తాగడానికి మంచినీరు దొరకడం లేదు. ప్రతి గ్రామంలో సారా ఏరులై పారుతోంది. బెల్టుషాపుల ద్వారా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మద్యాన్ని నియంత్రించాలంటే మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టి పరిమితమరున దినాల్లో పని వేళలు నిర్ధేశించి అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సూచించాయి. జులై 1నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న నూతన పాలసీ విధానం మద్యం విక్రయాలను మరింత పెంచే విధంగా ఉంది. తప్ప నియంత్రించే విధంగా లేదు. మద్యాన్ని ఆదాయ మార్గంగా చూసే పద్దతికి స్వస్తి చెప్పి బెల్టుషాపులను ఆరికట్టడంతో పాటు పర్మిట్ రూముల అనుమతనులను వెంటనే ఉససంహరించుకోవాలి. మద్యం సిండికెట్ల అవినీతి బాగోతాలు వెలుగుచూసినాయి. దీంతో ప్రభుత్వం పరువుపోయింది. లిక్కర్ మాఫియాతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ప్రతిపక్షనేతలు అధికారులు పోలీసులు, అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు సిండికేట్లు పదిలక్షల రూపాయల లంచం ఇచ్చినట్లు పోలీసు విచారణలో తెలింది. ఎసీబీ, ఎఫ్‌ఐ ఆర్‌లో ఆయన పేరు ఎ.1 ముద్దాయిగా ఎక్కింది. బొత్స సత్యనారా యణ రాంరెడ్డి, వెంకట్‌రెడ్డిల పేర్లు బయటకు వచ్చినాయి. సీఏం జిల్లాలో తెల్లరేషన్ కార్డుదారులకు లిక్కర్ దుకాణాలిచ్చినట్లు ఎసీబీ తేటతెల్లం చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు విచారించి నివేదికను అందించారు. విచారణలో కీలక అధికారి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ఒత్తిళ్ల మేరకు బదిలీ చేశారు. ఈ విషయం ఇంతటితో ముగిసింది. ప్రజా ప్రతినిధులను ప్రభుత్వమే స్వయంగా తప్పించింది. ఏసీబీ విజిలెన్సు నివేదికల్లో వేయ్యిమంది అధికారులు అనాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ఇప్పటి వరకు 5వేల జనాబా మించిన గ్రామాల్లో వైన్‌షాపులకు, సిట్టింగ్ పర్మిషన్ ఇచ్చేవారు. అది కూడా లక్ష రూపాయల డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఆ డిపాజిట్‌ను రెండులక్షలకు పెంచారు. జనాభాతో సంబంధం లేకుండా ధరఖాస్తు చేసుకుని రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు. ఎఫా ప్ర్రకైనా అనుమతినిచ్చేలా కొత్త నిబంధన తెరపైకి తెచ్చారు. వైన్‌షాపులను బార్ షాపుల్లా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో భారీగా ఆదాయం ప్రభుత్వానికి దక్కనుంది. గత సంవత్సరం లాటరీ పద్దతిలో మద్యందుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వడం వల్ల కొంత మేరకు ఆదాయం కొల్పోయిన ప్రభుత్వం లోటును పూడ్చుకునేందుకు ఉన్న వనరులను వినియోగించుకుం టుంది. నూతన పాలసీ ద్వారా ప్రజల నుంచి మరో 5వేల కోట్ల రూపాయాలు దండుకోవడానికి ప్రభుత్వం నాటకమడుతుంది. మద్యాన్ని నియంత్రించి బెల్టుషాపులను ఎత్తివేయాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మహిళలు, మహిళ సంఘాలు ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ప్రేమ ప్రజల పట్ల లేదు. మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తుంది. నూతన పాలసీలో నిబందనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 2014లో కూడా లాటరీ ద్వారానే దుకాణాలు కేటాయిస్తారు. ప్రభుత్వం రిటైల్ వ్యాపారంతోనే మద్యం నియంత్రణ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం వైన్సుల నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. కల్తీ మద్యం కల్లీ కల్లు తాగి రాష్ట్రంలో వేలాది మంది చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం మాద్యాన్ని ఆదాయ వనరునిగా చూస్తున్నారు. ప్రజలను మత్తులో ముంచి వారిని నిలువు దోపిడి చేస్తున్న మద్యం మహమ్మరిని వెంటనే నియంతించాలంటే 2013-14కు గాను ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యన్ని పాలసీని ఉపసంహరిం చుకోవాలి. మద్యాన్ని నిషేదించేంతవరకు ప్రజలు పుజాస్వామిక వాధులు, మహిళలు, మహిళ సంఘాలు పోరాడవల్సిన అవసరం ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి 2014లో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాటం నేర్పించాలి రాజకీయాలకు అతీతంగా పలు రాజకీయా పార్టీలు మహిళలు పెద్ద ఎత్తున కదిలివచ్చి మద్యం మహమ్మారిని తరిమికొట్టాలి అప్పుడే మద్యం నియంత్రణ జరుగుతోంది. ఎదైన ఉద్యమాల ద్వారానే విజయవంతమవుతాయి.
– దామరపల్లి నర్సింహరెడ్డి