విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న పారా మెడికల్‌ బోర్డ్‌

రాష్ట్రంలో పారా మెడికల్‌ బోర్డు వారి ద్వారా సర్టిఫికేట్‌ రిజిస్ట్రేషన్‌ మరియు ఇతర మెడికల్‌ కోర్సుల అజమాయి షీ,ప్రవేట్‌,ప్రభుత్వ కాళాశాలలా అజమాయిషీ, అనుమతు లను పారా మెడికల్‌ బోర్డు ఇస్తున్నది,విధివిధానాలను నిర్దేశిస్తున్నది కాని దాని ముసుగులో విధ్యార్ధుల జీవితాలతొ ఆటలు ఆడటం లోకానికి తెలియని నిజం.విధ్యార్ధులు పారా మెడికల్‌ కోర్సు ద్వారా ఉన్నత ఉపాది అవకాశాలను ప్రవేట్‌గా లేదా ప్రభుత్వ పరంగా పోందవచ్చని భావించి కళాశాలల ఆకర్షణీయమైన ప్రకటనలకు విధ్యార్దులు వారి తల్లితండ్రులు లోంగి పోయి ఆకర్షించబడి కోర్సులో చేరితే చేరే వరుకు ఒక రకంగా చేరిన తరువాత మరో రకంగా తయారై వసూళ్ళు విపరీతంగా చేస్తున్నారు,ఒక రకంగా విధ్యను పూర్తి స్ధాయిలో వ్యాపారంగా మార్చిన ఘనులు వీరే.ఏదో సాధిస్తామని చెప్పి విధ్యార్థులు సులభంగా ఉద్యోగాలు పోందాలని మెడికల్‌ కోర్సు చదవాలని వస్తే వారి అవసరాలను ఆసరాగా చేసుకోని దోచుకుంటు న్న యాజమాన్యం దానికి వత్తాసు పలకడానికి గవర్నమెంట్‌ జీవోలు, పారా మెడికల్‌ కాలేజ్‌ జీవో కాపీలను చూపూతూ పలు రకాలుగా వసూళ్ళు పర్వాన్ని ఎత్తారు.రిజిస్టేషన్‌ను నంబర్‌ను ఒక పెద్దగా సాధించిన విజయంగా ప్రవేట్‌ ప్రాక్టిస్‌ ద్వారా సంపాదించుకునే మార్గంగా విధ్యార్ధులకు చెప్పి వసూళ్ళు చేస్తున్నారు. మల్టి పర్సస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ట్రేనింగ్‌కు 77,000రూపాయల జీవో పంపారు. మొదట షెడ్యూల్‌ ఇతర క్రింది స్థాయి వారికి ఫీజు లేదని చెప్పి ఆకర్షిత ప్రకటనలను ఇచ్చి తర్వాత ప్రభుత్వ స్కాలర్‌ షిప్‌ రాలేదని,మెయిటెనెన్స్‌ కావటం కష్టం కాబట్టి మళ్ళి మీడబ్బు రాగానే తిరిగి ఇస్తామని చెప్పి 16,000 రూపాయిలు తీసుకోని,విడతలుగా తీసుకోని తర్వాత ప్రభుత్వాం వారు ఇవ్వడం లేదు. కోర్టు కేసు అయ్యింది డ్యూరేషన్‌ పీరియడ్‌ పెరిగింది. అందుకు గాను ప్రభుత్వా జీవో ప్రకారం 77,000 రూపాయలు కట్టండి,ఇంతకు ముందు ఇచ్చిన రూపాయలు లెక్క లేదని చెప్పి లక్ష రూపాయలు వరకు వసూళ్ళు చేస్తారు.పారా మెడికల్‌ బోర్డు వారు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కాలేజ్‌ వారికి లేఖలు పంపారు. అలా విధ్యార్దులకు చూపి ఫీజు వసూలు చేస్తారు. దీనిలో పారా మెడికల్‌ బోర్డు వారికి తగినంత వాటా రాలేదని ఈ కాలేజ్‌పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని అందుకే పరీక్షలు నిర్వహించడం లేదని, సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌ ఎప్పుడో చేసినా ఇంకా చేస్తున్నామని చేప్పి సంవత్సరంగా విధ్యార్ధులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటు యాజమా న్యం,అటు పారా మెడికల్‌ బోర్డు వారి నిర్వాకంలో విధ్యార్ధులు బలి పశువులుగా మారిపోయారు. పారా మెడికల్‌ బోర్డు వారు లక్షలాది రూపాయలు అడుగుతున్నారని యాజమాన్యం వారు అలా కాదు ఎన్నో ఆరోపణలు ఉన్నాయని మంచి కళాశాల కాదని ది కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ టెక్నాలజీని పారామెడికల్‌ బొర్డు సెక్రెటరీ అంటున్నాడు యాజమాన్యం వారు కోర్టులో ఓప్పుకు న్నాడు అలాగే పరీక్షలు నిర్వ హించాలని కాలేజ్‌ యాజ మాన్యం వారు, ఇద్దరి మధ్య వయస్సు పెరిగిపోతున్న విధ్యార్ధులు ఉన్నారు. పేదరి కంతో భార్యపై పుసైల తాడు అమ్మి ఫీజు కట్టిన విధ్యార్ధు లు ఉన్నారు .గత 2 సంవ త్సరాలుగా ఎప్పుడు పరీక్షలు నిర్వహి స్తారా అని విధ్యా ర్ధులు ఎదురుచూస్తు న్నారు, మరో పక్క రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగాల ను భర్తి చేస్తాన ని చెప్తుతుం ది. నోటిఫికేషన్‌ విడతల ద్వారా ఇస్తున్నా, పారా మెడి కల్‌ బోర్డులో చలనం లేక పోవడం విచారించాల్సిన విషయం. సంవత్సరం పోడు గు న వాయిదా వేయడం సమర్థ నీయం కాదు. నియంత పాలన గా పారా మెడికల్‌ బోర్డు పని చేయడం విచారించా ల్సిన, గుర్తించాల్సిన విషయం. కాబట్టి విధ్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారు పారా మెడికల్‌ కాలేజీలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పేద విధ్యార్ధులను పీడిస్తున్న యాజమాన్యా న్ని,ఆకర్షి ప్రకటనల ద్వారా ఆకర్షించిన యాజమాన్యన్ని డబ్బు కోసం వేదిస్తున్న పారా మెడికల్‌ బోర్డు అధికారులను సవరించాల్సిన సరిదిద్దల్సిన అవసరం ఎంతైనా ఉంది.సర్టిఫికెట్‌ రిజిస్ట్రేషన్‌ను వారి స్వంత ఆస్తి రిజిస్రేష్టన్‌ చేయించి ఇస్తున్నట్లుగా వారి ప్రవర్తన ఉంది.నిర్లక్ష్యం,మరియు దురుసుదనం, పోగరు సమాధానా లు,వయస్సు మీరినా బుద్ది లేని పనులు డబ్బు వసూళ్ళు మాటలను కోనసాగిస్తున్నారు. కావున వీరిపై చర్య విధ్యాశాఖ తీసుకోవాలని విధ్యార్ధులు కోరుతున్నారు. పారా మెడికల్‌ కోర్సుల ద్వారా విదేశాలకు వలస వెళ్ళాల్సిన యువత నీరు గారి పోతున్నారు. విధ్యార్ధుల అవసరాలను ఆసరగా తీసుకున్న కళాశాలలు కేవలం డబ్బుకోసం కక్కుర్తిపడి నకిలీ సర్టిఫికేట్స్‌ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పారామెడికల్‌ బోర్డు నిర్వహణ క్రిందలేని రోజుల్లో అనేక సర్టిఫికెట్స్‌ ఇష్టాను సారంగా అమ్మి సోమ్ము చేసుకున్నారు. నేటికి కోన్ని లోసుగులను వాడుకోని లక్షలాది రూపాయలను వసూళ్ళు చేస్తున్నారు. దేశానికి భావి భారత పౌరులను మేధవులను,విధ్యా వంతులను అందించాల్సిన విధ్యా వ్యవస్ధ, ఈ వ్యవస్ధలో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిం చాలని భావించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారు. దానికి పారా మెడికల్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలను జతపరుస్తున్నారు. పారా మెడికల్‌ బోర్డు, ఇటు కళాశాలల యాజమాన్యాలు ఇరువురు కలిసి విధ్యార్ధులను వారి అవసరాలను ఆసరగా చేసుకోని డబ్బు సంపాదనకు ఒకరిపై ఒకరు పోటిపడి విధ్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్నారు. హైకోర్టు రెండు నెలలలోపు పరీక్షలు నిర్వహిం చాలని జడ్జిమెంట్‌ ఇచ్చినా పారా మెడికల్‌ బోర్డు, ఇటు యాజ మాన్యం,ఒకరిపై ఒకరు చెప్పుకుంటు విధ్యార్ధులు ఇతర పనులు చేసుకోకుండా ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారోనని,వృత్తి విధ్య కోర్సు కాబట్టి సర్టిఫికెట్‌ ద్వారా ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను పోంద వచ్చని భావిస్తున్నారు. వారి ఆశలను ఆశయాలను,సోమ్ము చేసుకుం టున్న పెద్ద మనుష్యుల బాగోతాలు ఇవి కాబట్టి ప్రభుత్వాం ఆలోచిం చాలి. ఇంటర్‌ బోర్డు ఆధీనంలో ఉన్న పారా మెడికల్‌ కోర్సులకు తక్కువ ఫీజులు ఉంటే.పారా మెడికల్‌ బోర్డు నిర్వహణలో ఉన్న కళాశాలలో వేలాది,లక్షలాది ఫీజులను ఏదో ఒక రకంగా వసూలు చేస్తున్నారు.కాబట్టి ఇరు వర్గాల మధ్యన విధ్యార్దుల జీవితాలు అంద óకారం కాకుండా ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వ అజమాయిషీ పూర్తి స్థాయిలో పారా మెడికల్‌ బోర్డుపై ఉండాలని యాజమాన్యాలను అదుపులో ఉంచాలని విధ్యార్ధులు కోరుతున్నారు. అవసరమైతే ఎసిబి మరియు కోర్టును ఆశ్రయించే దిశగా విధ్యార్ధులు ఉన్నారు. ధర్నా ద్వారా ప్రభుత్వానికి నిరసనను తెలపాలని విధ్యార్ధు లు చూస్తున్నారు.కాబట్టి ప్రభుత్వం స్వందించాలి.