హిందు తీవ్రవాదమే అసలైన ముప్పు

దేశంలో అంతర్గత తీవ్రవాదం, మైనారిటీ తీవ్రవాద ముప్పు పొంచి ఉందంటున్న ప్రధాని, ఎన్నో దశాబ్దాలుగా పెచ్చరిల్లుతున్న హిందూ తీవ్రవాదాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు.
జైపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిరంలో కాషాయ తీవ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. గాంధీవర్ధంతి సందర్భంగా ప్రాధాన్యతను కూడా సంతరించు కున్నాయి. దేశ అంతర్గత భద్రతకు హిందూత్వ తీవ్రవాదం పెనుసవాలుగా నిలిచిందనే అవగాహనను గత కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ ప్రస్తావిస్తూ వస్తోంది. జనవరిలోనే మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మతభావాలు రెచ్చగొట్టెలా మాట్లాడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అరెస్టుచేసింది. సంక్రాంతి నాడు శ్రీశైలంలో స్వామి కమలానంద భారతిని ఒ వైసీ తరహా రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేశాడని అరెస్టుచేయడంతో హిందుమతంపై దాడిగా హిందూత్వ వాదులు దాన్ని చిత్రీకరించారు. వీటన్నిటికీ ఉత్ప్రే రకంగా పనిచేసిన ఆంశం ఒకటుంది. హైదరబా3ద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ను ఆనుకుని వెలిసిన భాగ్యలక్ష్మీ ఆలయ ఆంశంపై చెలరేగిన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ది హిందూ పత్రిక ప్రచురించిన ఫోటోలతో అసలువ్యవహారం బయటపడింది. 50ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మీ ఆలయం అక్కడ లేదనేది తెలిసిన తర్వాత హిందూత్వ శక్తులు గమ్మున్నాయి. మరో ఆయోధ్య తరహా వివాదంచేయాలని, దానిద్వారా అధికారం పొందాలనే కుటిలయ త్నాలకు ప్రయత్నించిన హిందూత్వ శక్తులు తేలుకుట్టిన దొంగలా మిన్నకుండిపోయాయి. మహరాష్ట్రంలోని భోకర్‌ వద్ద శిశ్వహిందూ పరిషత్‌ నాయకుడు ప్రవీణ్‌తొగాడియా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అస్సాంలోని నెల్లిమరణహోమంలో మరణించిన 3000 మందిలోను, బీహార్‌ భాగల్పూర్‌ మత ఘర్షణల్లోను, మొరబాద్‌, మీరట్‌, గుజరాత్‌ల్లో జరిగిన మతహింసలోను ఒక్క హిందువు లేరని, అందరూ ముస్లీంలేనని ప్రసంగించాడు. ఈ మరణహోమా లు వెనుక హిందూమతోన్మాద శక్తులు వున్నాయని అతనే ఒప్పుకు న్నాడు. ఇలాగే మాట్లాడే అశోక్‌సింఘాల్‌ ఆదిత్యనాగ్‌ యోగి, ఉమాభారతి, నరేంద్రమోడి, సాధిరితంభర, వరుణ్‌గాంధీ వంటి వారిని ఈ లౌకికరాజ్యం అరెస్టులు చెయ్యదు. ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని గురించి పదే పదే మాట్లాడుతున్న హిందూత్వ శక్తులు, ముస్లింజనాభౄలో ఒక వ్యక్తి తీవ్రవాదానికి పాల్పడితే మొత్తం ముస్లిం జాతికి నేరాన్ని అంటగట్టే పనిని దశాబ్దాలుగా ప్రణాళికాబద్దంగా అమలు పరుస్తు న్నాయి. ఉన్మానం మెజారిటీకి, మైనారిటీకి రెండింటికి అంటుకుని ఉంది. మెజారిటీగా హిందువులు ఉన్న భారతదేశంలో, వారిని అడ్డుపెట్టుకుని హిందూ త్వశక్తులు కుఠిలయత్నాలు చేస్తున్నాయి. భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలనే కుట్ర దీని వెనకుంది. సెప్టెంబర్‌ 8, 2006నాటి మాలెగావో, అక్టోబర్‌ 11, 2007నాటి ఆజ్మీర్‌లోని దర్గా, మే 18, 2007న హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్ల సంఘటనలలో హిందూత్వ శక్తులకు సంబంధాలు న్నాయని కేంద్రం భావించి జాతీయ దర్యాప్తు సంస్థచే 2010లో విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరీ 18, 2007న అర్థరాత్రి ఢిల్లీ-లాహోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై జరిగిన దాడిలో 68మంది ప్రజలు చనిపోయారు. ఈ దాడిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 2008లో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో వామపక్షాలు హిందూత్వ తీవ్రవాద ఆంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. 2003లో మహారాష్ట్రలోని పర్బని, జల్నా, జల్‌గావ్‌ జిల్లాలో, 2005లో ఉత్తర ప్రాదేశ్‌లోని మౌజిల్లాలో 2006లో సాందేడ్‌లో, 2008 తిరునల్వేలిలోని తెన్‌కాశీలో, 2008ఆగస్టున కాన్పూర్‌లో జరిగిన వివిధ బాంబు దాడులలో ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగదళ్‌ పాత్ర నిరూపితమయ్యింది. గాంధీని, గాడ్సే హత్యచేసిన సందర్భంలో 1948, పిబ్రవరి 4లో అప్పటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని విధించారు. తీవ్రవాదానికి మంతం రంగు పులమకూడదు. దేశ సమగ్రత, సమైక్యతలకు భంగం కల్గించే తీవ్రవాదాన్ని ఉపేక్షించ కూడదు. భారతీయ సమాజంళక్ష లౌకిక త్వత్వం అంతర్లీనంగా ఉండటంవల్ల, మతాలు మధ్య సామరస్యం సాధ్యమవుతోంది. భారతదేశంలో హిందూత్వ తీవ్రవాదం వల్లే ఇస్లామిక్‌ తీవ్రవాదం హిందూ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. రాజకీయాన్ని హైందవీకరించి, హిందూవులను సైనికీకరించాలని 1935లోనే నాసిక్‌లో మిందూత్వ తీవ్రవాదానికి శిక్షణను ఇప్పించాడు. హిందూత్వ తీవ్రవాది నాధూరాంగాడ్సే జనవరి 30, 1948న బిర్లామందిరంలో గాంధీజి ప్రార్థనకు వెళుతుండగా గాంధీ గుండెలమీద కడుపులోకి తూటా లను పేల్చాడు. 1934నుంచి 1948మధ్యకాలంలో గాంధీజిపై 6సార్లు హత్యప్రయాత్నం జరగ్గా, గాడ్సే పేరుతోపాటు సావర్కార్‌ పేరు కూడా ఈ కేసులలో ప్రస్తావించబడింది. ఇది హిందూత్వ ఉన్మాద కుట్రలో భాగంగా జరిగిందని కేంద్ర నిఘా సంస్థలు పేర్కొన్నాయి. హిందూ మతోన్మాద సంస్థలు గాంధీజిపై కక్షకట్టి, గాంధీపై వ్యతిరేక భావాలను ప్రజల్లో ప్రచారానికి పెట్టింది. ముస్లీంలకు ప్రత్యేక దేశం, కాశ్మీర్‌పై తుగినిర్ణయం, ముస్లీంలను బుజ్జగించడం వంటి ఆంశాల విషయం లో గాంధీని దోషినిచేసే ప్రయత్నం చేసింది. గాడ్సే వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉన్మానదం హిందూవులందరికి ఆపాదిం చకూడదు. హిందూవులందరికి ఆపాదించకూడదు. హిందూత్వ ఉగవ్రాదానికి పునాదిని నయా ఉదారవాద రాజ్యవ్యవస్తే కల్పిస్తుంది. ప్రజలను మతపరంగా విడదీసి, వారి మధ్య వైషమ్యాలను పెంచేవిధంగా ఉదారవాదం పరిపాలనను విడదీసి, వారి మధ్య వైషమ్యాలను దేశాల్లోని బలహీనవర్గాల జీవనస్థితిగతులు నానాటికి దిగజారుతూ ఉన్నప్పటికీ, వారిని రాజ్యానికి వ్యతిరేకంగా సంఘ టితమయ్యే అవకాశాన్ని రాజ్యం బలహీనపరిచి, గుర్తింపు రాజకీ యాలను ప్రోత్సహించి, కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. సామాజి క, ఆర్థిక వెనుకబాటుకు మతమే ప్రధానకారణమని ఉదారవాదం ఉద్బోదిస్తుంది. భారతీయత, భారతజాతి వంటి భావాలను హిందూత్వ భావజాలంలోనే అర్ధం చేసుకునే విధంగా ప్రజలను పరిమితం చేస్తుంది.భగత్‌సింగ్‌, అల్లురిసీతారామారాజుకు హిందూ త్వ శక్తులు పూజలు చేయడం, భారతమాత చిత్రపటాన్ని రూపొం దించి ఊరేగింపు చేయటం వంటివి ఈ కోవలోకే వస్తాయి. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమైన, స్వాతంత్య్ర పోరాటంలోని భారతీయత భావనను క్రమేపీ సామ్రాజ్యవాద అనుకూల నినాదం దగా మార్చివేశారు. హిందూ మతోన్మాదశక్తులు ఏకజాతీయ భావ నను, యూరఫ్‌ ఫాసిస్టుల నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఆధునిక జాతియతను మతపరంగా నిర్మించేక్రమాన్ని గోల్వాల్కర్‌, సావర్కర్‌లు మొదలుపెట్టారు. హిందూస్తాన్‌లో హిందూమతం, హిందూ సంస్కృ తి, హిందీ భాష కొనసాగాలని వీరు భావిస్తారు. ప్రొటెస్టంట్‌ మతాన్ని జర్మనీ, ఇంగ్లాండ్‌, స్వీడన్‌ అనుసరిస్తాయి. క్యాధలిక్‌ మతాన్ని ఫ్రాన్‌స, స్పెయిన్‌ ఇటలీ అనుసరిస్తా యి. వారి దేశాల్లో మైనారిటీ మతస్తులపై ఇప్పటికీ దాడు లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫాసిస్టు దోరణుల వల్ల ఆరు మిలియన్ల మంది యూదులు చంపివేయబడ్డా రు. భౌగోళికం, జాతి, మతం, సంస్కృతి, భాష అనే ఏకత్వాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభోదిస్తుంది. సంస్కృతం మాతృభాసని, అన్ని భారతీ య భాషలు దీన్నుండే పుట్టా యనే అసత్య ప్రచారాన్ని చేశౄ రు. స్థానిక భాష అయిన ఉర్దూని, విదేశీ భాషను చేశౄరు హిందూత్వ నమూనాను గుజ రాత్‌లో అమలు చేస్తున్నారు. 2500 మంది మైనార్టీ లను చంపివేశారు. 3500కోట్ల రూపాయల ఆస్తిని కాల్చివేసి, 700మసీదులను గుజ రాత్‌లో కూల్చివేశారు. అయి నా మోడీని భారత భావి ప్రధానిగా మనం కీర్తిస్తు న్నాం. లౌకికవాదాన్ని ఆర్‌ ఎస్‌ఎస్‌ సహించలేదు. పలు భాషలు, మతాలు, సంస్కృ తులు ఉన్నా బహుళత్వ జాతి భవనను మతోన్మాదం ప్రమా దంలో పడవేసింది. గతాన్ని తమకణు గుణంగా ఉత్పత్తి చేసుకోవ డం, ద్రాడివవార సత్వాన్ని తిరస్కరిస్తూ మొహంజదారో, హరప్పాలను ఆర్యీకరించడం ఉదృతంగా జరుగుతోంది. నయా ఉదారవాదానికి, ద్రవ్య పెట్టుబడికి మధ్యఉన్న సంబధం ఆయా దేశాలలోని మెజారిటీ మతాన్ని ఫాసిజం వైపు మరలిస్తున్నాయి. ప్రపంచీకరణలో భాగంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని అనుస రించడం వల్ల దేశంలో లౌకిక వాదం ఆధునిక పోకడలను అలవర్చుకుని మెజారిటీ మతోన్మాదాన్ని బలహీనపరుస్తుందని అభిప్రాయపడుతున్నాం. దానికి విరుద్దంగా మనదేశంలో జరుగుతోంది. జాతీయతను వదులుకుంటే తిరిగి వలస దేశంగా మారవలసి వస్తుందని మెతకైన జాతీయరాజ్య విధా నాన్ని అనుసరిస్తున్నాం ఈ రాజ్యం మతోన్మాదానికి మద్తఉ పలు కుతూ వారి మార్గానికి అడ్డురాకుండా ఉంటోంది. మనదేశంలో 4,635 జాతుల సముదాయాలు వున్నాయి. ప్రతిజాతికి ప్రత్యేక వారసత్వ లక్షణాలు, భాష, సంప్రదాయాలు వున్నాయి. వీటిమధ్య సరస్పర సంభందాన్ని పరస్పర ఆధారితస్థితిని కొనసాగిస్తూ, ప్రతి సంస్కృతి స్వతంత్రను గౌరవించాలి. భారతదేశంలో 325 భాషలు, 25 లిపులు వున్నాయి. ఈ భిన్నత్వాన్ని కొనసాగనీయకుండా ఫాసిస్టు ధోరణులను హిందుత్వ శక్తులు అనుసరిస్తున్నాయి. రాజ్యవ్యవస్థ అనిశ్చితి స్థితిని నెట్టబడే ధోరణులు ఈ కాలంలో ఎక్కువవడానికి నయా ఉదారవాదం తనవంతు పాత్రను పోషిస్తుంది. నాగరికతకు పెద్ద స్ధాయిలో సామూహిక మతిమరుపు ఉన్నది. ఇదే రాజ్యాన్ని అన్ని అవలక్షణాలతో గౌరివిస్తుంటుంది. అధికారాన్ని చేజిక్కించుకునేం దుకు బిజెపి మరోమారు హిందుత్వ అజెండాను ప్రయోగిస్తోంది. మతవిభజన తనకు అత్యంత అవసరం. మతతత్వం, ఛాందసవాదం తో కలిస్తే జరిగే విపరీతాలను మనం చూస్తూనే వున్నాం. తీవ్ర కుదుపులకు లోనవుతున్న దేశ లౌకికత్వాన్ని కాపాడే ప్రయత్నం హిందు – ముస్లీం సోదరులిరువురు చేయాలి.
-ఎం.కె.కుమార్‌