సమాచార హక్కు – రాజకీయ పక్షాలు
తన కొక నీతి, ప్రపంచానికోక నీ3తి అన్న ద్వంద్వ ప్రమాణాలు మన వ్యవస్థలో వేళ్లునుకొని ఉన్నాయి. ఈ విషయాన్ని హ3ఆస్యం మేళవించి మన ఊళ్లలో ఒక కథ చెపుతారు. ఒక అయ్యవారు వీధి రచ్చబండ దగ్గర ఉపన్యాసం ఇస్త ఉల్లిపాయచలు ఎందుకు తినకూ డదో (నిజానికి ఉల్లి ఆరోగ్యకరం) సోదాహరణంగా వివరిం చాడట. గుమ్మంచాటునుండి ఆ ఉపన్యాసం విన్న ఆయన ఇల్లాలు, ఇంటికొచ్చి ఉల్లిపాయ లేకుండా వంటవండితే భోజనం చేస్తూ ఆ అయ్యగారు ఓసి పిచ్చిదానా చెప్పే నీతులన్నీ పామరల కోసమేనే! శుబ్బరంగా ఉల్లి వేసి కూరలు వండు. నీతులు చెప్పేది మన కోసం కాదు’ అని హితోపదేశం చేశాట్ట. అట్లా ఉంది మన రాజకీయ పార్టీల వ్యవహారం. రాజకీయ పక్షాలు సమాచార హక్కు చట్టం కిందకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ జూన్ నెల మొదటి వారంలో ఓ మంచి తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును చట్టబద్దం చేసి భారత ప్రజాస్వామ్యంలో విప్లవాత్మక మార్పు తెచ్చినట్టు చంకలు గుద్దుకున్న రాజకీయ పక్షాలన్నీ ఆ తీర్పుతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుకొన్నట్టు కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థకు చెందిన ఉద్యమారులు సుభాష్ చంద్ర అగర్వాల్, అనిల్ బైర్వాల్ రాజకీయ పార్టీలను కూడ సమా చార హక్కు చట్టం పరిధిలోకి వచ్చేలా ఆదేశించమని కోరుతూ సమాచార కమిషన్ ముందు దావా చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు కేంద్ర ప్రభుత్వం నుండి సాలీనా రు. 255 కోట్ల మేరకు రాయితీలు, మినహాయింపుల రూపంలో ఆర్థిక సహాయం అందుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు ఢిల్లీ నగరంలో రు. 2556.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం నాటికి ఉచితంగా కేటాయించి నవే. ఎన్నికల సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ ఆకాశవాణి, దూరదర్శన్‌లో గటల తరబడి ఉచిత సమయాన్ని పొందుతాయి. పన్నుల మినహాయింపులయితే వందల కోట్ల రూపాయలలో ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాయి. కాబట్టి రాజకీయ పక్షాలను కూడా ప్రభుత్వ సంస్థలతో సమానంగా పరిగణించి సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలని పిటిషర్లు వాదించారు. ఈ తీర్పు రావడానికి దారి తీసిన పరిణామాలు కొంత ఆసక్తికరంగా ప్రారంభమ య్యాయి. దేశంలో నల్ల ధనాన్ని వెలికి తీసే అంశాన్ని ఎన్నికల్లో ప్రధాన సమస్యగా తీసుకొని పోరాడుతామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ, తన ఆస్తులు, సంపదను బయట పెట్టాలని ప్రజాస్వా మ్య సంస్కరణల భాజపా నిర్ధ్వందంగా తోసిపుచ్చగా ఆ సంస్థ కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఇఎస్‌పి పార్టీలు కేంద్రం నుండి వివిధ రూపాలలో పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం పొందుతు న్నాయి. కాబట్టి వాటిని ప్రభుత్వ సంస్థలతో సమానంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సమాచార కమిషన్ ముందు పిటిషన్ వేసింది. తమని ప్రభుత్వ సంస్థలు కాదు. కాబట్టి తమ ఆర్థిక వనరుల మూలాలు బహిర్గత పరచాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుండి అమితంగా లాభం పొందుతున్న ఈ పార్టీలు తమ ప్రతివాదనను వినిపించాయి. ‘ప్రభుత్వంలో అన్ని విభాగాలకు పాదర్శకత ఉండడం అవసరం అని సుభాషితాలు చెప్పి, అన్ని ముఖ్యమైన ప్రభుత్వరంగాలను నియంత్రించే రాజకీ య పార్టీలు, తమకు మాత్రం పారదర్శకత అవసరం లేదని భావించడం వింతగా ఉంది’ అని తన తీర్పులో కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ ఆరు ప్రతివాద రాజకీయ పార్టీలు తమకు స్వచ్చంద విరాళాలు ఎన్ని లభించాయో దాతలు పేర్లు వారి చిరునాయాలతో సహా వెల్లడి చేయాల్సిందేనని తమ తీర్పులో ఉటంకించారు. మొదట ఈ తీర్పును ఆహ్వానించిన బిజెపి ఆ తర్వాత నాలుక కరుచుకుంది. తీర్పు అస్పష్టంగా ఉంది. కేంద్ర సమాచార కమిషన్ పాత్ర ఏమిటి, ఎన్నికల కమిషన్ విధులేమిటో ముందు తేల్చండి. రాజకీయ పార్టీలు పారదర్శకంగా ఉండాలని, అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయంలో మాకు పేచీ లేదు. ఎన్నికల వ్యవస్థ సూచించే మార్గదర్శక సూత్రాలను మేము అనుసరిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్త పరిచారు. సిపిఎం మొహమాటం ఏమలేకుండా తీర్పును తోసి పుచ్చింది. ఈ తీర్పును మేం ఆమోదించలేం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పాత్రపై సమాచార కమిషన్‌కు చాలా ఆపోహలు ఉన్నట్లున్నాయి అని పిసిఎం తీర్మానించింది. తీర్పు గురించి మాట్లాడుతూ విదేశాం గ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ‘శాసన విశృంకలంగా ప్రస్తావించడాన్ని అనుమతించ కూడదు’ అని అన్నాడు. దేశ ప్రయోజనాలు కాపాడవలసిన రాజకీయ పార్టీలకు ప్రజల నుండి దాచుకునే రహస్యాలు ఉండకూడదని తీర్పునిస్తే అదివిశృంకలత్వం ఎలా అవుతుందో ఖుర్షీద్ గారికే అర్థం కావాలి. రాజకీయ పక్షాలు బజారులో ఉండే దుకాణాల లాంటివి కావు. ఈ తీర్పు సమర్ధనీయం కాదు’ అని జనతా దళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ రంగంలో న్యాయవర్తనను కాపాడడం కోసం ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక విధాన రూప కల్పన చేయాలని స్థూలంగా పార్టీలన్నీ ఒక అభిప్రాయానికొచ్చాయి. ‘ప్రజల భాగస్వామ్యంతో కూడినదే నిజమైన ప్రజాస్వామ్యం’ నిజమైన ప్రజాస్వామ్యం అని ప్రభుత్వం పని తీరును తెలుసుకునే అద్భుతమైన అధికారం సమాచార హక్కు చట్టం ప్రజల కిచ్చిందని’ ఇంత వరకు రాజకీయ పక్షాలు చెప్పినవన్నీ వట్టి నేతి బీరకాయ కబుర్లని ఈ పార్టీలన్నీ చెప్పకనే చెప్పాయి. తమకు ఏఏ కార్పొరేటు సంస్ధ నుంచి ఎంత మొత్తం ముట్టిందో సమాచార చట్టం ద్వారా ప్రజలు తెలుసుకొనే అవకాశం ఉంటుందనే కదా వాటి భయం? కార్పొరేటు కంపెనీల నుంచే కాదు విదేశీ శక్తుల నుండి కూడా విరాళాలు రావచ్చు, వాటితో లాభం పొందిన వాళ్లు వాళ్లకు వ్యతిరేకంగా చట్టాలు ఎలా చేస్తారు? అన్న ప్రశ్న ప్రజల మెదళ్లలో ఉదయించకమానదు కదా! ఈతీర్పు అమలయితే రాజకీయ పార్టీలు ఎన్నికలలో అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో ఏ విధానాన్ని అవలంభిస్తున్నాయి. అన్న విషయాలు కూడా గోప్యంగా ఉంచడాని కి వీలుండదు. మా పార్టీ మా ఇష్టం మేం అన్ని విషయాలు ప్రజలకెందుకు చెప్పాలి అని రాజకీయ పార్టీలు ఇప్పుడెలా భావిస్తున్నాయో సమాచార హక్కు చట్టం వచ్చిన కొత్తలో ప్రభుత్వ సిబ్బంది అలానే ఫీలయ్యారు. తమ వ్యక్తిగత పని పద్దతులలోకి ఒక దురాక్రమణలాగా అభిప్రాయపడింది అధికార గణం. వలస తత్వాన్ని వంటపట్టించుకున్న భారత ఉద్యోగస్వామ్యం గోప్యతను ఇష్టపడుతుంది. వ్యవస్థ కంటే, చట్టం కంటే గొప్ప అనుకునే మనస్తత్వానికి సుప్రీంకోర్టు న్యాయ మూర్తులేం అతీతులు కారన్నది కూడా ఈ సందర్భంలోనే బయట పడ్డది. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక దరఖాస్తును పరిష్కారించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ సూచనలు సాక్షాత్తు సుప్రీంకోర్టే కింది కోర్టులో సవాలు చేసిన సంఘటన మన కళ్లముందుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొంత తగ్గి న్యాయమూర్తుల ఆస్తి వివరాలను బహిరంగ పరచాలని నిర్ణయించింది. ఈ తీర్పుతో పరిస్థితి ఆశాజనకంగా మారుతుందా అన్నది మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రశ్న తీర్పు అమలు కాకుండా ఉండడానికి యంత్రాంగం సవాలక్ష అడ్డంకులు సృష్టిస్తుం ది. సమాచార హక్కు చట్టం ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి గతంలో రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి 26 రాష్ట్రాల సమాచార కమిషనర్లకు ఒక సమాచారం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడట. అందులో 17 రాష్ట్రాలు ఆ దరఖాస్తును పట్టించుకోనేలేదట. మిగిలిన 9 రాష్ట్రాలు ఆ దరఖాస్తు చేరినట్టు అయితే సరిపోయిన సిబ్బంది,ఆర్ధిక వనరులులేక సమాచారం ఇవ్వలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేశాయట. ఆ మిగిలిన ఒక్కరాష్ట్రం, మహారాష్ట్ర, సరైన సమాచారం సరైన పద్దతిలో అందజేసింది. పదవి విరమణ అయిన బ్యూరోక్రాట్లకు పునరావాస కేంద్రాలుగా సమాచార కమిషన్ కార్యాలయాలు మిగిలిపోవడం సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కాకపోవడానికి ముఖ్య కారణంగా భావించవచ్చు. అసలు పదవి విరమణ అయిన అధికారిని, సమాచార కమిషన్‌గా నియమించారాదన్న నిబంధనను చట్టంలో పొందుపరచాలి. అలాగే ఏ అధికారిని తన స్వంత రాష్ట్రంలో సమాచార కమిషనర్‌గా నియమించడాన్ని నిషేధించాలి. ఈ తీర్పు వెంటనే అమలు కాకుండా ఏకపక్షంగా నిలుపుదల చేసే ప్రయత్నానికి రాజకీయ పార్టీలు ఒడిగట్టవచ్చునన్న అనుమానంతో పిటిషన్లు ఢిల్లీ కోర్టులో కేవియట్ దాఖల్‌చేశారు. కాబట్టి వెంటనే స్టే వచ్చే అవకాశం లేదు. అయితే ప్రజల ముందు పలుచనయిపోతామన్న భయంతో రాజకీయ పక్షాలు కోర్టులో ఈ తీర్పును వ్యతిరేకించక పోవచ్చు. ప్రభుత్వం ద్వారానే ఈ తీర్పును అటకెక్కించే ప్రయత్నం జరిగే ఆస్కారం ఉంది. అలాంటి నీచపు పద్దతులకు పాల్పడకుం డాప్రజాస్వామ్య ప్రియులు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. రేపు రానున్న ఎన్నికల్లో ప్రతి పార్టీని వాటి ఆదాయం ఎంత విరాళాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. వారు ఎవరి ప్రయోజనాలు కాపాడుతారో స్పష్టంగా ప్రకటించమని ప్రశ్నించాలి.
– ఎ రాజేంద్రబాబు