వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు ఆరుట్ల

తెలంగాణ సాయుధ పోరాట విప్లవ సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి. నైజాం నావాబుకు వ్యతిరేకంగా హోరాహోరా పోరాడి నైజాం అల్లరి మూకలను తరిమికొట్టాడు. తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాడు. ఆరుట్ల రామచం ద్రారెడ్డి. అందుకే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విప్లవ సేనాని తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవిల పోరాటం చరిత్రలను పల్లేల్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. వీర తెలంగాణ విప్లవ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే విసునూర్‌ దేశ్‌ముఖ్‌ భూస్వామ్య అరా చక విధానన్ని పాతరేసి పీడిత తాడివత ప్రజానికానికి అండగా నిలి చారు. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల రామ చంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, ముగ్ధూం మోహినోద్దీన్‌, నాయకత్వంలో లక్షలాది ఎకరాల భూమిని పంచారు. భూ సంస్కరణలు అమలు జరిపారు. నాలుగు వేల గ్రామాలలో ఎర్రజెం డాలు ఎగరవేసి  విముక్తి ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. తెలంగాణ పల్లేల్లో ఎటు చూసిన నేలరాలిన అమరవీరుల స్థూపాలు కనిపిస్తా యి. నాటి తెలంగాణ సాయుధ పోరాటం లేకుంటే ఇవాళ్ల తెలంగా ణ పోరాటం ఇంత స్ధాయిలో ఉండేది కాదేమో. అనిపిస్తుంది. కొలనుపాక, బైరాన్‌పల్లి, కడివేండి, రేణికుంట, కురారం, వాసాలమర్రి పాత సూర్యపేట, చందుపట్ల, ధర్మపురి ఇంకా ఎన్నో పల్లెలు పోరు పల్లేలు త్యాగాలు వారికి సొంతం. ప్రపంచ చరిత్రపుటంల ఇవాళ తెలంగాణ ప్రాంతమంత త్యాగాల చిరునామా గుర్తింపుపొందింది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వం వహించాడు. నిస్వార్థ పరుడ నిరాడంబరజీవి తన జీవితాన్ని తుదిశ్వాస విడిచేంత వరకు కష్టజీవుల కోసం అంకితమిచ్చిన మహనీయుడు గొప్ప త్యాగమూర్తి  అందుకే ఆరుట్ల దంపతుల పేర్లు ప్రజల గుండెల్లో నిలిచిపోయినవి. 1909లో నల్గొండ జిల్లా ఆలలేరు మండలవస్త్రం కొలనుపాకలో జన్మించాడు. ఆ రోజుల్లో జాగీరు పాఠశాలలు ఉండేవి మెట్రిక్యులేషన్‌ వరకు చదివాడు. 1920లో మంతపూరిలో ఆరుట్ల కమలదేవి జన్మించారు. కొలనుపాక కళ్యాణి చాళుక్యుల ఉపరాజ ధాని ఎడువేల గ్రామాలకు కేంద్రంగా ఉండేది. రేణకాచార్యులు జన్మించిన గ్రామమిది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ద జైన క్షేత్రం కొలనుపాకలో వుంది ఆరుట్ల కమలాదేవిని కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు. మందు మాంసం లేకుండా వాఖ హారంతో పెండ్లి భోజనాన్ని ఏర్పాటు చేయించాడు. సరోజిని నాయుడు కమలాదేవి ఛటోపాద్యాయుల వంటి సంఘ సేవకుల నుంచి స్ఫూర్తితో ఆరుట్ల రాయచంద్రారెడ్డి తన భార్య రుక్మిణి పేరున కమలాదేవిగా మార్చుకున్నాడు. ఆడ వాళ్లను ఆరోజులలో చదివించే వారు కాదు కానీ ఆరుట్ల కమలాదేవిని హైదరాబాద్‌లో చదివిం చాడు. ఆరుట్ల రాయచంద్రారెడ్డి చదువుకునే రోజుల్లో ఆయనపై రాజకీయ ప్రభావం ఉండేది. ఆంధ్ర మహాసభ సమావేశాల్లో పాల్గొన్నాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. యువతి యువకులను ఉద్యమాల వైపు మలిచాడు. చదువు పూర్తి చేసుకున్న తరువాత ఆరుట్ల దంపతులిద్దరూ కొలనుపాక చేరుకున్నారు. జాగిర్థార్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆధ్ర మహాసశపభల్లో చుకైన పాత్ర నిర్వహఙించారు. ఆరుట్ల. రాయయంద్రారెడ్డిని భువనగిరిలో జరిగిన అదకొండవ మహా సభకు ఆరుట్ల రాయచంద్రారెడిÊ డకార్యదర్శిగా ప్రతినిధదిగ ఆకమలాదేవిని నియమించారు. ఆరుట్ల దంపతులు ప్రత్యేక శిక్షణ పొందారు. నైజాం అల్లరి మూకలు వీరంగాలు అరాచకాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయి. దోపిడీలు మానభంగాలు హత్యలు చేశారు.  రజాకర్ల దర్మార్గాలను ఎదర్కోవడనికి ఏకైక పోరాటం సాయుధ పోరాటం ద్వాఆరనే విజవంతమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ భావించింది. దీంతో సాయుధ పోరాటం ఊపందుకుంది. పోరాటం ఉవ్వేత్తున సాగుతున్న క్రమంలో ఆరుట్ల దంపతులకు కొడుకు విప్లవ రెడ్డి జన్మించాడు. ఆరుట్ల కమలాదేవి పెద్దల దగ్గర వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆరుట్ల రాయచంద్రారెడ్డి నాయకత్వంలో గెరిల్లా దళాలు అనేకంగా ఏర్పడినాయి చల్లూరు బేగంపేట జాలా కురారం, రేణికు ంట గుట్టల చుట్టూ దళాలు ఉండేవి.నిజాం నవాబు జాగీరుదారుల నిరంకుశ పరిపాలనలో ప్రజలంతా పడే భాధలు అంత ఇంతాకాదు. విసునూర్‌ దేశ్‌ముఖ్‌ దేశ్‌పాండ్య బంజరు దొర దోపిడి విపరీతంగా జరిగేది. చాకలి పనులు వంతులకొద్ది చేసేవారు. వెట్టి చాకిరి పనుల కింద నలిగిపోయేవారు. 1930లో మండుటెండల్లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంబమైంది. దేశమంతటవ సుడిగాలిల జాతీయోద్యమం వీచింది. ఆ రోజుల్లో భారత విప్లవకారులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లు దేశం కోసం ఉరికంబం ఎక్కి రక్తాన్ని దారపోశారు. చంద్రశేఖర ఆజాద్‌ను వేటాడి వెంటాడి పట్టుకుని కాల్చిచంపారు. ఫాసిస్టు బ్రిటిష్‌ పాలకులు హైదరాబాద్‌ తెలంగాణ ప్రాంతంలో బ్రిటిష్‌ నిరంకుశ అరాచక పాలనకు వ్యతిరేక్గంఆ స్వదేశీ లీగ్‌ పేరిట ఉవ్తుఉ్తన ఉద్యమాలు ఎగిసిపడుతు న్నాయి. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాఒంతంలో 90 లక్షల జనాభా నిరంకుశ పాలనలో నలిగిపోయింది. లక్షలాది ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలకు పంచారు. భూ సంస్కరణలు అమలు జరిపారు. జైలులో ఆరుట్ల రాయచంద్రారెడ్డిని బంధించి కాళ్లకు సంకెళ్లు చేతులకు బేడీలు వేశారు. జైలులో ఉంటునే రాజకీయ ఖైదీగా పోరాటాలు చేస్తూ ఖైదీల హక్కులను సాధించాడు. వాసాలమర్రి కుట్రకేసులో ఆరుట్ల రామచంద్రారెడ్డిని అన్యాయంగా ఇరికించారు. తప్పుడు కేసని కొద్ది కాలానికి భువనగిరి కోర్టు కొట్టివేసింది. 1952లో ఆరుట్ల రాయచంద్రారెడ్డి జైలు నుంచి విముక్తి పొందాడు. నైజాంలు వచ్చారు. నైజాం దోపిడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాట పాత్ర చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. అన్ని వర్గాల ప్రజల ప్రేమ  ఆదరణలను చూరగొన్నది. ప్రజా ఉద్యమాలు సాయుధ పోరాటం ద్వారానే నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని అంతమొందించి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి చేసినారు. అనాటి పోరాటంలో గెరిల్లా దళాలు దళ సభ్యులు ఎంతో క్రమశిక్షణగా నడిపించేవారు. దళ నాయకులు ఆదర్శవంతమగు జీవితాన్ని గడిపేవారు. కడివెండి విసునూర్‌ దేశ్‌ముఖ్‌ల ఆధీనంలో ఉండేది. కడివెండి అన్నిరకాల దోపిడి దైర్జన్యాల వెట్టి చాకిరికి గురవుతుంది. విసునూర్‌ దేశ్‌ముఖ్‌లు భూస్వాముల దాడిలో దొడ్డి కొంరయ్య, ప్రానాన్ని వదిలాడు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య అమరజాతులుగా మిగిలిపోయారు. విసునూర్‌ రౌడీలను దొడ్డి కొమురయ్య వీరమరణానికి ప్రతీకారంగా రౌడీలను విసునూర్‌ గ్రామ పొలిమేర్లలోకి తరిమికొట్టారు. కడివెండి ప్రజానీకం మెదక్‌ సిరిసిల్లా రామయంపెట  శాసనసభ నుంచి ఆరుట్ల రామచంద్రారెడిఒ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957, 1962లె ఆనేటకల రయలాదూవి శాసన సభకు ఎన్నికయ్యారు. 1962లో కమ్మూనిస్టు పార్టీ నుంచి వాసనసభ ఉప నేతగా 1964లో ప్రతిపక్ష నాయకురాలుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చరిత్రో ఏకైక మహిళా ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతుల జీవితం ఆదర్శం, నిస్వార్థంగా ప్రజల కోసం తమ జీవితాలను అంకితమిచ్చారు. ప్రజలకోసం, ప్రజలు పడుతున్న బాధలు చూడలేక అడవి బాటపట్టి ఆయుధాలు పట్టినోళ్లు తుదిశ్వాస విడిచేంతవరకు ఆరుట్ల దంపతులు నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉన్నారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ఆరుట్ల దంపతులు గుర్తింపు పొందారు. 1985 ఆగస్టు 26న విప్లవ  సేనాని  రామచెంద్రా రెడ్డి అమరుడైనాడు.ఆరుట్ల దంపతుల పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.విద్యా క్రీడా సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆలేరు నియోజక వర్గంలో విద్యార్థులకు ఆరుట్ల దంపతుల పేరిట సాంస్క్రృతిక కార్యక్రమాలునిర్వహించి పురస్కారాలు అందిస్తునారు.సమాజస్థాపన కోసం కోటి కళల కన్న ఆరుట్ల దంపతులు ఆ లోకాన్ని విడిచి వెళ్లినా వాళ్ల ఆశయాలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే.అదే ఆరుట్ల రామచంద్రారెడ్డి కి అసలైన నివాళి.
` దామరపల్లి నర్సింహ రెడ్డి