సంక్షేమ పథకాలు ` పేదరిక నిర్మూలన

(బుధవారం తరువాయి భాగం)
ప్రభుత్వం ఇచ్చే సిమెంట్‌ బస్లాకు అయ్యే ఖర్చును కూడా ఇందులోనే చూపిస్తుంది. ఈ మొత్తానికి తొడు ఐకెపి పొదుపేఉ సంఘాల సభ్యురాలై ఉంటే బ్యాంకు లింకేజీ రుణం మరో 20,000 రూపాయలు మంజూరు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మేస్త్రీ, కూలీ ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే 30 బస్తాల సిమెంట్‌ ఇంటి ప్లాస్టరింగ్‌ తప్ప దేనికి పనిచేయడం లేదు. ప్రభు త్వం ఎంతో కొంత డబ్బులు ఇస్తుందనే భరోసాతో ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన పేదలు దానిని పూర్తి చేయడానికి లక్ష నుంచి లక్షా 50 వేలు అప్పు చేయాల్సి వస్తోంది. ఐరన్‌, ఇతర భవన నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశన్నంటుతుండడంతో ఖర్చు మరింత పెరిగిపో తుంది. పథకం అమమలు విషయానికోస్తే మూడు దశల్లో వచ్చే బిల్లుకు బిల్లులో 10 నుంచి 20 శాతం చొప్పున హౌసింగ్‌ ఎఈల కు, స్ధానిక దళారులకు ఇవ్వాల్సి వస్తోంది. అందరి వాటాలు పోను లబ్దిదారుడికి 20 వేల రూపాయలు కూడా చేతికి రావడం లేదు. ఇల్లు కట్టుకున్న వారికి చాలా మంది లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాకపోగా నిర్మించని వారి పేర్ల మీద స్ధానిక నాయకులు డ్రా చేస్తున్నారు. ఒక్కో మండలంలో కోట్లాది రూపాయల కుంభకో ణాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష టిడిపి నాయకులు ఉండడం గమనార్హం. బిల్లుల కాజేసింది స్ధానిక నాయకులయితే తమ పేర్ల మీద ఇల్లు వచ్చిన విషయం కూడా తెలియని వారికిరెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద నోటీసులు అందుతున్నాయి. రోశయ్య హాయం వరకు ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరైనప్పటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక బిల్లులు మంజూరును నిలిపేశారు. కొత్త ఇళ్ల మంజూరు ఆగిపోయింది. బిల్లులు వస్తాయని అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న పేదలకు తీరా బిల్లులు రాకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహ త్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పేదల కోసం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 20074లో రాజీవ్‌ స్వగృహ పథకాన్ని మధ్య తరగతి ప్రజల కోసం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 94 మున్సిపాలిటీల్లో 85,961 ఇళ్లను అపార్ట్‌మెంట్ల తరహాలో నిర్మిస్తామని ప్రకటించింది. ఇళ్లు పొందడం కోసం 1.74 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుదారుడు మేడు నుంచి ఐదు వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఈ పథకం మధ్య తరగతి ప్రజల ప్రయోజనం కోసమని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నప్పటికీ ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే ఎక్కువగా ఉపయోగపడిరది.
రాజీవ్‌ యువకిరణాలు
కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠమెక్కాక గతంలో అమలులో ఉన్న అనేక పథకాల పేర్లు మార్చారు. తనదైన ముద్ర వేసుకోవడా నికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే  రాజీవ్‌ యువ కిరణాలు, రాజీవ్‌ ఉద్యోగ కిరణాలు లాంటి పథకాలను ప్రవేశపెట్టా రు. ఇప్పటి వరకు పథకాల మీదున్న వైఎస్‌ ముద్రను చేరిపి వేయడానికి నానా తంటాలు పడుతున్నారు. యువతకు ఉపాధి అవకావాలు కల్పిస్తానంటూ 2011 ఆగస్టు 21న విశాఖపట్నంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. 20014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని 15 లక్షల మంది యువతకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పధకం లక్ష్యమని ఆయన ప్రకటించారు. 2011 డిసెంబర్‌ కల్లా లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రకటించారు. 2012 బడ్జెట్‌లో ఈ పథకానికి 777కేటాయించారు. ప్రభుత్వ ప్రకటనతో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు రాజీవ్‌ యువ కిరణాలు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న కంప్యూటర్‌ సెంటర్ల నిర్వాహకులు కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి పొందారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హాయంలో రాజీవ్‌ ఉద్యోగశ్రీ కింద శిక్షణ పొందిన వారి పేర్లనే చూపించి రాజీవ్‌ యువ కిరణాలు పధకంలో కూడా శిక్షణ ఇచ్చినట్లు కోట్లాది రూపాయల నిధులు స్వాహా చేశారు. ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఎక్కువగా వాచ్‌మెన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు హోటళ్లలో సర్వర్లు, ట్యాలీ అండ్‌ అకౌంటింగ్‌, మల్టీమీడియా తదితర అంశాలకు సంబంధించినవి కావడం గమనించాల్సిన విషయం. రాజీవ్‌ యువ కిరణాల కింద తాత్కాలిక ఉద్యోగాలు పొందిన వారికి ఐదు, ఆరు వేల జీతం మాత్రమే ఇవ్వడంతో మధ్యలోనే మానేసి ఇంటిబాట పడుతున్నారు. ఈ ఉద్యోగాల్లో శ్రమ దోపిడీ విపరీతంగా  ఉంటుంది. ఈ ఉద్యోగాలు స్వగ్రామాలకు దూరంగా పట్టణాల్లో నగరాల్లో ఇస్తుండడంతో వారు అక్కడ ఉండడానికి గది అద్దెలు, ఇతర ఖర్చులకే జీతం సరిపోతుంది. దీంతో ఉన్న ఊళ్లో కూలీ చేసుకోవడం నయమని ఇంటికొచ్చే స్తున్నారు. ఇలా వదిలేసిన ఉద్యోగుల స్ధానంలో కొత్తవారిని నియమించి వారిని కూడా ప్రభుత్వం తాము ఉపాధి కల్పించిన సంఖ్యలో కలుపుకుంటోంది. రెండుళ్లలో ప్రభుత్వం రాజీవ్‌ యువకిరణాల పథకంలో మూడు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇటీవల పలు సభల్లో ప్రకటించారు. ఈ ఉద్యోగాలనిÊ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్దతిన నియమించినవే. నిజానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం వివిధ బహుళజాతి కంపెనీలకు, ప్రైవేట్‌ కంపెనీలకు తక్కువ జీతంతో పనిచేసే యువకులకు సరఫరా చేసే దళారీగా పని చేసింది. ఇందులో ఎంపికైన వారికి కార్మిక చట్టాలను కనీస వేతనాలను అమలు చేయలేదు. ఉద్యోగ భద్రతా ఊసే లేదు.
బియ్యం..రేషన్‌షాపులో రూపాయికి కిలో.. మార్కెట్‌లో రు.40
వైఎస్‌ హాయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి దాని స్ధానంలో రుపాయికి కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని గణేష్‌చౌక్‌ వద్ద 2011, నవంబర్‌ 1న సిఎం కిరణ్‌ లాంఛనంగా ప్రారంభించారు. తెల్లరేషన్‌ కార్డు దారులకు ఒక్కోక్కరికి నెలకు నాలుగు కిలోల చొప్పున ఇస్తున్నారు. రేషన్‌షాపులో ఇచ్చే ఈ బియ్యం కుటుంబ సభ్యులకు వారం రోజులు కూడా రావడం లేదు. ఇవి దొడ్డు బియ్యం కావడంతో తినడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతన్నారు. రేషన్‌షాపులో రుపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో ధరలను అదుపు చేయలేకపోతుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర ప్రస్తుతం రు.40 నుంచి 50 వరకు పలుకుతోంది. మిగతా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారుతోంది.
ఇందిర జలప్రభ
ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2011, అక్టోబర్‌ 2న ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం జంగాలపల్లిలో సిఎం ప్రారంబించారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఆరు లక్షల కుటుంబాలను పైకి తీసుకురావడమే ఈ పథకం ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీల భూముల్లో బోర్లు వేసేందుకు, బావులు తవ్వేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అలాగే సకాలంలో బకాయిలు చెల్లింఇన రైతులకు కూడా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలన ఇస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని కూడా ఇందిర జలప్రభతో పాటే ముఖ్యమంత్రి జంగాలపల్లిలో ప్రారంభించారు. ఈ పధకం కింద 95 లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారు. ఈ పధకం కోసం సబ్సిడిని ప్రభుత్వమే భరిస్తుంది.
పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు
పొదుపు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణం అందించడానికి స్త్రీ నిధి పధకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి 1400 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏడాదిలో మహిళా సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా 15 వేల కోట్ల రూపాయల రుణాలు అందించనున్నారు. అలాగే మండల కేంద్రాల్లో 1097 స్త్రీ శక్తి భవనాలు నిర్మించనున్నారు. ఈ పథకం కింద 1.3 కోట్ల మంది పొదుపు సంఘాల మహిళలు లబ్దిపొందనున్నారు. అయితే ఇదివం కు పావలా వడ్డీ రుణాలన సక్రమంగా అమలు చేయని ప్రభుత్వం, వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది. బ్యాంకులకు ఇది వరకు పావలా వడ్డీ రుణం తీసుకున్న మహిళలు చెల్లిస్తే మిగతా ముప్పావలా వడ్డీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రభుత్వం తన వాటా వడ్డీని బ్యాంకులకు చెల్లించకపోవడంతో మొత్తం వడ్డీనిఇ బ్యాంకర్లు మహిళల నుంచే వసూలు చేశారు. తాజాగా ఇచ్చే రుణాలకు కూడా ప్రభుత్వం వడ్డీ చెల్లించకపోతే అది కూడా మళ్లీ మహిళల మీదే పడే అవకాశం ఉంది.
అభాసుపాలైన అమ్మహస్తం
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచార ఆర్భాటం శృతి మించిపోతోంది. రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే చక్కెర, చింతపండు, పసుపు, కారం, కందిపప్పుతో సహా తొమ్మిది రకాల సరుకులు ఇస్తామంటూ అమ్మహస్తం పథకం ప్రారంభించారు. వాటిని కిలో అరకిలో ప్యాకెట్లు చేసి, వాటి మీద ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి బొమ్మలు వేసి విక్రయిస్తున్నారు. వీటిని తీసుకెళ్లేందుకు ఇవే ఫోలోలతో ప్రత్యేకంగా బ్యాగులు ముద్రంచి ఇస్తున్నారు. అయితే ఈ వస్తువుల ధర మార్కెట్‌ ధరతో సమానంగా ఉండడం, నాణ్యత లోపించడం, తూకంలో తేడాలు ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ పథకం ప్రారంభంలోనే అభాసుపాలైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సరిపడా సరుకులు అందించలేకపోయారు. నెలనెలా ఈ సరుకులన్ని కార్డుదారులు తీసుకుంటారో లేదో తెలియని స్థితిలో వీటికి వేలాది రుపాయలు అప్పుగా తీసుకొచ్చి డిడిలు చెల్లించడం రేషన్‌ డీలర్లకు కూడా తలకు మించిన భారంగా మారింది. బహిరంగ మార్కెట్‌లో ధరలను నిజయంత్రించలేని ప్రభుత్వం ఇలా చౌక ధరల పథకాలను ప్రవేశపెట్టడం చౌకదారుగా ఉంటుంది.
ఇందిరమ్మ పచ్చతోరణాలు
సిఎం కిరణ్‌ ప్రారంభించిన మరో పథకం ఇందిరమ్మ పచ్చతోరణం భూములు లేని ఎస్సీ, ఎస్టీలను గుర్తించి వారితో రోడ్లు, చెరువు, కాల్వ గట్ల వెంట పండ్ల మొక్కలు నాటిస్తారు. బక్కో కుటుంబానికి 200 మొక్కలు ఇవ్వనున్నారు. వీటిని పెంచేందుకు నెలకు రు.3000 కూలీగా చెల్లించనున్నారు. ఇవి పెరిగాక చెట్లను పెంచినవారి పెరు మీదే పట్టా చేయనున్నారు. పండ్ల మీద ఆదాయం కూడా వారికే చెందుతుంది. రు. 200 కోట్లు చేస్తున్న ఈ పథకానికి తొలుత లక్ష మంది లబ్దిదారులన ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పాత పథకానికి కొత్త పేరు బంగారు తల్లి
రాష్ట్రంలో ఆడశిశువుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతుండడంతో ఆ సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి  పథకాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ తరహా పథకాన్ని వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లఖ్‌పతి పేరుతో ప్రారంబించారు. ఈ పథకం ద్వారా లబ్దిపొందే బాలిక పేరిట ప్రభుత్వం రు. లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుంది. ఈ పధకానికి 2011లోనే నిధులు నిలిపివేసిన ప్రభుత్వం తాజాగా 2013, మే 1న బంగారు తల్లి అములులోకి తెచ్పిపెట్టింది. ఈ పధకం ద్వారా మే 1 తర్వాత పుట్టిన ఆడపిల్లలే లబ్దిపొందనున్నారు. పుట్టినప్పటి నుంచి గ్రాడ్చుయేట్‌ పూర్తయ్యే వరకు ఈ పథకం వారికి వర్తిస్తుంది. వీరికి బిడ్‌ పేరిట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ఆడపిల్ల పుట్టగానే ఆమె తల్లికి రు. 2500, ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు ఏడాది రు 1500, పాఠశాలలో చేరినపుడు రు 1000, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రు. 2000 ఆరు నుంచి ఎనిమిది వరకు రు.2500, 9,10 తరగతి వరకు ఏడాదికి రు.3000,ఇంటర్‌లో 3500, డిగ్రీలో  రు.4000 ఇవ్వనున్నారు. అంతసదేగాక డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయికి ఉన్నత చదువుల కోసం రు లక్ష అలా కాకుండా ఇంటర్‌తోనే చదువు మానేసిన వారికి రు.50,000 ఆర్థిక సాయం ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం తెల్లరేషణకార్డు ఉన్న వారందరికి వర్తిస్తుంది. తొలుత ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విమర్శలు రావడంతో వెనక్కి తీసుకుంది. అలాగే తప్పనిసరి ప్రభుత్వ ఆప్పత్రుల్లో ప్రసవించి ఉండాలనే నిబంధనను ఏజెన్సీ గిరిజనల విషయంలో సడలించింది. ప్రారంభమైన నెలన్నరకే జూన్‌ 19న ఈ పథకం అసెంబ్లీలో చట్టబద్దత పొందడం విశేషం.
ముగింపు
ఇవేగాక పేరు బయటికి రాకుండా, ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్లుగా మిగిలిపోయిన పధకాలు అనేకం ఉన్నాయి. అమలు చేయాల్సిన అధికారులకు కూడా తెలియని పథకాలు అనేక కాగితాలకే పరిమితమయ్యాయి. కొన్ని పథఖాలకు నిధులు విడుదల కాక, మరికొన్ని పథకాలను అధికారులు పట్టించుకోక ప్రచారొస్త్రంలోకి రావడం లేదు. అయితే ఈ సంక్షేమ పథకాలను స్థూలంగా చూస్తే ఇవన్నీ పేదరిక నిర్మూలనకు పైపూతలు మాత్రమే ఈ పథకాలను క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చేసరికి దళారులే అధికంగా లాభపడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు పర్సంటేజీలు పోనూ లబ్దిదారుడికి చివరికి కొసరే మిగులుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుచి అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాలు ఏవీ కూడా పేదరికానికి కారణమైన మౌళిక సమస్యలను పట్టించుకోలేదు. భూ సంస్కరణ పరిష్కరించలేదు. ఉపాధి అవకాశాలన కల్పించడంలో విఫలమయ్యాయి. ఇలాంటి సంక్షేమ పథకాలపై ఉన్న శ్రద్ద సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గానీ, ఉపాధినిచ్చే పరిశ్రమలన నెలకొల్పడంలో లేదు. పాలకవర్గంలో ఉన్న వారు ప్రజలకు చిల్లర పైసలు ఎరగా వేసి కోట్లాది రుపాయలు కొల్లగొడుతున్నారు. తమ దొపిడీ ప్రజలకు కనిపించకుండా వారు పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను సాధనంగా వాడుకుంటున్నారు. వారి అవినీతికి ఈ పథకాలు ముసు గుగా పనిచేస్తున్నాయి. సంక్షేమ పథకాలతో పేదరికాన్ని నిర్మూలి స్తామని ప్రభుత్వాలు ప్రకటించడం ప్రజలన మోసగించడమే .
` సిరసనగండ్ల సాహితి, సూత్రపు అనిల్‌
తరువాయి భాగం రేపటి సంచికలో.