‘శ్రమశక్తి’ ఉపయోగపు విలువ గురించి
శ్రమ శక్తి విలువ విషమం :
శ్రమ శక్తి విలువ గురించి మార్క్ చెప్పిన మాటలు చాలా వివరాలతో జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.మొదట మార్క్ మాటలు: సమాన విలువకూ, సమాన విలువకూ మారకం జరిగింది. పెట్టుబడిదారుడు, తన కోన్న ప్రతి సరుకుకీ -దూదికీ ,కుదురికీ.శ్రమ శక్తికీ-దాని పూర్తి విలువని చెల్లించాడు. (విశాలాంధ్ర వారి అనువాదం ,పే.177) ఒక పెట్టుబడిదారుడు ఏ ఉత్పత్తి సాధనాన్ని కోనాలన్నా ,ఇతర పెట్టుబడిదారుల నుంచి కోనాలి.ఆవస్తువుకు పూర్తి విలువలు చెల్లించవలసిందే. (కాని,ఉత్పత్తి సాధనాల కోసం పెట్టే డబ్బు కూడా పెట్టుబడిదారుడి స్వంత శ్రమతో వచ్చే డబ్బు కాదు. పాత ఉత్పత్తి సాధనాలు ఖర్చుయిన ప్రతీ సారీ ఆ డబ్బు వెనక్కి వచ్చేస్తుంటుంది.కోత్తఉత్పత్తి సాధనాలు, కోత్త అదనపు విలువ ద్వారా పెరుగుతూ వుంటాయి.పాతా-కోత్త ఉత్పత్తి సాధనాల ఏడబ్బు పెట్టుబడిదారుడి స్వంత శ్రమ కాదు.)దూదికీ, కదురుకీ,పూర్తి విలువలు చెల్లించునట్లుగానే పెట్టుబడి దారుడు, శ్రామికుడి శక్తికి కూడా పూర్తి విలువ చెల్లిస్తాడని మార్క్ చెపుతున్నాడు.శ్రామికుడి అవసరాలన్నీ తీర్చేదే శ్రమ శక్తి విలువ,అనుకుంటే పెట్టుబడిదారుడు అలాంటి జీతం ఇవ్వడం ఎన్నడూ జరగదని మార్క్‌కి తెలియదని కాదు.అయినా, పెట్టుబడిదారుడు పూర్తి శ్రమ శక్తి విలువని (మంచి జీతం) ఇస్తాడని మార్క్ ఎందుకు చెపుతున్నాడంటే,శ్రామికుడి శ్రమ విలువ 2భాగాలుగా ఉంటుందని రుజువు చెయ్యాడానికి పని దినం అంతా జరిగే శ్రమ,ఎంత ఎక్కువ విలువని ఉత్పత్తి చేస్తుందంటే, అందులో నుంచి శ్రామికుడికి పూర్తి శ్రమ శక్తి విలువ ని ఇచ్చినా,ఆపైన అదనపు విలువ కూడా ఉంటుందని చూపించగలం. పెట్టుబడిదారుడు,మంచి జీతం ఇవ్వకపోతే అప్పుడు అదనపు విలువ భాగం ఇంకా పెరుగుతుంది,పెట్టుబడిదారుడు ఎంత పెద్ద జీతం ఇచ్చినా,ఆజీతం మీదే లాభం పేరుతో అదనాన్ని కలిపి ధరిని నిర్ణయిస్తాడు.అలా కలిపిన మొత్తం విలువ అంతా సరుకు ద్వారా రావడానికి కారణం,అసలు కారణం సరుకు తయారీలో,శ్రమ శక్తి విలువనీ -అదనాన్ని కూడా శ్రమ విలువలో నించి శ్రమ శక్తి విలువని తగినంత తీసినా ఇంకా అదనపు విలువ మిగిలి, అది పెట్టుబడిదారుడికి అందుతుంది. తర్వాత విషయం:శ్రమ శక్తి విలువ కి సరైన హద్దు ఏమిటి? శ్రమ విలువ ని లెక్క కట్టినట్టుగా శ్రమ శక్తి విలువ ని లెక్క కట్టడం కుదురుతుందా? ఏసరుకు విషయంలో అయినా,శ్రమ విలువని లెక్క కట్టడం చాలా తేలిక.సరుకుని అమ్మితే 10 డబ్బు వచ్చిందానుకుందాం.ఆసరుకుకి అంత విలువ ఉండడం వల్లే అంత డబ్బు వచ్చిందని అర్ధం ఆసరుకు కోసం ఖర్చుయిన ఉత్పత్తి సాధనాల విలువని అనునకుం దాం.10లో నించి తేసేస్తే,మిగిలిన 7 ఆసరుకుని తయారుచేసిన మనిషి (మనుషుల )శ్రమ విలువ.ఈ రకంగా,ఒక సరుకుకి డబ్బుతో మారకం జరిగిన తర్వాత,ఆసరుకుని తయారు చేసిన మనిషి శ్రమ విలువని కచ్చితంగా తెలుసుకోవచ్చు.అయితే శ్రమ శక్తి విలువని తెలుసుకోవడం ఎలాగ? దానికి హద్దు ఏమిటి? -ఒక సరుకుని చేసినది స్వతంత్ర ఉత్పత్తిదారుడు అయితే అతని శ్రమ విలువనంతా అతనే వాడుకుంటాడు.అది తక్కువైతే తక్కువనే వడుతాడు:ఎక్కువైతే ఎక్కువనే వాడతాడు.అది అతని వాడకానికే అంటే శ్రమ శక్తి విలువ కి సహజమైన హద్దు శ్రమ విలువే .ఆరెండూ ఒకటే అసలు, స్వతంత్ర ఉత్పత్తి దారుల ద్వారా అవసరాల్ని మించినంత అత్యధికంగా శ్రమ జరగదు.అవసరాల్ని బట్టే అది జరుగుతుంది.ఎంత ఎక్కువ శ్రమ చేసుకున్నా దాని ద్వారా చిన్న ఆస్తిని కూడబెట్టుకున్నా అది అంతా అవసరాల లెక్కలో చేరుతుంది. శ్రమ శక్తి విలువ కి హద్దు ఏమిటి? -అనే ప్రశ్న అక్కడ రాదు. యజమాని లేని చోట,శ్రమ విలువే శ్రమ శక్తి విలువ.రెంటికీ తేడా ఉండదు. శ్రమ శక్తి విలువకి వేరే లెక్క ఉండదు.కానీ ఈ సహజత్వం,జీతాల శ్రామికుల విషయంలో నడవదు.ఒక శ్రామికుడి శ్రమ విలువ 7 అనుకుందాం.అందులో నించి ఎంతో కోంత భాగమే అతనికి శ్రమ శక్తి విలువగా(జీతంగా )అందాలంటే.అది ఎంత ఉండాలి? దాని హద్దు ఏమిటి? -ఇక్కడే జీతాల లెక్కలు.ఈ జీతాల లెక్కలు లేకుండా అతనికి శ్రమ విలువ 7 అంతా అతనికే అందితే,అదే అక్కడ శ్రమ శక్తి విలువ అవదా?కానీ ఇక్కడ ఇంకో విషయం.ఒక శ్రామికుడు,యజమాని అజ్నల కింద శ్రమ చేస్తూ రోజూ 20 విలువని ఉత్పత్తి చేస్తాడనుకుందాం అందులో నించి 8 వరకూ అతనకి అందితే,అతని అవసరాలన్నీ తీరుతూ సౌఖ్యంగానే ఉండగలడనుకు ందాం. అలాంటప్పుడు.అతని శ్రమ విలువ అయిన 20అంతా అతనికి అందినా దాన్ని అతను వాడలేడు.అందులో ఉన్న 8 విలువతో తప్ప మిగతా 12 విలువతో అతనికి అవసరం ఉండదు. అంటే,దీని అర్థం ఏమిటి? ఆమనిషికే యజమాని లేకపోతే,తన కోసం 8 వరకే పనిచేసి తర్వాత పని మానెయొచ్చు.పని దిదనం పోడవు తగ్గిపోతుంది.యజమాని ఉండడం వల్ల ఏం జరుగుతుం దంటే తనకు అవసరం లేనంత అత్యదికమైన పని చెయ్యవలసి వస్తుంది.ఆపని విలువ 20 లో నించి శ్రామికుడికి జీతంగా 4 మాత్రమే అందితే యజమానికి మిగిలేది. శ్రామికుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరిశ్రమ విలువ వాళ్లకే అందాలి అనేది ఆసందర్భానికి తగిన న్యాయమైనసూత్రమే కానీ యజమాని శ్రామిక సంబంధంలో పని దినం ఎన్నిగంటలతో ఉంటుందో ఆసంబంధల ేనఫ్పుడు కూడా పని దినం అలాగే ఉండనక్కరలేదు. రోజుకీ 15 గంటలు పనిచేస్తూ ,ఉత్పత్తి పిచ్చిగా పెంచుకుని దాన్నంతా వెర్రిగా వాడుకోనక్కవలేదు. వెవ్రిగా వాడుకోవడం అంటే భోజనాల బల్లని సాదా చెక్కతో చేసుకోవడం గాక బంగారంతో చేసుకుంటే, అది వెర్రీ శ్రమ,వెర్రీ ఉత్పత్తి,వాడకమూ! అన్నీ కలిసి ఉన్నాద స్తితి!ఎంత ఎక్కవగా అయినా శ్రమ చేసే శక్తి మన శరీరాలకు ఉంది.కదా అని సాదా ఉత్పత్తిల్ని వాడుకోవడాన్ని 100 రెట్ల విలువైన వస్తువుల వాడకంగా మార్చుకుంటే దాని కోసం ప్రకృతిలో వనరులన్నీ ధ్వంసమై ఉన్మాద స్తితి,మృత్యు శయ్యని కూడా ఎక్కిస్తుంది. చివరికి శ్రమ శక్తి విలువ కి సహజమైన హద్దు ఎలా ఉంటుందని తేలింది? శ్రమ శక్తి విలువ హద్దు శ్రమ విలువని దాటిపోకుండా ఉండాలి గానీ శ్రమ విలువలో ఒక భాగంగా శ్రమ విలువ కన్నా తక్కువగా ఉండడం కాదు. శ్రమ విలువే శ్రమ శక్తి విలువ.కానీ,పె ట్టుబడిదారుడు నిర్ణయించే జీతం అనేది,అలా ఎప్పుడూ ఉండదు. అది,శ్రమ విలువలో నించి అల్ప భాగమే.అందుకే ఆ పేరుని మనం కూడా జీతం అనవచ్చు గానీ, ఆతక్కువ విలువనే మనం శ్రమ శక్తి విలువ అనడం ఎందుకు?ఒక సరుకుకి డబ్బుతో మారకం జరిగిందంటే అది సమాన విలువల మారకమే అనేది విలువ సూత్రం జీతాన్నే సరైన శ్రమ శక్తి విలువ అనుకుంటే,ఒక రోజు శ్రమ శక్తికి 2 జీతం (కూలి) వచ్చిందంటే,ఆశ్రమ శక్తికి నిజంగా ఉన్న విలువ అంతే అనీ,దాని విలువ 2 కాబట్టే దానికి అంతే డబ్బు వచ్చిందనీ దానికి అంత కన్నా ఎక్కువ విలువ ఉండదనీ ఆ జీతాన్ని తీసుకునే శ్రామికుడూ కూడా ఒప్పుకోవలసి వస్తుంది.శ్రమ శక్తిని సరుకు అనడం పోరపాటు అయినట్టే జీతాన్ని శ్రమ శక్తి విలువ అనడం కూడా ఒక రకంగా పోరపాటే జీతం వ్రామికుడి అవసరాన్ని తీర్చే శ్రమ శక్తి విలువ కాదు. అలాంటప్పుడు జీతానికి శ్రమ శక్తి విలువ అని పేరు పెట్టడం కోన్ని విషయాల్ని చర్చించడం కోసం మాత్రమే జరగాలి. అంతేగాని జీతం అనేది నిజంగా శ్రమ శక్తి విలువ కాదు. దానికి,అంత మంచి పేరు పెడితే దాన్ని(జీతాన్ని) చాలా గౌరవించడమే అవుతుంది. జీతం అనేది దోపిడీ సంబంధమూ దోపిడి పేరు.దానికి హేతుబద్దమైన ఇంకో పేరుపెట్టాలంటే జీతాన్ని జీతమే అనాలి.మర్క్స్త్ కి జీతం పట్ల చాలా వ్యతిరేకత .శ్రామిక వర్గం తన జెండా మీద జీతం అనే పేరు తీసివెయ్యోలంటాడు.శ్రమ శక్తికి ఉండే ఉపయోగపు విలువని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవాలి -శ్రమ శక్తి తన విలువ కన్నా(తను ఎంత ఖర్చు వల్ల నిలబడిందో, -ఆ విలువ కన్నా) ఎక్కువ విలువ గల శ్రమ చెయ్యగలదు -అని అంటే శ్రమ తన విలువ కన్నా ఎక్కువ విలువని ఉత్పత్తి చెయ్యగలదు.2 పోషణలో తయారైన శ్రమ శక్తి 7 వరకే కాదు. 10 వరకూచ18 వరకూ కూడా చెయ్యగలదు. అది అలా చేసి తీరాలని కాదు. అవసర మైన పరిప్తితుల్లో అది అలా చెయ్యె గలదు-అని శ్రామికుడికి, పెట్టుబ డి దారిడితో ఉండే సంబంధం (ఏ యజమానితో ఉండే సంబంధం అయినా)తన శ్రమ శక్తిని అతి తక్కువ విలువ ఉత్పత్తి చెయ్యవలసిన సంబంధమే అందుకే శ్రమ శక్తి ఆసంబంధంలో అలాగే చేస్తుంది.శ్రమ శక్తిని పెట్టుబడిదారుడు కోంటే శ్రమ శక్తి వల్ల ఎంత ఎక్కువ శ్రమ జరిగినా ఆశ్రమ ఎంత ఎక్కువ విలువగా మారినా ఆశ్రమకి ఎంత డబ్బు వచ్చినా ఆ విషయాలతో ఆపరుకుని అమ్మేసిన శ్రామికుడికి ఏం సంబంధం ?పెట్టుబడిదారుడు అదనపు విలువని తీసుకుంటాడనీ శ్రమ దోపిడీ చేస్లాడనీ ఎలా అనగలడు శ్రామికుడు? పెట్టుబడిదారుడితో ఎలావాదించగలడు? శ్రామికుడి కన్నా పెట్టుబడిదారుడే శ్రామికుడితో దీమాగా వాదించగలడు.
వాళ్లు వాదనలు ఎలా సాగుతాయో చూడండి!
చూడు అబ్బాయ్ ! నువ్వ మొన్న మీ యూనియన్ మీటింగ్‌లో ఏవిటేవిటో చాలా మాట్లాడావట ! పెట్టుబడిదారుడు మన అదనపు విలువనంతా లాగుతాడు. మనల్ని దోస్తాడు అని ఏదేదో చెప్పావట !అది నిజమో కాదో నీ నోటితో చెప్పు! అంతా నిజమే నేను అలాగే మాట్లాడావా?నా వల్ల జరిగే శ్రమ దోపిడీ ఏమిటో చెప్పు! అ సంగతి మాశ్రామికుల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు నమ్ముకుండా ఎలా మాట్లాడతాను? నువ్వు ఇచ్చే జీతం కన్నా నేను చేసే శ్రమే ఎక్కువ దానితో నువ్వు వంద రూపాయలు సంపాదిస్తావు.కాని నాకు జీతంగా ఐదో పదో ఇస్తావు.మిగిలిందంతా నీకు! అదిశ్రమ దోపిడి కాదా? చూడూ నేనుమార్క్స్‌ని చదివాను.నువ్వు కూడా చదివావా అసలు? క్షుణంగా చదివాను అంతా మార్క్స్ నించే నేర్చుకున్నాను మన సంబంధం ఏమిటి? మజమానీ శ్రామిక సంబందం నువ్వు యజమానివీ నేను శ్రామికుణ్ణీ కాదు మనది సమాను సంబంధం అమ్మే కానే సంబంధం నువ్వు అమ్మేవాడివీ నేను కోనేవాడినీ మనం సమానులం అయితే నువ్వు యజమానివీ నేను పనివాడినీ ఎందుకు అయ్యాము?అయినా సమానులమే అసలు నువ్వు ఏం సరుకు అమ్ముతున్నావో నీకు తెలుసా? నువ్వు కోనేదోమిటో నీకు తెలిస్తే నేను అమ్మేదేమిటో నేకుతెలీదా?నాశ్రమ శక్తిని అమ్ముతున్నాను. బాగా చెప్పారు నీ సరుకు విలువని నేను ఇచ్చేస్తున్నానా ఎగ్గోడుతున్నానా? లెగ్గోట్టాలనే ఉంటుంది నీకు కానీ ఎగ్గోడితే మర్నాడు పనివాడు దోరకడు కాబట్టి ఎగ్గోట్టకుండానే ఇస్తావులే నీకివ్వాల్సింది ఎగ్గోట్టనని ఓప్పుకున్నావు అది చాలు నాకు నువ్వు అమ్మే సరుకు పేరు మళ్లీ చెప్పు! వంద సార్లు చెపుతా అది నాశ్రమం వక్తి నాశ్రమ శక్తి దానిక విలుర ఉంటుందా? ఎంత ? ఇస్తున్నారుగా జీతం ?అదే. ఏం ,జీతం అంటే నిస్సారంగా ఉందా నీకు?జీతాన్ని మార్క్స్ శ్రమ శక్తి విలువ అన్నాడు చదివావా?
– రంగనాయకమ్మ