‘శ్రమ శక్తి’ ఉపయోగపు విలువ గురించి

‘ఏ మాట ఏ సందర్భంలో అన్నాడో దాన్ని బట్టి ఉంటుంది అది. నువ్వు ఇచ్చేది శ్రమ శక్తి విలువే అయినా దాని పైన అదనపు విలువ ఉండి తీరుతుందని చూపించడానికే ఆ మాట అన్నాడు. నువ్విచ్చే జీతం శ్రామికుణ్ణి సేద తీరుస్తుందని మార్క్స్‌ అన్నాడని చెప్పకు?

‘గురువుని గొప్పగా గౌరవిస్తున్నావు, నేనిచ్చే జీతాన్ని అంత కన్నా తగ్గించి ఇస్తే ఓప్పుకుంటావా?’

‘ఎందుకు ఒప్పుకోవాలి? నేను చేసే పనిని తగ్గించి చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏ సరుకుకైనా దాని విలువ దానికి ఉంటుంది. అది ఎంత అయితే అంతా ఇవ్వాలి’.

‘అంటే, నేను ఇచ్చే జీతం, నీ శ్రమ శక్తి విలువే అని ఒప్పుకుంటావు. నీర సరుకు విలువని నీకు ఇచ్చేస్తున్నాను. తెలిసిందా?’

‘సరేలే, బాగానే వాదిస్తున్నావు, చెప్పు! ఏమిటి ఇప్పుడు?’

‘రాత్రి మార్క్స్‌ పుస్తకం తిరగేవాను. నువ్వు యూనియన్‌ లీడర్‌వి కదా?’ నీకో సంగతి చెప్పాలని పిలిపించాను. మన సంబంధాన్ని యజమానీ శ్రామిక సంబంధం అంటావెందుకు? నువ్వు అమ్ముతున్నావు, నేను కొంటున్నాను. మన సంబంధం అమ్మే-కొన సమానుల సంబంధం అది తెలుసుకో ముందు.’

‘కాదు నేను అమ్మేది, నువ్వు కోనేది, నా శ్రమ శక్తి వరకే. నేను నా మొత్తం శ్రమలో నించే నువ్వు నా అదనపు విలువని లాగుతున్నావు.నా శ్రమ శక్తికే ఎంతో కొంత చెల్లిస్తున్నావు గానీ, నా శ్రమకంతటికి చెల్లిస్తున్నావా? ఇలాంటి సంబంధం సమానుల సంబంధం ఎలా అవుతుంది?’

‘సరే, నేను మళ్లీ నా మొదటి ప్రశ్నే అడుగుతాను, నువ్వు అమ్మే సరుకు ఏమిటి?

‘నేనూ నా మొదటి జవాబే చెబుతాను. నేను ఈమ్మే సరుకు ని శ్రమ శక్తి’.

‘దాని విలువ చెల్లిస్తున్నానా?

‘చెల్లిస్తున్నావులే. చెల్లించకుండానే సరుకుని అమ్ముకునే పిచ్చివాడినా నేను?’

‘నువ్వేం పిచ్చివాడివి? చాలా తెలివైనవాడివే. అందుకే నిన్ను పిల్చాను. సరే నువ్వు అమ్మే శ్రమ శక్తికి ఉపయోగపు విలువ ఏమిటో చెప్పు! మారకం విలువని కాదు, ఉపయోగపు విలువ’ని చెప్పు?’

అన్ని విలువలూ తెలుసే నీకూ! నా శ్రమ శక్తితోనే నేను బోలెడు గంటలు పనిచేస్తాను. నువ్వు ఇచ్చే జీతం విలువ కన్నా నా శ్రమ విలువే ఎంతో ఎక్కువ. ఏ శ్రామికుడి శ్రమ శక్తి అయినా, తన విలువ కన్నా ఎక్కువ విలువని ఉత్పత్తి చేస్తుంది.

తక్కువ విలువ అని నేను అనేది నువ్వు ఇచ్చే జీతం గురించి. ‘జీతం అంటే, కొన్ని పోషణ ఉత్పత్తులు. ఆ ఉత్పత్తులే వచ్చి పని స్తలంలో పనిచేయ్యవు. శ్రామికుడు వచ్చి ఎక్కువ గంటలు పని చేస్తాడు. పోషణకు శ్రామికుడు వాడే విలువ కన్నా అతను ఇచ్చే విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నువ్వు అదనపు విలువని లాగ గలుగుతావు.

‘నా పెట్టుబడి మీద లాభం వేసుకుంటాను కాబట్టి పెట్టుబడికి లాభం వస్తుంది. దాన్ని అదనపు విలువ అంటానెందకు ?

లాభాలు వేసుకునే నీ పని ప్రతీ పెట్టుబడిదారడూ చేస్తాడు. నువ్వు అమ్మే సరకు ఎలాంటిదో నువ్వు కొనే ఉత్పత్తి సాధనాలూ అలాంటివే లాభంతో కలిసిందే సరకుకి అసలు విలువ అది ఎర్పడేది నువ్వు లాభం వేసుకోవడం వల్ల కాదు మా శ్రమ అంత జరిగి ఉండడం వల్ల!’

‘అబ్బా, చాలా గట్టిగా చదివావు మార్క్స్‌ని, శ్రమ శక్తికి ఉండే ఉపయోగపు విలువ, తన విలువ కన్నా ఎక్కువ విలువని ఉత్పత్తి చేస్తుంది. అంటావు, అంతేనా? ఆ మాట మళ్లీ చెప్పు!’

‘అంతే పూర్తిగా అంతే నువ్వూ బాగానే చదివదినట్టున్నావు మార్క్స్‌ని అదనపు విలువ ఎక్కడా కనపడలేదా?’

కనపడింది అదే చెప్తా నీ అంత బాగా కాదు గానీ నేనూ చదివాను బాగానే అయితే ఒక్కటి చెప్పు! నువ్వు ఒక చొక్కా కొనుక్కొన్నావు. దాని ఉపయోగపు విలువ నీదా, చొక్కాని అమ్మినవాడిదా? ఆ చొక్కాని నువ్వు తొడుక్కుంటావా అమ్మినవాడు తొడుక్కుంటాడా?’

‘ నేను కొన్న వస్తువుని నేను వాడతానా అమ్మినవాడు వాడతాడా? ఎందుకీ పరీక్షలు?’

‘భలే చెప్పావు. మరి, శ్రమ శక్తి సంగతి ఏమిటి? దాన్ని నువ్వు అమ్మావు. నేను కొన్నాను. నేను కొన్న సరుకు ఇచ్చే ఉపయోగం, నాది అవుతుందా, నీది అవుతుందా?’

‘తొందర లేదులే, కంగారు పడకు ఆలోచించి చెప్పు! ఏ సరుకుని అయినా కొన్న వాళ్లు వాడుకుంటారా, అమ్మిన వాళ్లు వాడుకుంటారా? శ్రమ శక్తి ద్వారా ఎక్కువ విలువ నాకు దొరికితే అందులో నా తప్పేముంటుంది?’

‘తొందర లేదులే, ఆలోచించి చెప్పు’

‘లేదు ఆలోచించేదేం లేదు ఎవరైనా కొన్నవి నిర్జీవ వస్తువులైతే ఆ వస్వువుల ఉపయోగాలన్నీ కొన్న వాళ్లవే కానీ శ్రమ శక్తి అనేది ఒక వస్తువా? ఇది ఒక మానవసందేహంలో విషయం. వస్తువూ మనిషీ ఒకటి కాదు.’

‘అలాగైతే, మానవయ దేహాన్ని ‘సరుకు’ ఎందుకు అన్నావు?

‘సరుకు అన్నది దేహాన్ని కాదు, శ్రమ చేసే శక్తిని.’

‘ఆ శక్తి, దేహంతో సంబంధం లేకుండా శక్తినే విడిగా పోషిస్తావా?’

‘ఆలోచించు, నిదానంగా’

‘సరుకు’ అంటే వస్తువే కాదు అమ్మకం దేనిమీద జరిగినా అది సరుకే. మార్క్స్‌నేం చదివావు? బండి తొలడం చదువు చెప్పడం వస్తువులు కాకపోయినా అవి సరుకులవుతాయా లేదా? ఆవుల్ని గేదేల్ని అమ్మితే అవీ సరుకులే. అలాగే శ్రమ సరుకు ఎందుకు అవదు? దాన్ని నువ్వు నాకు అమ్మావు, నేను కొన్నాను. దాని విలువని చెల్లించేశాను.నేను కొన్న సరుకు ఉపయోగపు విలువ నాదే. దాని వల్ల ఎంత ఎక్కువ విలువ దొరికినా అది నాదే. ఇదంతా మార్క్స్‌ చెప్పలేదా? చూడు ఇక నించీ నువ్వు ఎప్పుడూ శ్రమ దోపిడీ అనే మాట ఎత్తకు మీ యూనియన్‌లో ఇలాంటి అజ్ఞానపు ఉపన్యాసాలివ్వకు! ఈ సంగతి చెప్పాలనే నిన్ను పిలిపించాను. తొందరేం లేదు, బాగా ఆలోచించుకో!’.

లేదు లేదు ఇంకా ఆలోచించేదేమి లేదు ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదు. నా ఆలోచన ముగిసింది. ‘శ్రమ శక్తి’ అనేది, సరుకు కాదు అది అలా కనపడుతుంది, అంతే దాన్ని నేను అమ్ముతున్నాననీ, నువ్వు కొంటు న్నావనీ, ఇన్నాళ్లూ అలా అనుకొన్నాను. అమ్మే-కొనే వాళ్లం అయితే సమానులుగా ఉన్నామా? లేమని తెలసు, అయినా నేను అమ్ముతున్నాననీ, నువ్వు కొంటున్నావని ఆ భ్రమల్లోనే ఉన్నాను. అది పెద్ద పొరపాటు నీ వల్ల జరిగేది శ్రమ దోపిడి కాదని నువ్వు వాదించడానికి నా పొరపాటు నీకు ఎంత సాయపడిందో నీకు ఎంత ధైర్యం ఇచ్చిందో, నాకు ఇప్పుడు తెలుస్తోంది. నాశ్రమ శక్తిని నువ్వు కొంటున్నావా? ఏం పెట్టి?’

‘నీ డబ్బు పెట్టా? డబ్బు నీదా? ఏ శ్రమ చేసి డబ్బు సంపాదిస్తున్నావు? నాశ్రమని అమ్మి, నా డబ్బులో నించి ఒక్క పైసా నాకు పడేస్తావు. మిగతా డబ్బు రాసీ నీ పరం! ఇప్పటికైనా కళ్లు తెరిచాను నా శ్రమ శక్తిని కొంటున్నావని విర్రవీగకు! అది సరుకు కాదు’.

నీ గరువేం చెప్పాడు , చాలా లెక్క ఉంది. గురువు పొరపాటుని గురవు ముందు పెట్టేటంత వివేకం ఉంది నాకు.

నువ్వు నీ మాట మార్చుకుంటే నీ గురువు కూడా తన సిద్దాంతాన్ని మార్చుకుంటాడా?

సిద్దాంతం ఎందుకు మార్చాలి? ఎక్కడైన ఒక ఆలోచనలో పొరాపాటు జరిగితే దాన్ని మార్చాలి. పోరపాటు జరిగితే మార్క్స్‌ ఎందుకు మార్చుకోడు? తప్పకుండా మార్చుకుంటాడు? ఎంత తెలివిలో అయిన పొరపాట్లు జరగవచ్చు.

‘అంటే మార్క్స కూడా పొరపాటు చేశాడంటావా?’

‘అనక తప్పదు శ్రమ దోపిడీయే లేదని దొపిడీ దారుడ విర్రవీగుతుంటే నోరెత్తలేని స్థితిలో శ్రామికుడు పడిపోయాడంటే కారణం నా గురువు పోరపాటు.

నీ గురువు చేసిన తుప్పు ఇది కాదు అసలైన తపు& కార్మిక వర్గ నియంతృత్వం బోధన అసలు మార్చాల్సింది అదీ’

‘కార్మిక వర్గ నియంతృత్వం నూటికి వెయ్యి పాళ్లు ఉత్తమ సూత్రం. ఆ సూత్రమే లేకపోతే, ఈ పెట్టుబడి బందిఖానా నించి ఎలా విముక్తి మాకు? నీ ఉత్పత్తి సాధనాల కుప్పని మార్క్స్‌ ఏమాన్నాడో తెలుసా? డెడ్‌ లేబర్‌ అన్నాడు చచ్చిన శ్రమ, సజీవ శ్రమ మీద అధార్జీ చేస్తోందన్నాడు. నీ ఆస్తుల మత్తుతో కొండల్ని అడవుల్ని సముద్రాల్ని మొత్తం భూఖండాన్నంతా ఆక్రమించి ఉన్నావు. కార్మిక వర్గ నియంతృత్వమే మా ఆయుధంగా లేకపోతే నీ కబంధ హస్తాల నించి భూఖండాన్ని విడిపించేదెలాగ? మీ సోమరి దండుని మా సరసన యంత్రాల ముందు నిలబట్టేదెలాగ? మా రక్షణ కవచం మా నియంతృత్వమే.

‘ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? నీతో ఎంత సహనంగా మాట్లాడుతున్నానో గ్రహించలేవా? నేను ఎంత కష్టపడి ఈ కంపెనీని నడుపుతున్నానో నువ్వు చూడడంలేదా? ఇంత పెట్టుడడి పెట్టి

‘ఈ మాట శ్రామికుల ముందెప్పుడూ అనకు నవ్వులపాలవుతావు. నీ పెట్టుబడి రహస్యాలు మాకు తెలియనివి కావు. నీ పాత పెట్టుబడి అంతా వెనకటి శ్రామిక వర్గం నించి ఎటా లాగే అదనపు విలువ. రోజంతా తాగుడూ తిరుగడూ తప్ప ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టే పని చేయ్యని నీకు స్వంత డబ్బా? స్వంత ఆస్తా? పెట్టుబడి నీదా?’

-రంగనాయకమ్మ