పల్లె సీమలను కాపాడుకుందాం

సామ్రాజ్యవాదీ విష సంస్కృతిలో పల్లెలు, కనుమరు గైపోతున్నాయి. ప్రేమ, అప్యాయతలు, చల్లని బతుకులిచ్చిన పల్లె ఆచూకి గల్లంతవు తుంది. ప్రతీకగా నికలిచేది పల్లెలు, పచ్చని పంట లు, ఎద్దుల బండ్లు, రాను రాను మాయమైపోయినాయి. ఇప్పుడు పల్లె అచ్చం దారిద్య్రం లో కొట్టుమిట్టాడుతున్నాయి. పచ్చని పల్లె బతుకుల మాట ఒకప్పు కానీ, ఇప్పుడు చిధ్రమయినా పల్లె బతుకులు జేడు పొట్టను నింపు కొవడానికి, పల్లె విడిచి దూరప్రాంతలకు వలసేల్లి పోతున్నారు. పల్లెలు, ల్లెలుగా ఎడారులుగా మారుతున్నా యి. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడు పట్టణాలు అభివృద్ధి చెందుతా యి. పట్టణాలు అభివృద్ధి చెంది నట్లయితే దేశం అభివృద్ధి చెందుతుం ది. పల్లెలు దేశానికి పట్టుకొమ్మాలాంటివి, అలానాటి స్వాతంత్య్ర సమారయోదుడు కూడా గ్రామీణ ప్రాంతాలలో పుట్టి దేశ వ్యాప్తంగా ఎదిగారు. మాహత్మా గాందీ,ó భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రామచంద్రారెడ్డి, కమలాదేవి, ఎందరెందరో మహానుభావులు గ్రామీ ణ ప్రాంతాం వారే, వీరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించి గ్రామీణ ప్రాంతాలే దొడ్డి కొమరయ్య. చాకలి ఐలమ్మలతో పాటు నాలుగు వేల ఐదోందల మంది వీరమరణం పొందారు. గ్రా సీమల ను పాల వర్గాలు నిర్లక్ష్యం చేయడం వల్లే గ్రామీణ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. ఆకలి చావులు, ఆకలి కేకలు వినికపిస్తున్నాయి. మహత్మగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఆచూకీ లేకుండా పోయింది. అనాడు గాంధీఅయితే ఈనాడు గాడ్పలు జీవనదులెన్నిన దేశానా జీవగంజి కరువయ్యే దేశా నికి వెన్నముఖయినా రైతు నేడు పరిస్థితి హీనంగా మారింది. పల్లె బతుకులు దుర్భరంగా మరినది స్వాతంత్వ్ర మేడిపండు. పేదరికం అనుభవిస్తున్నారుఎ. గ్రామీణ భారతంలో 75 శాతం జనాభాకు 25 శాతం వైద్యుల సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయి, గ్రామ ల్లో తేలు, పాము, కుక్క దోమ, ఎ కాటుతోనైనా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే దుస్థితి రాజ్యమేలుతుంది, కిలో మీటర్లు దూరం పొవవునా నడిస్తే తప్ప ప్రభుత్వ సేవలు అందవు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబళఙంచిన ప్రతి సంవత్సరం నరబలులు ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు పడకేయడంతో ప్రవైటు దవాఖా నాలను ఆశ్రయించవలసి వస్తుంది. ప్రజల బతుకు లు మరింత దిగజారిపొతున్నాయి. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖ దిగువకు బతుకుతేఆ్నరని ప్రభుత్వ లెక్కలే చేబుతున్నా యి. ఆదివాసీ, గిరిజన ప్రాంతలలో సుమారు 80 లక్షల మంది అడ విని నమ్ముకుని బతుకుతున్నారు. ఇంతవరకు రోడ్లు, తాగునీరు, గృహాలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన, ప్రభుత్వ సంక్షే మ పథకాలు అందడం లేదు పచ్చని పంట పొలాలన్నీ బీడులుగా మారిపోయి రియల్‌ ఎస్టేట్‌గా మారిపోయి, చెతి వృత్తులు చెతులిరిగి నవి, కుల వృత్తులు కులిపోయినవి, తాగునీరు లేక అల్లాడుతున్న గ్రామలెన్నో ప్లోరోసిస్‌ వ్యాధిలతో వంకర్లు, టింకర్లు మరుతున్నాయి. అంగవె ౖకల్యం కొల్లోయి, భూమిని వదలడంలేదు.పల్లెలు సావుకు దగ్గర యినవి. హైదరాబాద్‌ నగరంలో ఏ గోడ కూలి ప్రమాదవశత్తు మర ణించేది పాలమూరు కూలీలు రాష్ట్రంలో పాలమూరు. అదిలాబా ద్‌, విశాఖపట్నం, కర్నూలు, మెదక్‌ జిల్లాలో పల్లేలకు పల్లెలు వలసెల్లి పోతున్నాయి. హైదరాబాద్‌ వంటి మహానగరాలకు వలసచ్చి న వారందరూ  పనులు దొరకక రైతులందరూ అడ్డాకూలీలుగా మారు తున్నారు. రాజకీయ పార్టీలు గ్రామాలను విడదీశాయి. మతా ల మధ్య మారణహోమాలు, కులాల మధ్య కమ్ములాటలు ఆర్ధిక వ్యత్యాసాలు అంటారానితనం రాజ్యమేలుతుంది. గత ఇరవై సంవత్స రాలుగా మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ అవలంభిస్తున్న భూ స్వామ్య వ్యవసాయాన్ని పెట్టుబడిదారీ వ్యవసాయంగా మార్యడంతో గ్రామాలకు గ్రామాలు వ్యవసాయాన్ని పెట్టుబడిదారీ వ్యవసాయంగా మార్చడంతో గ్రామాలకు గ్రామాలు ధ్వంసమైపోతున్నాయి. పంచా యతీ పోరులో ధనస్వామ్యం రాజ్యమేలుతుంది. మళ్ళీ గ్రామ పంచా యతీ ఎన్నికల్లో దొర భూస్వాములు, దోపిడిదారులు తమ తమ గ్రామాలలో తమకు అనుకూలమయిన కీలుబొమ్మలను నిలబెట్టి ఏదో ఒక విధంగా దొడ్డి దారినట్లుగా గెలిపించుకుని అధికారాన్ని కొంటున్నారు. మళ్ళీ దొర భూస్వాములు ప్రజలపై అజామాయిషీ చెలాయిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలు ప్రభుత్వ దవాఖానాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు పూర్తిగా శిథిల స్థితిలో ఉన్నాయి. విద్యారంగం పూర్తిగా వ్యాపార రంగంగా మారింది. చేనేత కార్మికులు కులవృత్తుల వారు కార్మికులు రైతులు చేతి వృత్తుల వారు, కుటుం బాలకు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయి పల్లే మూలం పల్లేల్లో మన పునాదులున్నాయి. పల్లేలను నిర్లక్ష్యం చేయడం వల్ల రానున్న రోజుల్లో గ్రామీణ భారతం కుంటుపడనుంది. మన పల్లే సీమలను కాపడుకోకపోతే దేశానికి మనుగడ తప్పదు. కుప్పకూలి పోతున్న గ్రామాలను కాపడకుండా గ్రామాలను మోడల్‌ గ్రామాలుగా మారుస్తాయని మన పాలకులు ఊదరగొడుతున్నారు. 66 సంవత్స రాల స్వాతంత్య్ర భారతావనిలో ఎన్నికలు జరిగాయి. ఎంపిలు, ఎమ్మె ల్యేలు ముఖ్యమంత్రులయ్యారు. ప్రజల గోడు వినేదెవరు. కేవలం అధికార మార్పిడి మాత్రమే జరిగింది. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు. పల్లేలు చీకటిమయంగా మారాయి. గ్రామాలను    కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ఎవ్వరి గ్రామాన్ని వారే రక్షించుకోవాలి రాజకీయ కక్ష్యలు పాత కక్షలు మాని మన గ్రామాన్ని దేశ వ్యాప్తంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం! డబ్బు కు మన ఓటును అమ్ముకోవద్దు. మన ఓటు విలువ ఏందో నిరూ పించాలి. ఒక్కసారి ఓటును అమ్ముకున్నావంటే ఐదు సంవత్సరాల పాటు కట్టు బానిసలాగా ఉండాల్సిందే. పట్టణాలు, నగరాలు మొత్తం కలుషితంగా మారాయి. మళ్లీ గ్రామీణ వ్యవస్థకు రూపు రేఖలు తీసు కువద్దాం, పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దుదాం. పల్లేను దేవానికి పట్టుకొ మ్మ అని నిరూపించుదాం. విష సంస్కృతి విడనాడి ప్రేమ గ్రామాన్ని సృష్టించుకుందాం. అందరికి జన్మినిచ్చిన పల్లేసీమల ప్రేమను పొం దుదాం. ఎన్నికలు గ్రామలను మరింత దయనీయంగా మార్చాయి. ఎన్నికలు కాదు రాజకీయాలు కాదు గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించుకుందాం. మన పల్లే సంస్కృతి ఆచారాలు సంప్రదాయాలు అన్నింటిని కాపాడుకుందాం. పచ్చని పల్లేలన కాపాడుకునేందుకు భారతావని ముద్దు బిడ్డలమంటూ చీమల దండులాగా కదులుదాం మనమంతా!

-దామరపెల్లి నర్సింహారెడ్డి