కార్పొరేషన్‌లలో గ్రామపంచాయతీల విలీనాన్ని విరమించుకోవాలి

కార్పొరేషన్లలలో రాష్ట్ర వ్యాప్తంగా వాటి సరిహద్దు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ఎవ్వరికీ ప్రయోజనాలు చేకుర్చు తాయి అభివృద్ది జపం ముసుగులో విద&ంస&ం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు విలీనాన్ని మాత్రం ప్రజలు, ప్రజాస్వామిక వాధులు అధికార కాంగ్రెస్‌ పార్టీ మినహా అన్ని పార్టీలు విలీన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 2006లొ 8 మున్సిపాలి టీలు 12 మేజర్‌ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ గా ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం మున్సిపాలిటీలు నగర గ్రామపంచాయతీల గ్రేటర్‌ కార్పోరేషన్‌లో కలపటం వల్ల అభివృద్ది జరుగుతుందని పాలక వర్గాలు సంకలు కొడుతున్నారు. అభివృద్ది సంగతి దేవుడెరుగుకాని మరిన్ని సమస్యలు అంచెలంచెలుగా పేరుకపోవడం అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో 38 గ్రామపంచాయతీలు గ్రేటర్‌ విశాఖలో 10 పంచాయతీలు ఒంగోలు కార్పొరేషన్‌లో 4 గ్రామ పంచాయతీలు కర్నూలు కార్పొరేషన్‌లో 3 గ్రామ పంచాయతీలు రాజంపేట నగర పంచాయతీలో 5 గ్రామాలు విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం విలీనం చేపట్టేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపధ్యంలో వివాదం లేని 23 గ్రామ పంచాయతీలను తక్షణమే విలీనం చేయడానికి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. అయితే గ్రామ పంచాయతీల విలీనాన్ని గ్రేటర్‌ హైదరాబాద& మున్సిపాల్స్‌ కార్పొరేషన్‌ సర్పసభ్య సమావేశం వ్యతిరేకించింది. వ్యతిరేఖ తీర్మాణం ప్రనభుత్వానికర ఇంతవరకు అందలేదు. పదిహేను రోజుల్లోగా తీర్మాణం రాకపోయి నట్లయితే విలీనం దిశగా ప్రభుత్వం మరింత అడుగులను ముందుకే   స్తుంది. పంచాయితీ ఎన్నికలు రాకముదే గ్రామ పంచాయతీల విలీనానికి కసరత్తును ప్రారంభించింది. గ్రేటర్‌ కార్పొరేషన్‌లో గ్రామ పంచాయతీల విలీనం ప్రజా వ్యతిరేఖమంటూ కాంగ్రెప్‌ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నాయి. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్‌లో కలపడాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలనిచ్చింది. కార్పొరేషన్‌లలో విలీనం చేయనున్న పంచాయతీలు శంషాబాద్‌, శాతంరాయి, కొత్వాలగూడ, నార్సింగి, గండిపేట, వట్టి నాగులపల్లి, నెక్నాపూర్‌, పుప్పాలగూడ, ఖానాపూర్‌, మణికొండ, జాగీర్‌, మంచిరేవుల, కోకపేట, బండ్లగూడ, కిస్మత్‌పూర్‌, హిమయత్‌సాగర్‌, పీరం చెరువు, హైదర్షాకోట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట, కొంపల్లి, దూలపల్లి, కల్వంచ, జిల్లెల గూడ, కొత్తపేట, మీర్‌పేట, పహాడి షరిఫ్‌, బలాపూర్‌, జల్‌పల్లి, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వత్‌పూర్‌, చెంగిచెర్ల, జవహార్‌నగర్‌, నాగారం, దమ్మాయిగూడ, గుండ్ల పోచంపల్లి, గ్రేటర్‌ విశాఖ, కార్పొరేషన్‌, రాజుపాలెం, వల్లూరు, కొపాపక, కెనగరపాలెం, కొపులుప్పాడ, చేపలప్పాడ, నిడిగట్టు, జెవీ ఆగ్రహారం, తాడి సాలపువానిపాలెం, ఒంగోలు కార్పొరేషన్‌, సర్వారెడ్డిపాలెం, మందువారిపాలెం, మల్లేశ్వరిపూరం, మంగమూరు, ఎస్‌ఎస్‌ పాడు, కర్నూలు కార్పొరేషన్‌, మామిడాలపాడు, మునగాలపాడు, స్పంటన్‌పురం, కాకినాడ కార్పొరేషన్‌, వాకలపూడి, తదితర గ్రేటర్‌ కార్పొరేషన్‌లలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌లలో అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ జనాభాకు సరిపడా సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా పారశుద్ధ్యం పడకేసింది. చినుకుపడితే చాలు రోడ్లన్ని చిత్వడే. 1200 మురికివాడల ప్రజలకు ప్రభుత్వ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గ్రేటర్‌ కార్పొరేషన్‌లో 22 వేల పారిశుద్ధ్య కార్మికులు విధులను సక్రమంగా ఉంచుతారు. నాలుగు నెలల నుంచి జీతాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. అధికారుల సమన్వయం లోపించింది. రోడ్లు అభివృద్దికి నోచుకోలేదు. వర్షపునీరు నిలవడంతో కాలనీలన్నియు మురికి కూపంగా మారాయి. గ్రామ పంచాయతీల నుంని మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్‌ వరకు రూపాంతరం చెందిన కేవలం పేర్లు మాత్రమే మారుతువచ్చాయి తప్ప అభివృద్ది మాత్రం ఆమడ దూరంలో వుంది. నిధులు కోట్లాది రూపాయలు కేటాయించినప్పటికీ అట్టి నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. పేరుకే భాగ్యనగరం, బాగ్యనగరమంత లోటెక్కు నగరం. ఇప్పటివరకు కొన్ని మున్సిపాలి టీలు కార్పొరేషన్‌లను కొత్తగా నియమించినప్పటికీ అభివ ృద్దికి నోచుకోవడం లేదు. హైదరాబాద్‌ చుట్టున్న గ్రామపంచాయ తీలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేసినప్నపటికీ ప్రజలపై పన్నుల మొతలు తప్పని వాతలు అన్నిట్లుగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సమీపంలో ఉన్న 38 గ్రామపంచాయతీలను విలీనం చేయడం అంటే ప్రజలపై పన్నుల మొతలు విధించడం గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో కలిపినట్లయితే కార్పొరేఫన్‌కు మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పాలకులు ప్రజల మనోభావాలను గౌరవించకుండా. ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. గ్రామ పంచాయతీలు అభివృద్ది ముసుగులో విధ్వంసానికి గురైయ్యాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు బడా పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు, బిల్డర్లు మాత్రం బలిసిపోతున్నారు. పేదోని బతుకలు చితికిపోతు న్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 65 శాతం మంది అద్దెకొంపల్లో మురికి వాడల్లో తలదాచుకోవడానికి నిలువ నీడలేక రోడ్లపై దుర్భరమైన బతుకులు కాలనీ వెల్లదీస్తున్న అభాగ్య జీవులెందరో. జవహార్‌నగర్‌ చెత్త డంపింగ్‌ మూలంగా గత 13 సంవత్సరాలుగా 56 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్‌ బారినపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. జవహార్‌ నగర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ అయినప్పటికీ రెండు లక్షల మంది ప్రజలకు రోడ్లు నీరు వీధిదీపాలు కనీస సదుపాయాలు అందక సతమతమవు తున్నారు. గ్రేటర్‌ కార్పొరేషన్‌ల చుట్టున్న గ్రామ పంచాయతీలు అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నాయి. ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదు. దాయ వనరులుగా గ్రామ పంచాయతీలను చూస్తుంది. ప్రజలపై పాలకుల సవతితల్లి ప్రేమ గ్రామ పంచాయతీ లకు ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో రోడ్లు డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు, అందడం లేదు. ప్రభుత్వ సేవలు పడకేసాయి. ప్రజలకు ఆరాయం రాబడి లేకున్నప్పటికీ ప్రభుత్వాలకు మాత్రం శివారు గ్రామపంచాయతీలను ఆదాయ వనరులుగా చూస్తూ కార్పొరేషన్‌లలో విలీనం చేయడానికి దాగిఉన్న ప్రభుత్వ కుట్ర దీనిని ప్రజలంత గమనించాలి. రాష్ట్రంలోనున్న గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లలో విలీనం చేసినంత మాత్రాన అభివృద్ది నమూనా కాదు విద్వంసం ప్రజలపై పన్నుల భారాలు విధించడమే విలీనాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిద్ధాం.

-దామరపల్లి నర్సింహారెడ్డి