మహిళలు నాడు – నేడు
”సహజంగా శీలవంతులు మరియు ధర్మపరులు” గా కీర్తించబడిన భారతీయ స్త్రీలు అనాదిగా అనేక అవరోధాలు ఎదుర్కుంటూనే ఉన్నారు. సమాజంలో వారెప్పుడు ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్నింప బడుతూ అణగదొక్కబడుతున్నారు. ప్రాచీన కాలంలో పురుషులతో సమానస్థాయి కలిగియుండేవారని, యుక్తవయసులో పెళ్ళి చేసుకొనేవారని, స్వయంగా వరున్ని ఎన్నుకునే స్వేఛ్చ ఉండేదని మరికఅయు మహిళలు చదువుకునే వారని, పతంరజలి, వాత్సాయన లాంటి వారి రచనల ద్వారా తెలుస్తుంది. బాబరు వంటి ఇస్లాం రాజుల అక్రమాలతో మొఘలు సామ్రాజ్య విస్తరణ క్రైస్తవ మతవ్యాప్తి మహిళల స్వేఛ్చను హరించి వేసాయి. మధ్యయుగంలో సతీసహగమనము బాల్య వివాహములు విధవా వివాహ నిషేధము, జౌహర్ ఆచారము, పరదాపద్దతి, దేవదాసీ విధానము, స్త్రీని ఇంకా అడుగంటూ నొక్కేసాయి. పూర్తిగా పురుషునిపై ఆధారపడేట్లు చేశాయి. అయినా నూర్జహాన్, రజియా సుల్తానా, శివాజీ తల్లి జిజి యాబాయి లాంటి యోధురాళ్ళు, సమర్ధపాలకులుగా రాణించారు. భక్తి ఉద్యమము ఊపందుకున్న సమయంలో మత సంబంధ విషయాలలో స్త్రీకి స్వేఛ్చ ఉండాలని గురునానక్ లాంటి మత గురువుల బోధనలు స్త్రీకి స్వేఛ్చ ఉండాలని గురునానక్ లాంటి మతగురువుల బోధనలు స్త్రీకి స్వేచ్చ నందించాయి ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజారామమోహన్‌రాయ్, పండిత రమాబాయి లాంటి సంఘ సంస్కర్తలు మహిళా అభ్యున్నతికి కృషి చేశారు. స్వతంత్య్ర పోరాటంలో డాక్టర్ అనిబిసెంట్, పండిట్ విజయలక్ష్మి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, సుచేతా కృపలాని, కస్తూరిబాయి, లక్ష్మీ సెహగల్ (ఐఎన్‌ఏ కాప్టెన్), రాజకుమారి, అమ్రిత కౌర్ మొదలగువారు పాల్గొనడం స్త్రీలకు గొప్ప ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. 1970 దశకంలో స్త్రీవాద ఉద్యమం రెక్కలు విప్పుకుంది. 70వ దశకంలో మహారాష్ట్ర చంద్రాపూర్‌లోని ”దేశాయ్‌గంజ్” పోలీస్‌స్టేషన్‌లో ‘మధుర’ అనే ఆదివాసీ బాలికపై లైంగిక అత్యాచారం జరిగింది. లైంగిక నేరానికి పాల్పడిన పోలీసులను విడుదల చేయడంలో 1979-80 లో విస్తృత నిరసనలు ఎదుర్కొవడం, జాతీయ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగడంతో ఐపిసి 376తో పలు నూతన సెక్షన్లు చేర్చడం, 10 సంవత్సరాలపై వరకు శిక్షలు వేసే అవకాశం కల్పించడం జరిగింది. అసాధారణమైన ఒక్కోసారి మరణశిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. ఆల్కహాలిజం, మహిళల హంగుతో ముడడివపడియున్నందున ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్, హర్యానా మొదలగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో అనేక మహిళా సంఘాలు, ఆల్కహాలిజానికి వ్యతిరేకంగా పోరాడాయి. ముస్లీం మహిళలు కూడా షరియత్ చట్టం క్రింద ముమ్మార్లు తలాక్ చేప్పే రీతిని విమర్శించారు. 1990 ప్రాంతంలో స్వదేశీ, విదేశీ నిధుల సహాయంతో మహిళా సంబంధిత సంఘాలు ఎన్జీవో స్వయంశక్తి సంఘాలు స్వచ్చంధ మహిళా ఉద్యమ సంస్థలు ఏర్పడ్డాయి. అనేక మంది మహిళలు నాయకురాలుగా అవతరించారు. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై చురుకుగా స్పందించడం ప్రారంభమైం ది. భారతదేశం 2001 సంవత్సరాన్ని జాతీయ మహిళా అధికార స్వశక్తి సంవత్సరంగా ప్రకటించింది. 2010 మార్చి 9న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఆధునిక స్త్రీ పురుషులతో సమానంగా ఒక అడుగు ముందుకే వేసింది. చదువులో, ఉద్యోగాల లో, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార, వాణిజ్యది రంగాలలో ప్రవేశించి సఫలీకృతమైంది. ప్రగతి పథంలో దూసుకు పోతుంది. పాలకురాలుగా, వ్యోమగామిగా, శాస్త్రవేత్తలుగా, పైలేట్ లుగా, క్రీడాకారిణులుగా, పోలీసు అధికారులుగా ఒక్కటేమిటివ అన్నింటిలో కాలుమోపింది. అయినా నేడు లైంగిక వేధింపులకు, ఈవ్‌టీజింగ్‌లకు, గృహహింస, వరకట్నం, బాల్యవివాహాం, భ్రూణ హత్యలు, వ్యాపారం, మొదలగు సమస్యలను ఎదుర్కొటూనే ఉంది. అవిశ్రాంత పోరాటం జరుపుతూనే ఉంది మగవారు సనాతన విలువలను తోసివేసి, నైతిక విలువలను గాలికొదిలేసి, ఈ రెండింటి భారాన్ని స్త్రీలపై రుద్దుతున్నారు. స్త్రీని గుర్తించగలిగే స్ధాయిని ఇంకా మగవాడు పొందలేక పోతున్నాడు. స్త్రీని వ్యాపార వాణిజ్య సంబంధ విషయాలలో ప్రచార వస్తువుగా సినిమా ఇతర మీడియాలలో చౌకబారుతనంగా చూపెడుతూ స్త్రీల పట్ల ఉన్న విలువలను కారాస్తున్నారు. స్త్రీ వ్యక్తిత్వం మీద దెబ్బకొడుతున్నారు. మహిళల అభివృద్దికి గండికొడుతున్నారు. స్త్రీని తనతో సమానంగా చూడగల విశాల మనస్తత్వం, స్త్రీల సమస్యలు, వారిభావాల పట్ల సానుకూల దృక్పధం, ఏదైనా అత్యాచారం, అసాంఘీక కృత్యానికి స్త్రీ లోనైనపుడు వెంటనే స్పందించే వ్యవస్ధ, లైంగిక నేరాలకు పాల్పడేవారికి, కఠిన శిక్షలుంటాయన్న భయం, స్త్రీకి స్త్రీయే మిత్రురాలు అన్న ఆలోచన వచ్చిననాడు మహిళలు అభివృద్ది పథంలో పయనిస్తారని చెప్పడానికి ఏ సంశయం లేదు. మగవాడు తనకు పగవాడుకాదని, తన ప్రగతికి బాటలువేసే స్నేహితుడని భావించిననాడు ప్రతి పురుషుని ఎదుగుదల వెనక ఒక స్త్రీ ఉంటుందన్నట్లు ప్రతి స్త్రీని పురుషుడు వెనక ఉండి ప్రోత్సహిం చిననాడు ఈ ఘోరాలు, నేరాలు, అకృత్యాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిత్య జీవితంలో కుటుంబంలో సమాజంలో స్త్రీని గౌరివించే సంస్కారం పెంపొందించబడాలి. ”యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అన్న ఆర్యోక్తిని నిజం చేయాలి దాంత పాటు స్త్రీకూడా నిర్భయంగా సంచరించగలగాలి. భయంతో భీతితో ఎంత కాలం జీవించగలం? భయం ఎదుటి వాడికి వరంగా మనకు శాపంగా మారుతుంది అందుకే స్త్రీ ధైర్యంగా ముందుకు నడుస్తూ స్త్రీ అబల కాదు సబల అని నిరూపించుకోగలగాలి ఏపరిస్థితినైనా శారీరకంగా మానసికంగా ఎదుర్కొనేలా స్త్రీలను చిన్నప్పటినుండి పెంచాలి. లింగవివక్ష చూపకుండా సమానస్థాయి హోదాని అందించాలి. ”కలకంఠి కంటు కన్నీరాలకిన ఇంట సిరి ఉండలేదు” అన్న నిజాన్ని సమాజము గ్రహించాలి. రక్షణ పేరుతో పురుషులచే ఇంట బంధింపబడిన స్త్రీలు ఎప్పుడు సురక్షితులు కారు. ఎవరైనా తమను తాము కాపాడుకోగలరో వారు మాత్రమే నిజంగా సురక్షితులు. అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి స్త్రీ తనుకు తానుగా పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి. స్వయం సిద్దంగా ఎదగాలి నిర్భయ లా ముందుకు సాగాలి.
-వైరాగ్యం ప్రభాకర్