రాజీనామా చేసి సభకెందుకొచ్చారు?
సీమాంధ్ర ఎంపీలకు స్పీకర్ చెంపపెట్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) :
రాజీనామా చేసిన వారు సభకెందుకొచ్చారంటూ స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై మండిపడ్డారు. సమైక్య రాష్ట్రం కావాలని కోరుతూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పదవులుకు రాజీనామా చేసిన వారు వాటికి కట్టుబడకుండా సభకు ఎందుకు వచ్చారని తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య నినాదాలు చేశారు. ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి పోడియం వైపు దూసుకొచ్చి నినాదాలు చేశారు. వారికి శాంతియుతంగా నచ్చజెప్పాలని సూచించినా వినలేదు. వెనక్కి వెళ్లి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కోరినా వినకుండా నినాదాలు చేస్తుండటంతో మీరాకుమార్ వారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏడుగురు ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. వారంతా సోమవారం లోక్‌సభకు హాజరయ్యారు.
ు.ఆయన పేర్కొన్నారు.