ప్రైవేటీకరణకే ఈ స్వాతంత్య్రం
(మంగళవారం తరువాయి భాగం)
రాష్ట్ర ప్రజల బాగోగులను, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ప్రయోజనాలను విస్మరించినందుకు ఆయనను గద్దె దించి కాంగ్రెస్‌ను 2004లో గెలిపించారు. 1400 కిలోమీటర్ల పాద యాత్రను పెట్టుబడిగా పెట్టిన కాంగ్రెస్ నాయకుడిని గెలిపించారు. గ్రామీణ ప్రాంతాన్ని ఎనిమిదేళ్లుగా ఎండపెట్టడం ద్వారా కాంగ్రెస్ గెలుపుకు పరోక్షంగా చంద్రబాబు తోడ్పడ్డారు. ఎన్టీరామారావు రెండు రూపాయల కిలో బియ్యం నిర్ణయాన్ని ప్రకటించి ఎలా సంచలనం సృష్టించారో, వైఎస్ కూడా ఉచిన విద్యుత్, బాకీల మాఫీ ప్రకటించి ఆ ప్రకటన వెనువెంటనే జలయజ్ఞం పథకాన్ని ఆవిష్కరించి రైతుల అభిమానాన్ని చూరగొన్నారు. అయిదేళ్లు పూర్తిచేసి ఆరవ సంవత్సరంలో విమాన ప్రమందంలో మరనిం చారు. ఆ సందర్భంలో ఆ వార్త విన్న వెన్వెంటనే రాష్ట్ర ప్రజల స్పందన ఆపూర్వం. ఆయన పరిపాలన ప్రారంభ దినాల్లోనే రాష్ట్రంలో పర్యటించినపుడల్లా ఏదో ఒక ప్రజానుకూల ప్రకటన చేసుకుంటూ వచ్చారు. ఆయన ప్రకటించిన పథకాలకయ్యే ఖర్చు లెక్కలు వేసిన ఆర్థిక మంత్రి రోశయ్య ఇంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలి అని బహిరంగంగానే తన భయాందోళనను వ్యక్తం చేశారు. రైతులకు కనీసం ధర వెయ్యి రూపాయలు ఇవ్వాలని రెండేళ్ళుగా డిమాండ్ చేస్తున్నా దానిని సాధించలేక పోయినా, రెండో పక్క జలయజ్ఞం పేరుతో నీటి సరఫరా పథకాన్ని చూపించి సమస్యను పరిష్కరించేస్తున్నా అంటూ జోక్కొట్టారు. అనేక ప్రజాకర్షషక పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలితాలు ప్రజలకు అందకుండా దారిలోనే భోంచేస్తున్న అధి కారులు, పార్టీ కార్యకర్తలపై ఎటువంటి చర్యా తీసుకోకుండా అదే సమయంలో జనాకర్షక పథకాల ప్రచార హోరు సృష్టించి పబ్బం గడుపుకొంటూ వచ్చారు. ఇలాంటి ఉదాహరణ లెన్నయినా ఇవ్వవచ్చు. చేసినా, చేయకపోయినా ప్రజల హృదయాల్లో చోటు చేసుకొన్నారని ఆయన మరణించిన రోజునే ఎవరి పిలుపూ లేకుండానే రాష్ట్రమంతా ప్రజలు సానుభూతిని ప్రదర్శించారు. నా అరవై సంవత్సరాల జర్నలిస్టు జీవితంలో ఏ ముఖ్యమంత్రికీ ఇలా నీరాజనాలు పట్టిన దాఖలాలు లేవు. ఇది బొమ్మా, బొరుసు చిత్రం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఆయనకు ఎదురుగా నిలిచిన మొనగాడు లేడు. ఎందరు ముఖ్యమంత్రులు మారినా (తెలుగుదేశం హాయం తప్ప) ఆర్థిక శాఖ రోషయ్య చేయి జారిపోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి పాప్యులిస్ట్ పథకాలు ప్రకటించే ముఖ్యమంత్రిగా, వాటిని అమలు పరచడం, ఆ పథకాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రజలకు సంబంధించి నంత వరకూ ఆయన పాలన పూల పాన్పు ఏమీ కాదని నేడు రాష్ట్రాన్ని విహాంగ వీక్షణం చూస్తే తెలుస్తుంది. అటు చంద్రబాబు, ఇటు వైఎస్ ఇద్దరూ సమాజంలో ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించారనేది నిష్టూరసత్యం. ఇద్దరూ బూర్జువా వర్గానికి, వారి ప్రయోజనాలను కాపాడుతూ వచ్చిన వారే. తరతమ బేధాలతో ఇద్దరూ ప్రపంచబ్యాంక్ వలలో తలదూర్చిన వారే. ఇద్దరి పరిపాలన, ఆమాటకోస్తే ఏ ప్రభుత్వం కాదు? తీవ్ర విమర్శలకు ప్రజా వ్యతిరేకతకు, నిరసన ప్రదర్శనలనెదుర్కొన్న వారే. వైఎస్ ఫ్యూడల్ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వారైనా బూర్జువా వర్గ పోకడలను, పద్దతులను బాగానే పుణికిపుచ్చుకొన్నారు. ఒకపక్క నాలుగైదు లక్షల ఎకరాల భూమి ( అదెంత లోపభూయిష్టమైనా) పంచి పెట్టారు, రెండో పక్క సెజ్‌ల కోసం, పరిశ్రమల కోసం వేల ఎకరాలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు చారెడు భూమి ఇవ్వలేకకపోయినా, పెంచిన కూలీ ఇమ్మని అడిగితే భూకామందులకు కోపం వచ్చినా గప్‌చుప్‌గా ఊరుకు న్నారు. రైతులకు రుణమాపీ పథకం అమలు చేశారు. కొంతమందికి నష్టం వస్తే దానికి భర్తీ చేశారు. రెండో పక్క వడ్డీ వ్యాపారస్తుల వద్ద పేదలు తీసుకొన్న రుణాల మాఫీ గురించి ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఆయనకు ముందు ముఖ్యమంతత్రి అభివృద్దిని నగరాలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పరిమితం చేయగా, వైఎస్ తన దృష్టిని గ్రామీణ ప్రాంతాలపై కేంద్రీకరించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం అందజేస్తూనే అదే సమయంలో కార్పొరేట్ వైద్యశాలలకు కోట్ల రూపాయలు సమర్పించుకొన్నారు. రాష్ట్రంలో, దేశంలో బ్రిటిష్ పాలకులు పరిపాలన పద్దతుల, వారు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానం వారి కట్టూ, బట్టా వారు ప్రవేశపనెట్టిన చట్టాలు వారి భాషా సంస్కృతులు ఇక్కడు వదిలి పెట్టి పోయారు. సంస్కరణలు ప్రవేశపెట్టిన తర&ఆవత పైన ఉదహరించినవన్నీ వెర్రితలలు వేస్తున్నాయి. జుగుప్ప కలిగిస్తు న్నాయి. మాతృభాష స్థానే ఇంగ్లిష్ దేశ భాషగా మారిపోయింది. ఎప్పుడో 1894 నాటి భూమికి సంబంధించిన చట్టం ఇంకా అమలులో ఉంది. బానిస బుద్దికి ఉన్న శక్తి అలాంటిది అందుకనే కాబోలు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల స్థానే అమెరికన్ సామ్రాజ్య వాదులను ఎర్రతీవాసి పరిచి ఆహ్వానిసు ్తన్నారు. అమెరికా తన కోసం వండివార్చిన ఆలోచనలే పరిపాలనా తీరును ప్రభావితం చేస్తు న్నాయి. ఈ ధోరణి చూస్తే మనలను వాజ్‌పేయ్, మన్మోహన్‌సింగ్ సర్వస్వతంతత్రులుగా పరిపాలిం చారా? లేక అమెరికా ఆదేశాలను అమలు పరిచే గుమస్తాలుగా మారిపోయి అస్వంత్రులుగా పాలిం చారా? అనే సందేహం రాక మానదు. అమెరికాలో 52 రాష్ట్రాలున్నాయి. దేశం 53వ రాష్ట్రమా అనే సందేహం కలుగుతుంది ఇదీ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ నేపథ్యం దేశం, రాష్ట్రాలు 67 సంవత్సరాలు వెనక్కి నడుస్తున్నాయి. మనకొచ్చిన స్వాతంత్య్రం మిథ్య, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిష్క్రమిస్తే ఆ స్థానంలో అమెరికా ప్రవేశించింది. అయితే, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్లాగా నేరుగా పాలించకుండా , ఆర్థికంగా, పరో క్షంగా పెత్తనం చలాయిస్తుంది. స్వతంత్రం పాలకులకువచ్చింది కాని ప్రజలకు కాదు. అలాగే కేంద్రం నిజం, రాష్ట్రలు మిథ్య ఎన్టీఆర్ అన్న మాట గుర్తుకొస్తుంది. స్వతంత్రం వచ్చేసిందని అంతా అనుకొంటున్న సందర్భంలో అది రాష్ట్రాలకు వచ్చిందా అని ప్రశ్నించుకొటే రాష్ట్రాలకు ఆ నామమాత్రమైన స్వాతంత్య్రం రాలేదని, అధికారాలు కేంద్రంలో కేంద్రీకృత మవుతున్నాయిన గత 66 సంవత్సరాల అనుభవం చెపుతోంది. మనది ఫెడరల్ వ్యవస్థ అని రాజ్యాంగంలో రాసుకొన్న విషయం కాగితం మీదే ఉండిపోయిందని అనుభవం చెపుతున్న దేమంటే కొన్ని అధికారాలను పేరుకుమాత్రం రాష్ట్రాలకిచ్చి, ఆచరణలో క్దేంరం పెత్తనం చేయడం మొదలు పెట్టింది. కస్టమ్స్ ఎక్సయిజ్ సుంకాలను రాష్ట్రాల్లో వసూలు చేసి తన బొక్కసంలో వేసుకొం టోంది ప్రతి అయిదేళ్లకు కేంద్రం నియమించే ఆర్థిక సంఘాల ఎజెండాను కేంద్రానికి అనుకూ లంగా విస్తరిస్తూ పోతుంది. పార్టీ లు తమ విధానాలను పక్కన పెట్టి, కేంద్రం వసూళ్లలో సగభాగం రాష్ట్రాలకు బదలాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చినా, ఒకటి లేదా రెండు శాతం మాతమ్రే పెంచుతూ వచ్చింది. తాజాగా ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులు ఈ రాష్ట్రం నుంచే వెళ్లినవారు. కాబట్టి రాష్ట్రాల ఇబ్బందులేమిటో ఈ రాష్ట్ర అధికారిగా పనిచేశారు. కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశించాలి. రాష్ట్రాలను బలహీనం చేసి ఉద్దేశంతో కేంద్ర ప్రతిపాదిత పథకాల పేరుతో కొన్ని పధకాలను సృష్టించి వీటి అమలుకు కావాల్సిన నిధుల్లో 75 శాతం రాష్ట్రాలకిస్తామని షరతు విధించి, తన పెత్తనాన్ని విస్తరించుకొంటూ వస్తోంది. ఇటీవల 12వ పంచవర్ష ప్రణాళిక ఎజెండాగా జాతీయ అభివృద్ది సంస్థ సమావేశం జరగినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి వాకౌట్ చేశారు. ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని జయలలిత మాట్టా డడానికి కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించినందుకు నిరసనగా ఆమె బయటకు వెళ్లిపోయారు. రానున్న అయిదేళ్ల భివిష్యత్తును నిర్ణయించే సమావేశం అది. అలాంటపుడు లోతైన చర్చ అవసరం రాష్ట్రాలకు అనేక సమస్య లుంటాయి. ఈశాన్య ప్రాంతం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వైవిధ్యం ఉండనే ఉంది. నేషనల్ డెవలప్‌మెంట్ అనే అధికార సంస్థ తరచుగా సమావేశాలు జరుపుతుంది. అలాంటి పరిస్థితుల్లో తూతూ మంత్రంగా లాంఛనంగా ఒక్కరోజు మాత్రమే కేటాయిం చడమే తప్పు ఇది పరోక్షంగా కేంద్రం తన నిర్ణయాలను రాష్ట్రాలపై రుద్దడమే అవుతుంది ప్రణాళికా సంఘం రాజ్యాంగేతర సంస్థ అలాంటి సంస్థ చేసిన నిర్ణయాలను రాష్ట్రాలపై రుద్దడం రాజ్యాంగ విరుద్దం. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మరింత జటిలం చేస్తుంది. సహజంగానే రాష్ట్రాలు ముఖ్యంగా రాష్ట్రాల్లో కాంగ్రెసేదతర ప్రభుత్వాలు ఆందోళన చేయగా 1983 జూన్‌లో సర్కారియా కమిషన్‌ను కేంద్ర, రాష్ట్ర సంబంధా లను సమీక్షించమని నియమించగా, ఆ కమిషన్ రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని, రాష్ట్రాలను సంప్రదించ కుండా (ఇప్పుడు కాంగ్రెస్ తలపొగరుతో మంత్రి మండలిలోని ఇతర పార్టీలను సంప్రదించడమే అరుదు) కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు ప్రయోగించే 356వ అధికరణ దుర్వినియోగం కాకుండా నివారించాలని సిఫారసు చేసింది. ఆర్థిక వనరుల కల్పనకు సంబంధించి కేంద్రం తన పట్టును సడలించి, రాష్ట్రాలకు మరింత స్వతంత్రం ఇవ్వాలని కమిషన్ సూచించింది. ఈ సూచనలు సిఫారుసులన్నీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయనడానికి ఇటీవల మరొక కమిషన్ నియమించాల్సి రావడమే నదర్శనం.
-వి హనుమంతరావు
(తరువాయి భాగం రేపటి సంచికలో)