మేం కన్నెర్రజేస్తే..మీరు మాడి మసవుతారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగ పరమైన ప్రక్రియ నిర్వహిస్తున్న వేల ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం వికృత రూపుదాల్చింది. సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై సమైక్యవాదుల పేరుతో కొందరు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. తెలుగుజాతి, తెలుగుతల్లి పేరుతో కళ్లబొళ్లి కబుర్లు వళ్లిస్తూనే తమ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి నియామకాల్లో చేరిన ఉద్యోగులపై దాడులకు పాల్పడుతూ తమ వికృత రూపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు. తెలుగువారంతా కలిసి ఉండటం ఇష్టం లేక కాంగ్రెస్‌ పార్టీయే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని దొంగ ఏడుపులు ఏడ్చే సీమాంధ్రులు తమ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా తెలుగు వారేనని విస్మరించారా? లేక వారికిమల్లే ఉద్యోగాలను కొళ్లగొట్టిన దొంగలనుకున్నారా? కలిసుందామంటూనే కాలకూట విషాన్ని కక్కుతున్న వారిని ఏమనాలి. సోదారులైతే అనలేం. వాళ్లు మనకు దాయాదులు కూడా కాబోరు. ఎందుకంటే దాయాదులు ఒకే తల్లిపిల్లలు. పెరిగి పెద్దయిన తర్వాత ఎవరికి వారుగా బతికే వాళ్లు. ఒకసారి కాకపోయినా ఒకసారి, ఏదో ఒక సందర్భంలో కలుసుకొని కష్టం, సుఖం పంచుకునేవాళ్లు. కానీ తెలంగాణకు ఆంధ్రోళ్లు (అందరూ కాదు) ఎలా సోదరులవుతారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇంజినీర్‌పై గుంటూర్‌లో దాడికి తెగబడ్డారు. కాకినాడలో మహిళా వైద్యాధికారిపై పెండ కొట్టారు. గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హనుమంతునాయక్‌ను కులం పేరుతో దూషించారు. ఆంధ్రలో ఉద్యోగం చేయొద్దంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. వైజాగ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న నవీన్‌పై దాడికి దిగి చితకబాదారు. అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డును ఎత్తుకెల్లి తాము ముమ్మాటికీ దొంగలమే అని నిరూపించుకున్నారు. కాకినాడలో నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి తోట నర్సింహం భార్యకు వైద్య సహాయం అందించేందుకు వచ్చిన డీఎంహెచ్‌వో పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి దిగి పెండతో ఆమెను కొట్టారు. ఈ ముగ్గురూ సీమాంధ్రుల్లా తెలంగాణ ఉద్యోగాలను కొళ్లగొట్టినవారు కాదు. ఇంకొకరి నోటికాడ ముద్దను లాక్కున్నవారు అసలే కాదు. ఇద్దరు జిల్లా స్థాయి అధికారులైతే ఒకరు ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్‌. ఉన్నత విద్యావంతులు. మెరిట్‌లో ఉద్యోగం పొందినవారు. వారిపై దాడికి తెగపడి సీమాంధ్ర గుండాలు తాము చరిత్ర హీనులమని నిరూపించుకున్నారు. అదే సమయంలో వారు కొన్ని విషయాలు విస్మరించినట్టున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సంఖ్య వందల్లో కూడా ఉండదు. కానీ తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్రులు కొళ్లగొట్టిన సర్కారు ఉద్యోగాలే లక్షకు పైచిలుకు. ఇక ప్రైవేటు కంపెనీల్లోనైతే కుప్పలు.. తెప్పలుగా కనిపిస్తారు. అంతేకాదు తెలంగాణలోని పది జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి అగ్గువకు భూములు కొనుక్కొని కొత్త ఊర్లను (గుంటూర్‌పల్లెలను) ఏర్పాటు చేసుకున్న వారు లెక్కకు మిక్కిలి. ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో గుంటూరుపల్లెలున్నాయి. కొన్ని చోట్ల వంద వరకూ గుంటూరుపల్లెలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సీమాంధ్ర ప్రాంత రైతులకు చెందిన వ్యవసాయ క్షేత్రాలున్నాయి. అలాగే సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ వనరులు, భూములు దోచుకొని ఏర్పాటు చేసిన కర్మాగారాలూ ఉన్నాయి. సీమాంధ్రుల మాదిరే తెలంగాణ ప్రజలు ఒక్క క్షణం విచక్షణ కోల్పోతే ఒక్కటంటే ఒక్క గుంటూరుపల్లె మళ్లీ కనిపించదు. ఒక్క వ్యవసాయ క్షేత్రంలో సీమాంధ్ర ప్రాంత రైతు కనిపించడు. దొంగతనంగా కూడబెట్టుకొని నిర్మించిన విల్లాలు, ఫ్యాక్టరీలు, బంగ్లాలు.. ఏవీ ముక్క కూడా మిగలకుండా తుక్కుత్కువుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణోళ్లు కన్నెర్రజేస్తే ఈ ప్రాంతంలోని సీమాంధ్రులు మాడి మసైపోతారు. అవశేషాలుగా ఎములు కూడా మిగిలే పరిస్థితే ఉండదు.. గుప్పెడు బూడిద తప్ప. కానీ తెలంగాణ ప్రజలు ద్రోహులు, దొంగలను కూడా అక్కున చేర్చుకున్న గొప్ప సంస్కారవంతులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూన్నా ఒక్క రోజు కూడా ఇక్కడ స్థిరపడ్డవారిపై, ఇక్కడి వనరులను దోపిడీ చేసిన వారిపై, ఉద్యోగాల్లో దొంగతనంగా చేరిన వారిపై, ఆస్తులను కొళ్లగొట్టిన వారిపై ఒక్కరోజు కూడా చెయ్యెత్తని సంస్కారవంతులు. తమ ప్రాంత నేతల దగుల్బాజీ, దివాళకోరు విధానాలతోనే సీమాంధ్రులు దోపిడీని కొనసాగిస్తున్నారనుకొని, తెలంగాణ రాకుండా వారు అడ్డుకుంటుంటే వారితోనే కలిసి ఇక్కడి నేతలు కలిసి అక్రమంగా సంసారం చేయడాన్ని చూసి తట్టుకోలేక తమకు తాము ప్రాణత్యాగం చేసిన త్యాగధనులు. తెలంగాణ కణకణ మండే నిప్పుకణిక. ఉద్యమం ఇక్కడి ప్రజల జీవనంలో భాగం. అణచివేత, పీడనపై పిడికిలి ఎక్కుపెట్టే శూరులు వీరు. కానీ ఆంధ్రతో కలిసిన పాపానికి రాజ్యాంగబద్ధంగా విడిపోదామనుకున్నారే తప్ప ఒక్కరోజు వారిలో రెచ్చిపోయి ఒక్కరినీ కొట్టింది లేదు. 1969లో తెలంగాణ విద్యార్థుల పేరుతో సాగించిన అరాచకం ఎవరు చేశారో సుస్పష్టం. కేవలం ఆ అరాచకాన్ని సాకుగా చూపి 369 మంది తెలంగాణ బిడ్డలను రాక్షసంగా బలిగొంది అప్పటి రాజ్యం. తెలంగాణ ఆకాంక్ష ధాటికి తట్టుకోలేక ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తలవంచాయి. వలస వచ్చినవాళ్లను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపిన గొప్ప మనసు తెలంగాణది. కానీ సీమాంధ్రులు తెలంగాణ ఏర్పడే వేళ కలిసుందామంటూనే సాగిస్తున్న అరాచకత్వం ఇప్పుడు కళ్లకు కడుతోంది. వాళ్లు నూటికి నూరుపాళ్లు దొంగలు. ఇక తమ దోపిడీ కొనసాగదే అనే అక్కసుతోనే తెలంగాణ ఉద్యోగులపై దాడులకు తెగబడ్డారు. ఇదిచాలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడానికి. ఇంతవరకూ వచ్చాక దోపిడీదారులతో కలిసి ఉండటం సాధ్యం కాదు. కాలం చెల్లిన సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నదెవరో సుస్పష్టం. అలాంటి వారితో ఇక తెగదెంపులు చేసుకోవడమే తరువాయి.