అమెరికా నిఘా గుట్టు రట్టు
బ్రాడ్లే, అసాంజె, స్నోడెన్ ఇలా ఒక్కొక్కరూ అమెరికా చేస్తున్న దారుణ అగడాలను, వ్యక్తి స్వేచ్ఛా చౌర్యాన్ని బయటపెడుతూ దాని నిజస్వరాపాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌తో సహా సకల సమాచార సాధనాలపై అమెరికా చేపట్టిన నిఘా చర్యలు రహస్యాన్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తోన్న ఎడ్వర్డ్ స్నోడెన్ జూన్ 7వ హాంగ్‌కాంగ్‌తో నేరస్థుల అప్పగింత ఒప్పందం నేపథ్యంలో స్నోడెన్ ను తనకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. స్నోడెన్‌ను తనకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. స్నోడెన్‌పై ప్రభుత్వ సంపదను దొంగిలించడం, జాతీయ రక్షణ సమాచారాన్ని అనధికారంగా బహిర్గతం చేయడం, అనధికార వ్యక్తికి బుద్ధిపూర్వ కంగా ప్రభుత్వ గూఢచర్య సమాచారాన్ని వెల్లడించడం, అమెరికాకు వ్యతిరేకంగా గూఢచారిత్వానికి పాల్పడం లాంటి కేసులను అమెరికా బనాయించి ఆయన వీసానూ రద్దు చేసింది. అయితే రష్యా, చైనాల సహకారంతో స్నోడెన్ మాస్కోకు వెళ్లి తాత్కాలిక ఆశ్రయం ఇవ్వడానికి వెనిజులా, ఈక్వెడార్ దేశాలు ముందుకొచ్చాయి.మొన్న బ్రాడ్లే మానింగ్, నిన్న జూలియన్ అసాంజె, నేడు ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కొక్కరూ చీల్చీ చెండాడుతోంటే ప్రపంచాధిపత్యానికై అర్రులుచాస్తున్న ‘పెద్దన్న’ గంగవెర్రులె త్తుతున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల, దేశాధినేతల వ్యక్తిగత, అధికారిక సమాచారం మొత్తాన్న ‘ప్రిజం’ అనే కార్యక్రమం ద్వారా తన దేశం రహస్యంగా సేకరించి ప్రతినిత్యం పరిశీలిస్తోందని ఎడ్వర్డ్ స్నోడెన్ అనే 29 సంవత్సరాల అమెరికన్ యువకుడు అటీవల లోకానికి వెల్లడించాడు. ప్రపంచంలొని ఇంటర్నెట్ సమాచారం మొత్తం అమెరికా సర్వర్ల గుండా ప్రయాణించాల్సిందే కాబట్టి తన దేశంలోని సర్వర్లకు ‘బౌంద్‌లెస్ ఇన్‌ఫర్మేషన్’ అనే సమాచారం వెలికితేసే (డేటా మైనింగ్) ఒక టూల్‌ను ఏర్పాటు చేసి అన్ని దేశాల సామచారాన్ని తోడేస్తోంది. ఈ టూల్ విశేషమేమిటంటే కంప్యూటర్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లను ఈ టూల్ (ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం) అమర్చడం ద్వారా ప్రపంచ దేశాల్లో ఏ దేశానిది కావాలంటే ఆ దేశ సమాచారమంతా వచ్చి అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సర్వర్లలోకి వచ్చి చేరిపోతుంది. దీన్నే మెటా డెటా అంటారు. వ్యక్తి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించీ, మానవ హక్కుల గురించీ నిత్యం ఇతరులకు సుద్దులు చెప్పే అమెరికా ఈ విధంగా ప్రతిక్షణం ప్రపంచ ప్రజల స్వేచ్చను హరించే దురాగతానికి పాల్పడుతోందన్న విషయం వెల్లడికావడం దానికి మింగుడుపడడం లేదు. సామ్రాజ్యవాద ప్రచార సాధనాలు, కార్పొరేట్ మీడియా ఎంతగా తొక్కిపడదామని ప్రయత్ని స్తున్నా ఈ అంశం అమెరికా పరువుతీసి పందిరేస్తూనే ఉంది. ప్రధాన టెలకామ్ ఆపరేటర్ల ఖాతాదారులకు చెందిన టెలిఫోన్ రికార్డులను అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఎ) రహస్యంగా సేకరి స్తోంది. వెరిజోన్‌తో సహా తొమ్మిది అతి పెద్ద ఇంటర్నేట్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థల ఖాతాదారుల టెలిఫోన్ రికార్డుల వివరాలను ఏజెన్సీ సేకరాఇస్తోంది. ఎన్‌ఎస్‌ఎకు చెందిన స్నోడెన్ క్లాసిఫైడ్ అమెరికా భద్రతా ఏజెన్సీ పత్రాలను బ్రిటన్ దినపత్రిక ‘ది గార్డియన్’లో 2013 జూన్ 7న వెల్లడించారు. ఆ తరువాత ఇందుకు సంబంధించిన వివరాలను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఈ పత్రాలను లీక్ చేసినతరువాత అతడు హాంకాంగ్‌కు వెళ్లిపోయా డు. హాంకాంగ్ కోర్టుల్లో సంప్రదాయంగా వస్తున్న భావప్రకటన స్వేచ్ఛ తనను ప్రాసిక్యూట్ చేసే నిమిత్తం అమెరికాకు పంపకుండా కాపాడగలదన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రజలకు తెలియకుండా ఇంతటి విస్తృత స్థాయిలో వారి వ్యక్తిగత వివరాలను సేకరించడం ప్రజల స్వేచ్చ స్వాతంత్య్రాలను హరించటమేనని ఆయన పేర్కొన్నా డు. అందువల్లనే ఇంటలిజెన్స్ ఏజెన్సీల క్లాసిఫైడ్ డాక్యుమెంట్టను లీక్ చేసి విజిల్ బ్లోయర్ పాత్ర పోషించే సాహసం చేసినట్లు ఆయన పత్రికల వారితో చెప్పాడు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అస్సాంజే తర్వాత అంతటి సంచలనం సృష్టించిన ఘనత స్నోడెన్‌కే దక్కింది. మొదట అమెరికా ప్రజల హక్కుల్ని హరిస్తోన్న ఎన్‌ఎస్‌ఎ నిఘా కార్యకలాపాల్ని స్నోడెన్ బయటపెట్టాడు. ఆ తర్వాత బ్రిటన్‌కి చెంది జిసిహెచ్‌క్యు (గవర్నమెంట్ కమ్యూనికషన్స్ హెడ్ క్వార్టర్స్), సంస్థలు కోట్ల మంది ప్రజల ఫోన్‌కాల్స్, ఈమెయిల్, ఫేస్‌బుక్ సందేశాలు, బ్రౌజింగ్ హిస్టరీతో సహా సకల సమాచారాన్ని దొంగతనంగా సేకరిప్తోన్న సంగతి జూలై 7న వెలుగులోకి వచ్చింది. చైనాలోని అత్యున్నత విద్యా పరిశోధన సంస్థ జిన్హువా విశ్వ విద్యాలయంలోని పరిశోధనా సమాచారమంతటిని సిఐఏ హ్యాక్ చేస్తోందని ఆయన మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్ సమాచార చౌర్యంలో అమెరికాను అతిపెద్ద విలన్ గా అభివర్ణిస్తూ, చైనా మొబైల్ కంపెనీలను హాక్ చేయడం ద్వారా లక్షల కొద్దీ మెసెజ్‌లను అమెరికా సేకరించిందని స్నోడెన్ మార్నిగ్ పోస్ట్ పత్రికకు వెల్లడించాడు. చైనాలో టెక్ట్స్ మెసేజింగ్ అతి పెద్ద సమాచార అనుసంధాన ప్రక్రియ సామాన్యుల నుంచీ ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని ఈ విధానంలో ఇచ్చిపుచ్చుకుంటారు. అమెరికా దీనితో పాటు సింగ్వా యూనివర్సిటీ కంపూటర్లు, సర్వర్లను హాక్ చేసి అక్కడి రీసెర్చ్ కార్యాకలాపాల సమాచారాన్ని కూడా సేకరించిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కీలక నెట్‌వర్క్ ఇలాంటి కూడళ్లను సిఐఎ హ్యాక్ చేస్తున్న విషయాన్ని స్నోడెన్ వెల్లడించారు. ఇంటర్నెట్ కార్యకాప మంతా నడిచే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఆ రెండు సంస్థలు టాపింగ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారామంతటిని సేకరించి, దాన్ని వడపోసి, నిల్వ చేస్తోన్న విషయాన్ని ఎన్‌ఎస్‌ఎ విజిల్ బ్లోయర్, ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా సైనిక గూఢచార సైనిక గూఢాచార యంత్రాంగం కప్పుకున్న ముసుగును తొలగించడం ద్వారా అమెరికా పౌరులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఎనలేని సేవ చేశాడు. అమెరికా రాజ్యాంగ చట్టం పౌరులకిచ్చిన మౌలిక హక్కులను గూఢచార యంత్రాంగం వాలరాసి వేస్తోన్న తీరును బయటపెట్టాడు. స్నోడెన్ బయటపెట్టిన సమారమేమిటి? అమెరికా జాతీయ భద్రతా సంస్థ టెలికాం కంపెనీ వెరిజాన్ వినియో గదారులందరి టెలిఫోను సమా చారమంత అందించవలసిందని ఒక కోర్టు నుండి రహస్య ఆజ్ఞను పొందింది. దీనిని డ్రాగ్‌నెట్ అని పిలుస్తున్నారు. అమెరికా సామ్రాజ్య వాదం దృష్టిలో దేశాలకు సార్వభౌ మత్వం లేదు. ఆ దేశా ప్రజలు పౌరులుకారు. వారికి హక్కులుండ వు. ఒక కోర్టు ఉత్తర్వు కూడాలే కుండా ఇతర దేశాల ఫోను, ఇంటర్నెట్ వాడకం దారుల సమా చారమంతా అది సేకరిస్తోంది. దీని ని హద్దులు లేని సమాయారం అని పిలుస్తున్నారు. ఇలా ఇప్పటికే సేకరించిన సమాచారం ద్వారా అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులందరి సాంఘీక, రాజకీయ వ్యక్తిత్వాలను సవివరంగా చిత్రించగలదు. ఇది అతి వ్యాఖ్యానం కాదు. అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్ ఇలా చెప్పింది. ఈ గూఢాచారి కార్యక్రమం ద్వారా మాలాంటి సంఘాల సమగ్ర సమాచారమంతా ప్రభుత్వం పొందుతుంది. మాకుటుంబ, రాజకీయ, వృత్తిపర, మత వ్యక్తిగత సన్నిహిత సంబంధాల సవివర సమాచారం సేకరిస్తుంది. ఈ కార్యక్రమానికి గురవుతోంది అమెరికా ప్రజలే కాదు, హద్దులులేని సమాచారం అన్న కార్యక్రమం తో అమెరికా జాతీయ భద్రతా సంస్థ 2013 మార్చ్ నెలలోనే 9700 కోట్ల సమాచార అంశాలను ప్రపంచమంతటి నుండీ సేకరించింది. దీనిలో 300 కోట్లు అమెరికా ప్రజల నుండి రహస్యంగా సేకరించగా, ఇరాన్ నుండి 1400 కోట్లు, పాకిస్థాన్ నుండి 1350 కోట్లు, జోర్డాన్ నుండి 1270 కోట్లు, ఈజిప్టు నుండి 760 కోట్లు, భారత్ నుండి 630 కోట్లు యూరపు దేశాల నుండి 300కోట్లు రహస్యంగా సేకరించింది. హద్దులు లేని సమాచారమన్న ఈ రహస్య గూఢచారి కార్యక్రమం ప్రతి దేశపు సార్వభౌమత్వ, జాతీయ హక్కులను కూడా నిరాకరించేదిగా ఉంది. స్నోడెన్ బయటపెట్టింది సముద్రంలో నీటి బిందువు మాత్రమే. ఈ గూఢచారి కార్యక్రమం ఇంకా లోతుగా సాగుతోంది. దీనిని స్నోడెన్ అణచివేత నిర్మాణం అన్నాడు. ఇలాంటి పనులన్నీ చేసే సమాజంలో నేను జీవించలేను. నేను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనీ రికార్డు చేసే లోకంలో జీవించాలని నేను కోరుకోవటం లేదు అన్నాడు. అమెరికా రాజకీయ వ్యవస్థలో నిజమైన ప్రజాస్వామ్యంలేదని ఇది తెలుపుతుంది. ఇది ప్రజలను ప్రతిపక్ష శక్తిగా చూస్తోంది. ఇది ప్రతి పౌరుడిని శతృవుగా పరిగణిస్తోంది. అది మొత్తం సమాజాన్ని వేధించడం, బ్లాక్ మెయిల్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్నోడెన్ బయటపెటి&్టన సమాచారం మరొక అంశాన్ని కూడా తెలుపుతుం ది. అమెరికా ప్రజల హక్కులకు ప్రమాదం వాటిల్లుతోంది టెర్రరిస్టుల నుంచి కాదు. అది అమెరికా గుత్త పెట్టుబడి ఆధీనంలోని ప్రభుత్వం నుంచి, అమెరికా పాలక వర్గాలు దేశంలో అనుసరిస్తోన్న పొదుపు చర్యలకూ, దేశం బయట సాగిస్తోన్న అంతంలేని యుద్దాలకూ కార్మికవర్గం నుండి వస్తున& వ్యతిరేకతను అణచి వేసేందుకు పోలీసు రాజ్యపు చర్యలను బుష్ పాలన ప్రారంభించగా, ఒబామా ప్రభుత్వం వాటిని విస్తరిస్తోంది.
-ఎ నర్సింహారెడ