దొంగలు

ఆ రోజు బతుకమ్మ పండుగ. మా ఊళ్లో బదుకమ్మ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. వాగు దగ్గర పిల్లా జల్లా ఆడ మగా అందరూ గుమిగూడతారు. ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుకొంటూ, పిల్లలు ఇసుకలో కబడ్డి వగైరా ఆటలు ఆడుకొంటే, కుర్రకారు ఆడవాళ్ళని చూసుకొంటూ మునిగిపోతూ ఉంటారు. వాగు ఒడ్డు మీద నిల్చుని బతుకమ్మ ఆటని స్నేహితుల్తో కష్ట్ర్లసి చూడటం చిన్నప్పటి నుంచి ఆలవాటు. ఈ పండుగ ఎంతో సరదాగా అన్పిస్తుంది. అందుకే నాలుగింటికే కోర్టు పనుల్నఈ్న ముగించుకొన ఇంటికి వచ్చాను.

ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు క్లయింట్లతో మాట్లాడి లోపలికి వెళ్ళాను. పక్కింటావిడ, మా శ్రీమతి కలిసి కూర్చొని ఏదో మాట్లాడుకొంటున్నారు. వాళ్ళ మొహాలు సీరియస్‌గా ఉన్నాయి. పండుగరోజు ఇంత తీరిగ్గా కూర్చున్నారేమిటా అని ఆశ్చర్యపోతున్న నన్ను చూడగానే మా ఆవిడ లేచి…

”మీ కోసమే చూస్తున్నాం! వీళ్ళ అబ్బాయి మూడు గంటల ప్రాంతంలో చౌరస్తాలో స్కూటర్‌ ఆక్సిడెంట చేసాడట. ఎదురుగా వస్తున్న సైకిల్‌ వాడిదే తప్పట. సైకిలు వాడికి పెద్దగా దెబ్బలు ఏమీ తగల్లేదట.  అయినా వీళ్ళ అబ్చాయిని పోలీసులు తీసుకుపోయినారట. వాళ్ళాయన కూడా ఊళ్లో లేరట. ఈవిడ ఒకటే ఆందోళన చెందుతుంది. కాస్త తెలఉసుకొని వాళ్ల అబ్బాయిని వదిలిపెట్టేట్టు చూడండి” అంది. పక్కింటావిడ మొకం కూడా ఆదే విషయం ప్రార్ధిస్తు చెప్తున్నట్లు అన్పించింది. కొడుకుగురించి గాబరా పడుతున్నట్టు అనిపించింది.

”సరే మంచిది” అన్నాను. ఆఫీస్‌రూంలోకి వచ్చి స్టేషన్‌కి ఫోన్‌ చేసి వివరాలు తెల్సుకొందామనుకొని ఫోన్‌ ఎప్పుడూ ఇంతే అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ పనిచేయదు.

స్కూటరు తీసుకొని స్టేషన్‌కని బయల్దేరాను. ఈ వృత్తిలోకి వచ్చాక, ట్రయల్‌ కోర్టులలో పని చేస్తుండటం వల్ల పోలీస్‌ స్టేషన్ల్‌కి ఇష్టం లేకున్నా అప్పుడప్పుడు వెళ్ళక తప్పటంలేదు. చిన్న ఆక్సిడెంట్‌. బెయిలబుల్‌ నేరం కనుక జమానత్‌ ఇస్తే వదిలిపెడ్డారు. అదుకని బయల్దేరాను.

స్టేషన్‌ వచ్చేసింది. అది ఎప్పుడో నిజాం జమానాలో కట్టించాడు. అప్పుడెప్పుడో రాయించిన సిమెంట్‌ బోర్టు ఇంకా అలాగే ఉంది. మా చిన్నప్పటి నుంచి స్కూలుకి వెళ్తూ ఆ సిమెంట్‌ బోర్డు మీద రాసి ఉన్న ఈ అక్షరాల్ని ‘పోలీసు యి స్టేషన్‌ హవుసు’ అని చదువుకొంటూ పోయేవాళ్ళం. ఎత్తయిన స్థలంలో ఓ పెద్ద గద్ద వాలినట్టుగా ఉంఉటంది దూరం నుంచి ఆ పోలస్‌ స్టేషన్‌న్ని చూస్తే. స్టేషన్‌ చుట్టూ ఎత్తుగా పెరిగిన తుమ్మచెట్లు ప్రహరిగోడ లాగా ఉన్నాయి. మధ్యలో ఈ మధ్యే పెంచుతున్న యూకలిప్టస్‌ చెట్లు వైర్‌లెస్‌ యాంటిన్నాతో పోటీ పడుతున్నట్లుగా పెరుగుతున్నాయి.

స్టేషన్‌ ముందు సెంట్రి అటెన్షన్‌లో లేడు. మాంచి రదిఆకల్సింగ్‌గా కన్పించాడు. సెంట్రిని చూడగానే స్టేషన్‌లో ఆఫీసర్స్‌ ఎవరూ లేరన్న విషయం అర్థమైంది. స్కూటర్‌ని పక్కకి ఆపి స్టాండ్‌ వేస్తుండగానే   సెంట్రీ ”అమీన్‌సాబ్‌ లేరు సార్‌. ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఎవరైనా వస్తే ఉండమని చెప్పాడు. లోపల కూర్చోండి” అన్నాడు.

మెట్లెక్కి& స్టేషన్‌లోకి వెళ్ళాను లోపలికి పోగానే సింహం బోనులోకి ప్రవేశించినట్లు శ్మశానంలోకి అర్థరాత్రి వెళ్ళినట్లుగా ఫీలయ్యాను. నాకే ఇలా అన్పిస్తే మామూలు జనాలకి ఎలా అన్పిస్తుందో. గడియారం కేసి చూసాను అయిదున్నర కావొస్తుంది. అందరూ బతుకమ&్మని తీసుకొని వాగు దగ్గరకు బయలుదేరి ఉండవచ్చు స్టేషన్ని ఓసారి పరిశీలనగా చూశాను.

ముందు చిన్న హాలు, రెండువైపులా లాకప్పు రూంలు. అది దాటగానే ఎస్‌ఐ కూర్చుండే గది. దానికి ఎడమవైపు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గది, కుడివైపు ఆయుధాగారం. టేబుల్‌ మీద ఫోన్‌. ఎడమవైపు సర్కిల్‌ గోడకు బిగించి ఉన్న వైర్‌లెస్‌ సెట్లు. గోడ మీద బాపూజీ బొమ్మ, గోడకి స్టేషన్‌ పరిధిని చూపించే పటం, ఓ ఫోటోఫ్రేమ్‌లో బిగించబడి ఉన్న నేర్ణైస్థుల ఫోటోలు, ఓ బోర్డు మీద పోలీసు అంటే ఏమిటో అర్ధాన్ని చూపించే బోర్డు. ఇంకా ఏదో స్లోగన్‌, ఎస్‌ఐ టేబుల్‌కి రెండువైపులా రెండు కుర్చీలు, దానికి ముందు ఓ పొడవైన బల్లా. ఆగది తర్వాత ఇంకో హాలు. దానికి కుడివైపు రైటరూ, కానిస్టేబుల్‌ కూర్చుండే గది కుడివైపునేరస్తుల్ని ఇంటరాగేషన్‌ చేసే గది. అయిదు నిమిషాఉ కూర్చున్నానో లేదో వైర్‌లెస్‌ సెట్టు ఒకటే అరవడం మొదలుపెట్టింది. విసుగొచ్చి ముందటి హాల్లోకి వచ్చి కూర్చున్నాను.

చల్లటి గాలి వీస్తోంది. మా పక్కింటి కుర్రాడ్ని అక్కడికి తీసుకొచ్చిన జాడలేవీ కప్పించలేదు. లాకప్‌లో వెయ్యలేదు కదా అని అనుమానం వచ్చింది. సాధారణంగా చిన్నచిన్న కేసుల్లో అంత పనిచెయ్యరు. ఎందుకైనా మంచిదని లాకప్‌ వైపు చూస్తే ఒకటి ఖాలీగా కన్పించింది. రెండో దాంట్లో ఓ ముగ్గురు వ్యక్తులు కన్పించారు. వాళ్ళు ముగ్గురూ నన్ను చూడగానే లేచి నిల్చున్నారు. జాతరలో తప్పిఓయిన పిల్లగానికి తిరిగి తల్లిదంక్రడులను చేరుకోగానే ఎలాంటి ఆనందం వేస్తుందో, అలాంటి ఆనందమే వాళ్ళ మొఖాల్లో కన్పించింఇ.

”ఒక్కమాట సారూ” అని పిలిచాడు. వాళ్ళలో ఒకడు. వాడికేసి పరిశీలనగా చూశాను. యాభై సంవత్సరాలు ఉంటాయేమో. తీసుకొచ్చి ఎన్ని రోజులైందో ఏమో,  మీసాలు, గడ్డం బాగా పెరిగి ఉన్నాయి. తిండిలేక పిక్కుపోయినట్టుగా కన్పించాడు. శరీరం మీద ధోతి, కమీజు ఉన్నాయి. అది మాసిపోయి వాసన గొడుతున్నాయి. మనిషి మంచి ఎత్తులోనే ఉన్నాడు. మిగతా ఇద్దరికి కూడా గడ్డం, మీసాలు పెరిగి ఉన్నాయి. ఇరవై అయిదు సంవత్సరాలు వరకు ఉంటాయనిపించింది. పొడుగ్గా ఉన్నారు.

‘ఏమిటీ’ అన్నట్టుగా ముఖం పెట్టి లాకప్‌ దగ్గరకి వెళ్ళాను.

”అయ్యా మాది రాములపల్లి. నన్ను మీరు చూసి ఉండవచ్చు” అన్నాడు ఆ యాభై ఏళ్ళవాడు.

వాళ్ళను చూడగానే వాళ్ళు ఒడ్డెరవాళ్ళని ఏదో దొంగతనం కేసులో పట్టుకొచ్చారని అర్థమైంది.

”నేనెవరినో తెలుసా” అన్నాను సందేహంగా.

”మీరు తెల్వకపోవడమేంది సారూ కోర్టులో మిమ్మల్ని చాలాసార్లు చూసినా”

”కోర్టుకి నువ్‌ ఎందుకు వచ్చినవ్‌”

”పోయినేడు వానాకాలం బండి గిరాకి ఏమి లేకుండె సారూ. తొవ్వకాసి దొంగతనం చేసినప్పుడు దొరికిన సారూ. గప్పుడు కొద్దిరోజులు నా మీద కేసు నడిచింది. అప్పుడు చూసిన సారూ” అన్నాడు.

”మరెమైంది ఆ కేసు”

”రెండు నెల్లు జైలు శిక్ష వేసిండ్రు సారు. అది అయిపోయింది”

”మరి ఇప్పుడు మళ్ళీ ఏమైంది” అడిగాను.