ప్రైవేటీకరణకే ఈ స్వాతంత్య్రం
తన వద్ద నున్న పత్రాలను పత్రికలకు విడుదల చేసేగప్పడు స్నోడెన్ ఒక నోటును ఇచ్చాడు. అందులో ఆయన ఇలా పేర్కోన్నా డు. ప్రజల పేరుతో ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న తతంగాన్ని ప్రజలకు వివరించడమే నా ఏకైక లక్ష్యం. అమెరికా ప్రభుత్వం తను రహస్యం గా నిర్మించిన ఈ విస్తారమైన గూఢాచారి వ్యవస్థ ద్యారా వ్యక్తుల ఏకాంతన్ని, ఇంటర్నెట్ స్వాతంత్రాన్నీ, ప్రపంచ ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించడాన్ని నేను సహించలేను. ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ గురించి ప్రపంచానికి వెల్లడించే రహస్య పత్రాలను విడుదల చేయడం ద్వారా తను తన స్థిరమైన, విజయ వంతమైన జీవితన్ని త్యాగం చేయడానికి సిద్దాపడ్డాను అని స్నోడెన్ పేర్కొన్నాడు. అమె రికా గూఢాచర్యం నెరుపుతున్న దేశాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. చైనా, రష్యాల కన్న కూడా ఎక్కువ రహ స్యాలను భారతదేశాం నుండి సేకరిస్తోందని స్నోడెన్ అందించిన సిడిలోని సమాచారం తెలుపుతుంది. కాని భారత ప్రభుత్వం మాత్రం అమెరికా చర్యను ఖండించకుండా కుక్కిన పేనులా ఉండి పోయింది. భారతీయ కార్పొరెట్ మీడియా అయితే దీన్ని ఒక వార్తగానే పరిగణి స్తున్నట్లు లేదు. తెలుగు మీడియా కూడా వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నట్లున్నది. ఈ సందర్బంలోనే భారతదేశంలోని పరిస్థిని కూడా మనం గమనించాలి. దేశంలో పరిస్థితి అమెరికాలో పరిస్థితి కంటే మరింత హీనంగా ఉంది. అమెరికాలో నిఘా ద్వారా సమాచా రం సేకరించాలంటే రహస్యంగా కోర్టు అనుమతి పోందుతారు. మన దశంలో టెలికాం కంపెనీలకు జారి చేసిన లైసెన్సులని నిబంధనల ప్రకారం పోలీసులు అడిగిన వెంటనే మొత్తం సమాచారన్ని అందిం చాల్సి ఉంది. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల పోన్లు టాపింగ్ చేశారన్న ఆరొపణలు విన్నాం. టాపింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుం టానన్న శుష్క హామి తప్ప చేసింది ఏమి లేదు. అంతే కాకుండా భారత ప్రభుత్వం జాతీయ రహస్య సాంకేతిక సంస్థ (ఎన్‌టిఆర్‌ఒ)ను ఏర్పాటు చేసింది. ఇది పార్లమెంట్‌కు జవాబుదారీ కాదు.ఇది ఇంటలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో పరి చేస్తుంది. ఇది భారత ప్రజలపై నిఘా పెట్టే పనులు చేస్తోంది. 2006-07లో గూగుల్, స్కైపీల సర్వర్లలోకి చొరబడే ప్రయత్నలు చేసింది. కానీ సఫలం కాలేదు. సిఫి, రిడిఫ్‌మెయిల్ సర్వర్లలోకి చొరబడగలిగింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతధికారుల ఈ మెయిళ్లలోని సమాచాన్ని ఎన్‌టిఅర్‌ఒ ఎవరి అనుమతి లేకుండానే రహస్యంగా సేకరిస్తున్నదని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశావ్యాప్తంగా నిరసన వ్యక్తమ వుతుంది. కేంద్ర నిఘా పర్యవేక్షక వ్యవస్థ (సిఎంఎస్)ను, జాతీయ గూఢాచారి గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు 2011లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే సిఎంఎస్ ఎలా పనిచేస్తుంది? పౌర హక్కుల విఘాతం కలుగకుండా ఇది ఎలా విధుల నిర్వహిస్తుంది? అన్ని విషయంలో ప్రభుత్వం పెద్దగా చెప్పిందేమీ లేదు. దీనిపై ప్రజా బహుళ్యంలో కూడా చర్చ జరగలేదు. సిఎంఎస్‌ను పర్యవేక్షిస్తున్న టెలికమ్యూనికేషన్ని శాక అదికారులు దీనిపై స్పందించడానికి నిరకారిస్తుంది. ఈ నూతన నిఘా విధానం ్పకరం ప్రభుత్వం లక్షిత వ్యక్తుల ఫోన్ సంభాషణలను వినగలదు. ట్యాప్ చేయగలదు. ఈ మెయిల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చదవడం, గూగూల్‌లో వారు సేర్చ్ వివారలను సేకరించగలదు. ఇందుకు ఎలాంటి కోర్టు అనుమతి ముందుగా తీసుకోదు. ఈ నిఘా విధానాన్ని హాక్కుసంఘాల కార్యకర్తలు,మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిఘా ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత మంత్రి షిండే భారత-అమెరికా దేశాల భద్రత చర్యలను చర్చించారు. అమెరికాలోని వెబ్ కంపెనీల కేంద్రన్నీ ఉండడంతో తన చట్టాల ప్రకారం నాటి నుండి నేటి వరకు అన్ని దేశాలోని ప్రజల సమాచారన్ని అది సేకరిస్తుంది. అన్ని దేశాల ప్రజల మీద అమెరికా నిఘా పెడుతుంది? ఇతర దేశాల ప్రభుత్వలు అలాంటి నిఘాను ఎట్టి పరిస్థితుల్లోను అంటీకరించవన్న అంశాన్ని అలా పెడితే, భారత ప్రజలపై నిఘా పెట్టాలని భారత పాలకు లెంతగా తహతహలడుతున్నారో ఇది తేలియజేస్తుంది. ఒక రకంగా చేప్పలంటే ఆధార్ కార్డు అందులో భాగాంగనే వచ్చింది. అమెరికా ఈ విధంగా ప్రపంచ ప్రజలందరిపైనా నిఘా నేత్రం ప్రసరింప జేయడానికి కారణం ఇంటర్‌నేట్ దాని చేతుల్లో ఉండడమే ఇంటర్న్ ట్ మొత్తంగా అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో నడుస్తోంది.దాని అధారంగానే అది అంతర్జాతీయ కేబుల్ నెట్‌వర్కులు సర్వర్ల నుండి వివిధ దేశాల సమాచారన్ని తోడేస్తుంది. అందుకో ఇంటర్న్‌ట్ నియంత్రణను అమెరికా వాణిజ్యా శాఖ చేతిలో నుండి తొలగించి అంతార్జాతీయ టెలి కమ్యూని కేషన్స్ యూనియన్ (ఐటియు) చేతిలో పెట్టాలని గత ఏడాది దుబాయిలో జరిగిన అంత ర్జాతీయ టెలి కమ్యూనికేషన్స్ ప్ర పంచ సదస్సు (డబ్ల్యూసిఐటి 2012)పిలుపు నిచ్చింది. 89 దేశాల సంతకాలు చేసిన ఈ సంయుక్త ప్రకటనపై అమెరికా సంతకం పెట్టలేదు. ప్రజల హక్కు లను జాతి ప్రయోజనాలను భంగ పరిచిన వివిధ ప్రభుత్వల తప్పడు నిర్ణయలను బయటపెట్టిన నిజాయి తీ గల అధికారులు వివిధి సంద ర్బాల్లో కీలక పాత్ర నిర్వహించారు. గతంలో వియత్నం యుద్దంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పదమైన నిర్ణయాల గురించి 1971లో పెంటగాన్ పేపర్స్ పేరుతో బయటపెట్టిన డేనియల్ ఎల్స్‌బెర్గ్, ఇరాక్‌లో అమెరికా సైనిక అకృత్యాలను వికీలీక్స్ సంస్థకు వెల్లడిస్తున్నడని అరెస్టయి బ్రాడ్లీ ఎడ్వర్డ్ మానింగ్ తదితరులను అమెరికా కఠినంగా శిక్షించింది. ప్రపంచ వ్యాప్త నిరంకుశ ప్రభుత్వల మానవ హక్కుల హననాలను, ప్రజా వ్యతిరెక, అవినీతికర విధా నాలను బయట పెట్టేందుకు అస్సాంజే సారధ్యంలో వికీలీక్స్ సంస్థ లోని సభ్యులు కైడా చారిత్రక పాత్ర నిర్వహించారు. అదే కోవలో తన ప్రాణలకు ప్రమాదమున్నప్పటీకి ప్రపంచ ప్రజల హక్కుల్ని హరిస్తో న్న అమెరికా దుశ్చేష్టలను బయటపెట్టేందుకు సిద్దపడడం గొప్ప విషయం ఆయన సాహసం ప్రపంచ వ్యాప్త హక్కుల సంస్థలకు , ప్రభుత్వ నీతి బాహ్యతకు బయటపెట్టేందుకు సిద్దపడే విజిల్ బ్లోయర్ లకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుంది. అమెరికాన్ సామ్రాజ్య వాదుల అతి నికృష్ట గూఢచర్యంపై ఎడ్వర్డ్ స్నోడెన్ అందజేసిన సమాచరం ప్రపంచ ప్రజల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం పెంచడానికి తోడ్పడుతుంది. నిజానికి అమెరికా యువకుల్లోనే సామ్రాజ్యా వాదాని కి వ్యతిరేకంగా చైతన్యం పెరుతోందనాడానికి నిన్న మానింగ్, నేడు స్నోడెన్‌ల ఉదంతాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆప్ఘనిస్థాన్, ఇరాక్‌లలో తమ దేశం సాగిస్తున్న అమానుషాలను వెల్లడించిన మానింగ్ జైలులో అమెరికా సాగిస్తోన్న దురాగతన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు తన జీవితాన్నే ఫణంగా పెట్టాడు ఇదాంత యువ తలో వస్తున్న చైతన్యం. సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం.ఇది రానున్న కాలంలో మరింత పెరుగుతుంది. అంతిమంగా సామ్రాజ్య వాదం పతనం కాక తప్పదు.
-ఎ నర్సింహారెడ