సేవా తత్పరురాలు మదర్‌ థెరిసా

By blood, I am albanian, By citizemship an Indian, By faith Iam a cathalic nun, As to my calling, Iam belong to the world. As to my heart I belong entirely to the heart of Jesus అని తెలిపిన మదర్‌థెరిస్సా యుగోస్లేవియా దేశంలోని ‘స్కోప్జి’లో 1910వ సంవత్సరము ఆగస్టు 27న జన్మించింది. అసలు పేరు ఆగ్నస్‌ గోన్షా బొజాక్షు. నన్‌గా(సన్యాసిని)గా మారిన తర్వాత మదర్‌ థెరిస్సాగా మార్చుకున్నారు. ”ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న” అని ప్రపంచానికంతటికి చాటి చెప్పిన మదర్‌థెరిస్సా తన జీవితకాలాన్ని సేవాకార్యక్రమాలకే అంకితం చేసి ప్రపంచంలో సుమారు 125 దేశాలకుపైగా, 700లకు పైగా సేవా కేంద్రాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికినీ నిర్వహించబడుటకు ప్రేరణగా నిలిచారు.

18 సంవత్సరాల వయస్సులోనే ‘ఆర్డర్‌ ఆఫ్‌ టొరెంటో’లో సన్యాసినిగా మారిన థెరిస్సా 1929లో కలకత్తాలోని టొరెంటో స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా చేరటానికి భారతదేశానికి వాచ్చారు. సెప్టెంబర్‌ 10, 1946న రైలులో డార్జిలింగ్‌ వెళ్తున్న సమయంలో కలకత్తాలోని పేద, పీడత బడుగు వర్గాల వారికి సేవ చేయమన్న దైవ వాక్కునకు బద్దురాలై కలకత్తాలోని పలు సేవా కార్యక్రమాలకు అంకితమైపోయింది. స్వయంగా థెరిస్సా కలకత్తాలోని వీధులని కలియ తిరిగి నిస్సహాయంగా పడిఉన్న అనాధలని తన ఆశ్రమానికి తీసుకువచ్చేది. ఆర్డర్‌ ఆఫ్‌ లొరెన్టో నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. 1948లో మొదటిసారిగా ప్రసిద్దమైన కాళికామాత ఆలయం వద్ద ‘మిషనరీ ఆఫ్‌ అథారిటీస్‌’ పేరుతో స్వచ్ఛంధ సంస్థను స్థాపించారు. మొదట ఆమె ప్రారంభించిన సేవా కార్యక్రమాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థికంగా పలు సమస్యలను ఎదుట నిలిచినా మొక్కవోని ధైర్యంతో ఆమె ముందుకు నడిచిన తీరు ప్రజలందరికీ కనువిప్పు కలిగించింది. ఒక్కొక్కరుగా ఆర్థిక సహయం అందించడం ప్రారంభించారు.

హెల్ప్‌ ఫ్యామిలీ హాస్పిటల్‌లో నర్సింగ్‌ కోర్సు చేసిన తర్వాత వ్యాధి పీడితులకు కుష్టు రోగ బాధితులకు ప్రేమ నివాస్‌ను ఏర్పాటు చేశారు. అనాథలకు ”నిర్మల శిశు సదన్‌” ను ఏర్పరిచారు.  ”నిర్మల్‌ హృదయ్‌”ని స్థాపించి అక్కడికి వచ్చిన వారిని ప్రేమతో ఆదరించేది. నిరాశ్రయులు, వ్యాధిపీడితులు, హెచ్‌ఐవీ వ్యాధి, క్షయా వ్యాధి గ్రస్తులు సంఘంచే బహిష్కరించబడిన వారు వరద బాధితులు ప్రకృతి ప్రకోప గ్రస్తులు, అనాధలు, నిరాశ్రయ బాలలు, ఒకరేమిటీ ఆపన్న హస్తానిన ఆశించిన ప్రతి ఒక్కరిని ఆదరించింది పలు పాఠశా లలు, ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసింది. ధెరిస్సా కార్యక్రమాలు ప్రపంచమంతటా విస్తరించా యి. పలు దేశాలు, స్వచ్చంధ సంస్థలు, అత్యున్నత అవార్డుల నందించారు. ఈమె పేరిట విశ్వ విద్యాలయాలు స్ధాపించబడ్డాయి. 27-8- 2010న జయంతి సందర్బంగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణా నిధిగారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహిం చారు. భారతదేశం ‘భారతరత్న’ అవార్డునిచ్చి థెరిస్సాన సత్యరించింది.

ఈ లోకంలో నేను చేసిన కార్యక్రమాలు ”సింధువులో బిందువంత” అని తెలిపిన సేవా తత్పరురాలు, నిరాడంబర జీవి మానవసేవే మాధవ సేవ అని భావించిన గొప్ప సంఘసేవకురాలు. ‘నభూ తో న భవిష్యత్‌’ అన్నట్లుగా ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని పొందిన మదర్‌థెరిస్సా సేవాపథ ము మనందరికి ఆచరణీయము, అనుసరణీయము, విప్కో దేశాలు ఆమెకు స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని అందించాయంటే ఆమె సేవలకు మరొక తార్కాణం అవసరం లేదు. ఆమె స్ఫూర్తి మరెందరికో మార్గదర్శమైంది.

-వైరాగ్యం ప్రభాకర్‌