అంతర్జాతీయ పరిణాలతోనే రూపాయి పతనం


బంగారం కొనుగోళ్లు, పెట్రోల్‌ వినియోగం తగ్గించండి
ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేదు
రూపాయి కోలుకుంటుంది
పార్లమెంట్‌లో ప్రధాని భరోసా
న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) :
అంతర్జాతీయ పరిణామాలు మన రూపాయిని దెబ్బతీశాయాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటించారు. సిరియా పరిణామాలు, చమురు ధరలు కూడా తోడయ్యాయని అన్నారు. గతకొంతకాలంగా రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలని చేస్తు న్న డిమాండ్‌పై స్పందించారు. రూపాయి పతనం, దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ లోకస భలో శుక్రవారం ప్రకటన చేశారు. వాయిదా అనం తరం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ సమా వేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేశారు. మే 22 నుంచి రూపాయి పతనం ప్రారంభమైందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ప్రధా ని పేర్కొన్నారు. సిరియా సహా అంతర్జాతీయ పరిణా మాలు రూపాయి పతనాన్ని ప్రభావితం చేశాయని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. కరెంటు ఖాతా లోటు రూపాయిపై ఒత్తిడి పెంచిందని, కరెంటు ఖాతా లోటు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటును 70 బిలియన్‌ డాలర్లకు తగించేందుకు కృషిచేస్తామన్నారు. ముడిచమురు ధర పెరుగుదలతో దిగుమతి భారం పెరిగిందన్నారు. బంగారం అధిక కొనుగోలును తగ్గించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పొదుపు పాటించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోందని ప్రధాని చెప్పారు. మే 22వ తేదీ నుంచి రూపాయి పతనం ప్రారంభమైందన్నారు. సిరియా సహా అంతర్జాతీయ పరిణామాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పారు. కరెంటు ఖాతా లోటు రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని, కరెంటు ఖాతా లోటు నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముడి చమురు ధర పెరుగుదలతో దిగుమతి భారం మరింత పెరిగిందన్నారు. బంగారం అధిక కొనుగోలును తగ్గించుకోవాలని ఆయన సూచించారు.బంగారంపై మోజు తగ్గించుకుంటే మంచిదన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత దేశంలో ద్రవ్యోల్భణం అధికంగా ఉందని, గత కొద్ది రోజులుగా వృద్ధి రేటు మందగించిందని చెప్పారు. ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం రూపాయి పతనంపై చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఊహించని అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి రికార్డు స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాల కరెన్సీ బలహీనపడడానికి అమెరికా ఫెడరల్‌ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే కారణమని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.బంగారంపై వ్యామోహం తగ్గించుకోవాలని, చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. పసిడి కొనుగోళ్లకు ఎగబడవద్దని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ ఖాతా లోటును 70 బిలియన్‌ డాలర్లకు తగ్గిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూపాయి పతనంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని తెలిపారు. రూపాయి విలువ తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమయిందని వివరించారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని  చెప్పారు. వాతావరణం బాగానే ఉండి వర్షాలు సాలంలో కురిసినా రూపాయి పతనమైందంటే అందుకు ఇవే కారణాలని వివరించారు. ప్రధానమంత్రి ప్రకటన పైన విపక్షాలు మండిపడ్డాయి. ఆయన ప్రకటన చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. లోక్‌సభలో ప్రధాని ప్రకటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభలో సభ్యులంతా గందరగోళంగా నినాదాలు చేశారు. ప్రధాని ప్రకటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా స్పీకర్‌ మీరాకుమార్‌ పలు బిల్లుల ప్రవేవ పెట్టడానికి మంత్రులకు అనుమతించారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.