వ్యవసాయం కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం

ఆహార ధాన్యాల నిలవ కోసం మరిన్ని గోడౌన్ల నిర్మాణానికి పూనుకోవలసి ఉండగా, ఉన్న వాటినే ప్రైవేట్‌ సంస్థలకు అప్పచెప్పడం వలన 2012 జూలై 1 నాటికి ఉన్న 8.05 కోట్ల ఆహార ధాన్యాల నిలువలో కేవలం 1.72 కోట్ల టన్నులు పక్కా ఎఫ్‌సిఐ గోడౌన్లలోనూ, తాత్కాలిక ప్లాస్టిక్‌ షీట్ల కవరింగ్‌తో 4.5 కోట్ల టన్నులు నిల్వ చేయగలిగారు. మిగిలిన 1.83 కోట్ల టన్నుల ధాన్యాలు సరైన స్టోరేజి సదుపాయాలు లేక చెడిపోతున్నాయి. ఆహార ధాన్యాలు నిల్వలు పేరుకుపోవడంతో వాటిని పేదలకు పంచి పెట్టాల్సింది పోయి ఉత్పత్తి ధర కన్నా తక్కువ ధరలకు విదేశాలకు జంతువుల ఆహారంగా ఎగుమతి చేస్తున్నారు. గోధుమ పంటకు దేశంలో ఉత్పత్తి ధర రు. 19,100 ఉంటే ఎగుమతి కోసం ప్రభుత్వం ధరను రు. 16,200గా నిర్ణయించింది. దీని వలన గత సంవత్సరం దాదాపు 1700 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఎఫ్‌సిఐ చైర్మన్‌ అమర్‌సింగ్‌ అన్నారు.

దేశ వ్యవసాయ రంగం ప్రపంచీకరణ విధానాల కారణంగా సర్వనాశనమై పోయింది. ఒకప్పుడు రైతులు పండించే పంటలోంచి నాణ్యమైన ధాన్యాన్ని సేకరించిన తరువాత పంటకు విత్తనాలుగా వాడుకొంటూ స్వయం పోషక విధానాన్ని కొనసాగించేవారు. కాని ఈనాడు విత్తనాల కోసం విదేశీ బహుళజాతి కంపెనీల మీద ఆధారపడేటట్లు చేశారు. నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాల వలన రైతు కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఆత్మహత్యలు పెరిగిపోతుయా యి. ఆర్ధిక సంస్కరణలు అమలయిన తర్వాత ఆహార ధాన్యాలను పండంచే భూమి విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మొత్తం సాగు భూమిలో ఆహార పంటలు పండించే భూమి 74.2 శాతం నుండి 71.4 శాతానికి పడిపోయింది. పేదలు అధికంగా వాడే జొన్న, సజ్జలు లాంటి తృణ ధాన్యాల కింద ఉండే విస్తీర్ణం 21.8 శాతం నుండి 18.6 శాతానికి పడిపోయింది. 2007లో ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 50 శాతం రైతులు రుణ భారంతో నలిగిపోతున్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. 1991-99 ఆల్టర్నేటివ్‌ సర్వే రిపోర్ట్‌ ప్రకారం , సంస్కరణలలో భాగంగా జరిగిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా వ్యవసాయాభివృద్దికి కేటాయించిన నిధులపైన ధనిక రైతులు, వడ్డీ వ్యాపారులు, స్థానిక నాయకులు, వర్తకులు, ద్రవ్య సంస్థలు అపవిత్ర కలయికతో ఏర్పడిన సిండికేట్లు బాగా పట్టు సంపాదించాయని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల, ప్రపంచ బ్యాంక్‌ల ఆదేశాలు శిరసావహించడం వలన వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడిందని ఢిల్లీ జవహార్‌లాల్‌ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రాచార్యులు జెపి సింగ్‌, అలోక్‌దాస్‌లు అన్నారు. సంస్కరణలకు ముందు అంటే 1980లో బియ్యం ఉత్పాదకత రేటు 3.3 శాతం ఉంటే అది 1990-98ల మధ్య కాలంలో 1.7 శాతానికి పడిపోయింది. గోధుమ ఉత్పాదక రేటు 4.7 శాతం ఉంటే సంస్కరణల తరువాత 2.7 శాతానికి పడిపోయింది. 1995-2011ల వరకు దేశంలో 2,79,9940 ఆత్మహత్యలు జరిగాయి. దీనిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌లలో దాదాపు 64 శాతం ఉన్నాయి. మహారాష్ట్ర 53,818 రైతుల ఆత్మహత్యలతో మొదటి స్ధానంలో ఉంటే, ఆంధ్రప్ర దేశ్‌ 33,326 మంది రైతుల ఆత్మహత్యలతో రెండవస్ధానంలో నిలిచింది. రుణ బాధలనేవి ఆంధ్ర రైతాంఆన్ని సమాజాన్ని నేడు పట్ట పీడిస్తున్న రోగాలు, రైతులు ఆత్మమత్యలకు పాలపడుతున్నారం టే ఆర్ధం, అప్పుల బాధల నుండి ఇక తిరిగి కోలుకోలేమని నిర్ధారణ కు రావడమే అని ఆంధ్రప్రదేశ్‌ పత్తి రైతులు ఆత్మమత్యలు చేసుకొన్న ప్రాంతాలను సందర్శించిన కేంద్ర పరిశీలనా బృందానికి నాయక త్వం వహించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి భగత్‌సింగ్‌ అన్నారు. హరిత విప్లవంలో భాగంగా మొదలైన విషపూరిత రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం నేటికీ కొనసాగుతుంది. దీని వలన దాదాపు ఒక కోటీ, ఇరవై లక్షల హెక్టార్ల భూములు నిస్సారమైపోయియని ఒక అంచనా.

పేదలెవరు?

ప్రపంచ బ్యాంక్‌ పేదరికాన్ని సమీక్షిస్తూ ‘వేర్‌ ది పూర్‌ అండ్‌ వేర్‌ ది పూరెస్ట్‌’ అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు పేదవారిలో ఒకరు భారత దేశానికి చెందిన వారే. మూడు దశాబ్ధాల్లో పేదరికం 22 శాతం నుండి 33 శాతానికి పెరిగింది. భారతదేశంలో ప్రస్తుతం 40 కోట్ల మంది పేదలున్నారు. ఈ నివేదికపై ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌  ఎకనా మిస్ట్‌, భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాజీ ఆర్థిక సలహాదారు అయిన కౌశిక్‌ బాసు పేదరికాన్ని తొలగించడానికి ఎంతో కృషి చేశాం. ఇప్పటికీ ఇంత మంది పేదలున్నారంటే మా ప్రయత్నాలు మరింత పెరగాలి. పెట్టుబడులు నేరుగా పేదలకు చేరేలా ప్రపంచ బ్యాంక్‌, సభ్య దేశాలు సంయుక్తంగా కృషి చేయాలి అన్నారు. ఆ కృషిలో భాగంగానే పేదరికాన్ని తొలిగించే పేరుతో పేదలను తొలగించే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అభివృద్ది ప్రాజెక్ట్‌ చేపట్టిన మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ పద్దతి ద్వారా తేల్చిన విషయమేమిటంటే, 2011లో 109 ప్రంపచ దేశాలలో మన దేశం పేదరికంలో 79వ స్ధానంలో ఉంది. రష్యా  10 స్థానంలో, చైనా 45 స్థానంలోనూ, బ్రెజిల్‌ 26వ స్థానంలోనూ ఉన్నాయి. భారతదేశంలో అసంఘటిత రంగాన్ని పరిశీలించిన ప్రొ అర్జున్‌సేన్‌ గుప్త ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో 77 శాతం ప్రజలు కేవలం రు. 20 సంపాదనపై జీవిస్తున్నారు. నేషనల్‌ నూట్రిషన్‌ మానిటరింగ్‌ బ్యూరో ప్రకారం దేశంలో 76.8 శాతం ప్రజలకు పొందవలసినంత పోషకాహారం లభించడం లేదని తెలిపింది. గ్రామాలలో రోజుకు ఒక మనిషి 2200 కాలరీలు, పట్ణణాల్లో 2100 కాలరీలు శక్తినిచ్చే ఆహారం తినాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 1993లో నిర్ణయించిన ప్రకారం ఆహారం తీసుకోలేని వారు పట్టణాలలో 57 శాతం ఉండగా, 2003 నాటికి 73 శాతానికి పెరిగారు. గ్రామాలలో 58.5 శాతం నుండి 75 శాతానికి పెరిగారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 1991లో దేశమంతటా రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయగా 2001 నాటికి అవి ఒక కోటీ ముప్పై లక్షల టన్నులకు దిగజారిపోయాయి. పోషకాహర లోపం వల్ల మన దేశం లో ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పదమూడు లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచలో సరైన పోషకాహారం లేక చనిపోతున్న పిల్లలలో 40 శాతానికి మన దేశం వాళ్లే. 54 శాతం స్త్రీలు రక్త హీనతతో బాధపడుతున్నారు. ప్లానింగ్‌ కమిషన్‌ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అందిస్తున్న సబ్సిడీ ఆహార ధాన్యాలలో పేదరిక స్ధాయి దిగువనున్న వారికి 58  శాతానికి అందడం లేదు. పేదలను గుర్తించడంలో తప్పుడు పద్దతులు, సరైన లబ్దిదారుల్ని గుర్తించక పోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. నూతన ఆర్థిక విధానాల కారణంగా పేదరికం పెరిగిపోతూ, పోషకా హార లోపంతో ప్రజలు ఒకవైపు బలయిపోతుంటే మన ప్రణాలిక సంఘం తాజా కొలమానం ప్రకారం పట్టణ ప్రాంతాలలో రోజుకు రు. 29  గ్రామాల్లో రోజుకు రు. 22 ఖర్చు చేయగలిగినవారు పేద లు కారని నిర్ధారించింది.

-పివి రమణ

(తురవాయి భాగం రేపటి సంచికలో)