వ్యవవసాయం కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎవరికోసం?

ఈ పథకాన్ని 2005లో ప్రారంభిస్తూ పని హక్కుని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఇది. శ్రమజీవులు హుందాగా జీవించే ప్రాథమిక హక్కుని కల్పించే ప్రజల చట్టంగా దీన్ని పాలకులు ప్రచారం చేశారు. ఈ చట్టాన్ని అమలుపరిచే ప్రతి జిల్లాలో గల పేద కుటుంబంలో పనిచేచగలిగే వ్యక్తికి ఆ సంవత్సరంలో వంద రోజుల పని కల్పిస్తారు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. దినసరి కూలీ రు 60లకు తగ్గకుండా చెల్లించాలి. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుంది. ఆచరణలో ఈ పథకం పేదరికాన్ని ఏ మాత్రం తగ్గించలేదని రుజువయింది. మొదటి సంవత్సరం 200 జిల్లాలోనూ, రెండవ సంవత్సరం 330  జిల్లాల్లోనూ అమలు చేసిన ఈ పథకం వంద రోజుల పని హామీకి కనీసంగా అమలు చేయలేక పోయింది. కల్పించిన పని దినాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. సొసైటీ ఫర్‌ పార్టిసిపేటివ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆసియా అనే సంస్థ పద్నాలుగా రాష్ట్రాలో. 21 జిల్లాల్లో 530 గ్రామాలలో చేసిన అధ్యయనం ప్రకారం పధకం అముల చేసిన ప్రాంతాలలో నయోదు చేసుకొన&ఇన మొత్తం కుటుంబాలలో కేవలం 6 శాతం కుటుంబాలకు మాత్రమే పని చేయగల వ్యక్తులకు వంద రోజుల పనిని కల్పించగలిగారు. మొదటి సంవత్సరంలో సగటున 45 రోజుల పనికల్పించగా రెండవ సంవత్సరం 38 రోజులకు పడిపో యింది. మన రాష్ట్రంలో 2006-07లో 13 జిల్లాల్లో అమలు చేసిన ఈ పథకానికి ఖర్చు చేసింది రు.512.53కోట్లు మాత్రమే. అంటే దాదాపు 50 శాతం ఖర్చు పెట్టకుండానే మిగిల్చారు. వాడిన మొత్తంలో వాస్తవంగా గ్రామీణ పేదలకు కూలి రూపంలో ముట్టిన మొత్తం 348.48 కోట్లు సామాగ్రి, పాలన కోసం ఖర్చు పెట్టింది రు. 64.5 కోట్లు మిగిలినదంతా రాజకీయ నాయకులు, పెత్తందార్లు అధికారులు స్వాహా చేశారు.

కాంట్రాక్ట్‌ వ్యవసాయం

ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాలకనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లా, కుప్పంలో ప్రారంభించిన కాంట్రాక్ట్‌ వ్యవసాయం కుప్పకూలిన సంగతి అందరికీ తెలిసిందే. దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి మళ్లీ ఆ విధానాన్ని తెరమీదకు తెస్తున్నారు. డిసెంబర్‌ 2012లో పారిశ్రామికవేత్తల సంఘం వ్యవసాయం మీద ఒక జాతీయ సెమినార్‌ జరిపింది. దీన్ని దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారంటే దీని ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆయన దేశంలో రెండవ హరిత విప్లవాన్ని పబ్లిక్‌ – ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానం ద్వారా సాధించారంటే దీని ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆయన దేశంలో రెండవ హరిత విప్లవాన్ని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానం ద్వారా సాధించాలని పిలుపిచ్చారు. దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి రైతులు, ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల సహకారంతో పని చేయాలని తద్వారా పేదరది కాన్ని తొలగించాలని సెమినార్‌లో వ్యాపరరంగ ప్రతిరిథులు ప్రభు త్వ అధికార ప్రతినిధులు మాట్లాడారు. ఈ సెమినార్‌ లో ప్రకటన లక్ష్యాలకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. జనవరి 2013 ప్రభుత్వం పిపిపి పద్దతిలో వ్యవసాయ రంగంలో మార్పులు తేవడా నికి ‘స్మాల్‌ ఫార్మర్స్‌ అగ్రి బిజినెస్‌ కన్సోర్టియం’ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ సంస్థ ద్వారా రాష్ట్రాలకు కార్పొరేట్‌ కంపెనీలకు అవసరమైన సాంకేతిక సహకా రం అందిస్తుందని ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఎసి ద్వారా దేశంలో అనేక ప్రాంతాలలో ఫార్మసి ప్రొడ్యూసర్‌ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంబించారు. రాష్ట్రీయ కృషఙ వికాస్‌ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్‌ఎఫ్‌ఎసి కార్యాక్రమంలో అంశాలు దేశంలో ఉన్న భూమిలో 83 శాతం చిన్న చిన్న కమతాలుగా ఉన్నాయి. వెంటనే కలుగ చేసుకొని రైతు సంస్థల ద్వారా వీటిని పెద్ద పెద్ద కమతాలుగా మార్చి బారీ ఉత్పత్తులను సాధించాలి. దీనిలో బాగస్వాములైన వారందరికీ ప్రధానంగా రైతులకు న్యాయం చేయాలి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ ఒక ప్రత్యామ్నా యంగా తెచ్చి దీన్ని కృషి వికాస్‌ యోజన ద్వారా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఆర్థిక సహాయమిస్తే ప్రైవేట్‌ రంగం తన యజమాన్య శక్తి యుక్తులను ప్రతిఫలాలను సాధించగలం అదనంగా ప్రైవేట్‌న పెట్టుబడులతో మరిన్ని లాభాలు సాధించగలం. దీని ప్రకారం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీలు పని చేస్తూ వ్యవసాయ రంగంలో పిపిపి మోడల్‌ను అమలు పరుస్తారు. గతంలో కార్పొరేట్‌ సంస్థలు అముల చేసి చేస్తున్న కాంట్రాక్ట్‌ వ్యవసాయ విధానాన్ని కొత్త పేరుతో విస్తృతం గా అమలు చేయబోతున్నారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయంలో  చిన్న కమతాల రైతులతో ఒప్పందాలు చేసుకొన్ననప్పుడు తమ కార్యక్రమా ను కొనసాగిస్తారు. అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు కూడా ఈ వధానాన్నే కొనసాగిస్తున్నాయి. రైతులకు ఇంగ్లిష్‌ రాకపోవడంతో మాయ మాటలు చెప్పి సంతకాలు తీసుకొంటారు. కార్పొరేట్‌ సంస్థ ల కాంట్రాక్ట్‌ వ్యవాసయం దేశంలో చాలా ప్రనాంతాలలో దివాళా తీసి రైతుల జీవితాలను సర్వనాశనం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ మహా రాష్ట్ర, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలలో కార్పారేట్‌ శక్తుల చేతిలో మోస పోయిన రైతులు తమ బాదలను రికార్డు చేసి ఉన్నారు. భాష రాకపో వడంతో మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారని రైతులు వాపోతున్నారు. సట్లేజ్‌ నదీ తీరాన పంజాబ్‌, లూథియానాకు దగ్గర లో ఉన్న పంజాబ్‌ అగ్రి కల్చర్‌ యూనివర్సిటీకి చెందిన మూడు వందల ఎకరాల భూమిని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ అమెరికాకు చెందిన డెవ్‌మెంట్‌ పసిఫిక్‌ల జాయింట్‌ కంపెనీకి 2004లో ఎకరా నికి సంవత్సరానికి కేవలం రు 300 రేటుతో 90 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. అప్పుడు ఆ భూమి మార్కెట్‌: ధర ఎకారినికి రు. 35000 ఈ విధంగా పంజాబ్‌లో కాంట్రాక్ట్‌ వ్యవసాయం పేరుతో కార్పొరేట్‌ సంస్థలు చలా చవకగా భూముల్ని స్వాధీనం చేసుకొని, వాళ్ళ అవసరాల కోసం పంటలు పండిస్తున్నారు. గత పది సంవత్స రాలలో పంజాబ్‌లో కాంట్రాక్ట్‌ వ్యవసాయం గత పది సంవత్సరా లలో పంజాబ్‌లో కాంట్రాక్ట్‌ వ్యవసాయం పెరిగిపయింది. ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్‌ సంస్థలైన ఎఎం టాడ్‌, ఎస్కార్ట్స్‌, యునైటెడ్‌ బ్రెనరీస్‌, డిసిఎం శ్రీరామ్‌, టాటా కెమికల్స్‌, యోన్సాంకో, కార్గిల్‌ లు పంజాబ్‌ వ్యవసాయ రంగాన్ని శాసిస్తున్నాయి. 2012లో దాదాపు 17 రాష్ట్ర ప్రభుత్వాలు 25 కార్పొరేట్‌ సంస్థలు కలిసి వ్యవసాయ రంగంలో పిపిపి కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. నూతన ఆర్థిక విధానాల అమలు కారణంగా వ్యవసాయ రంగంలో తీవ్రమైన మార్పాలు వచ్చాయి. జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 1991లో 11.07 కోట్ల మంది ఉండే రైతాంగం 2011 నాటికి 9.58 కోట్లకు తగ్గిపోయారు. అంటే 1.49 కోట్ల మంది అంటే రోజుకి రెండు వేల మంది వ్యవసాయం నుండి తొలగించ బడ్డారు. అదే సమయంలో రైతు కూలీలు 1991లో 7.45 కోట్ల మంది ఉంటే 2011 నాటికి 8.6 కోట్ల మంది ఉన్నారు. అంటే 1.16 కోట్ల మంది రోజుకు 1600 మంది పెరిగారు. సెజ్‌ల కోసం నాశనం చేయబడ్డాయి. కార్పొరేట్‌ వ్యవసాయానికి పుట్టినిల్లు అయిన అమెరికాలో అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం 1935లో 70 లక్షల కమతాలుంటే నేటికి 20 లక్షలకు దిగజారిపోయాయి. అంటే 50 లక్షల మంది తమ భూమిని కోల్పోయారు. ఆహార ధాన్యాల మార్కెట్‌ను కేవలం రెండు కంపెనీలు కార్గిల్‌, కాంటినెంటల్‌ శాసిస్తున్నాయి. 50 శాతం కేవలం మూడు కంపెనీలు మోన్‌సాం టో, డూపాంట్‌, సింజెంటాలు శాసిస్తున్నాయి. పేదరికానికి వ్యవ సాయ రంగానికి ఆహార భద్రతకు విడదీయరాని సంబందం ఉంది. స్వాలంబనతో కూడిన సుస్థిర వ్యవసాయమే  పేదరికాన్ని తొలగించ గలదు. ఓట్లు దండుకోవడంతో పాటు ఆహార భద్రతా సాకుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తుల చేతిలో పెట్టడానికి ఈ జాతీ య ఆహార భద్రతా పధకాన్ని ప్రశేశ పెట్టారని అర్థం చేసుకోవాలి. పేదరికాన్ని సృష్టించిన పాలకులు దాన్ని తొలగిస్తారని ఎవరికి భమలుండే అవకావం లేదు. దేశ సంపదను సామ్రాజ్యవాద శక్తుల కు ధారపోయాడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి పోరాడాలి.

-పివి రమణ

(వీక్షణం సౌజన్యంతో)