జాతి గర్వించే ఇంజనీర్ ‘మోక్షగుండం’
వలస పాలనలో భారతదేశం పూర్తిగా జవసత్వాలు కోల్పోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరిస్థితులలో భారత దేశ ప్రభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, యాంత్రిక శక్తి, శాస్త్ర సాంకేతిక విద్యలను ఉపయోగించి భారత దేశం అభివృద్ధి పథంలో పయనించి అగ్రభాగాన నిలవాలని ఆశించిన యదార్థ వాద, అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు హ్రీత, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించు నిమిత్తల ఎన్నో జలాశయాల పథక రచన నిర్మాత, విశ్వ విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న శ్రీనివాసశాస్త్రీ వెంకట అక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకుల నివాసము ప్రకాశం జిల్లా మోక్షగుండం గొమం కావడం వల్ల గుర్తుగా ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈయన జన్మించినప్పటికి మూడు శతాబ్దాల క్రితమే మైసురుకు వలసవెళ్ళి చిక బళ్ళాపుర సమీపం లోని మద్దెలహళ్ళిలో స్థిరపడినారు.
విశ్వేశ్వరయ్య చిన్నతనంలోనే తండ్రిపోవడం చేత మేనమామ సహకారంతో విద్యనభ్యసించాడు. ప్రథమిక విద్య చిక బళ్ళా పూర్‌లో, కళాశాల విద్య బెంగుళూరులోనూ, ఉన్నత విద్యాభ్యసం మద్రాసు విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యను పూణే సైన్సు కాలేజీలో పూర్తి చేసుకున్నారు. ఇంజనీరింగ్‌లో ప్రథమకస్థానంలో రావడంతో భారత ప్రభుత్వం ఆయనకు అసిస్టెంట్ ఇంజనీరుగా నియమించింది. తన ప్రతిభతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా త్వరగా పదోన్నతి పొందాడు.
మైసూర్ మహారాజు విశ్వేశ్వరయ్యను చీఫ్ ఇంజనీర్‌గా నియమిం చాడు ఆ తర్వాత దివాన్ పదవిని అందించాడు. మైసూరు రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా ఆదర్శవంతంగా తీర్చుదిద్దిన ఘనత ఆయన దే. వరదల నిరోధానికి ఆటోమేటిక్ ప్లడ్ గేట్స్ విధానాన్ని మొదటి సారిగ పూణేలోని ఖదకవల్సా జలాశయానికి ఏర్పాటు చేసి గోప్ప పేరు పొందాడు. వేలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈసా-మూసీ నదుల వరదల నిరోధానికి నిజాం ఆహ్వానంపై హైదరాబాద్‌కు వచ్చి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల రూపకల్పన చేసిన గోప్ప ఇంజనీరు. విశాఖ నౌకాశ్రయాన్ని సాగర జలాల కోత నుంచి తష్టించడానికి ప్రణాళిక రూపొందించారు. కృష్ణరాజసాగర్, గ్వాలియర్ జలాశయాలు నిర్మించి వరదలను నివారించి నీటిని సద్వినియోగంలోకి తీసుకు వచ్చారు.
బ్యాంకు ఆఫ్ మైసురు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్సు, మైసూరు విశ్వవిద్యాలయము, భదోవతి స్టీల్, జయచామరేంద్ర పాలిటెక్నిక్, మైసుర్ ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారము లాంటి ఎన్నో సంస్థలకు పరిశ్రమలకు రూపకల్పన చేశారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉంది. బ్రిటిషు ప్రభుత్వం ఆయన చేసిన సేవలకు గారు ”సర్” అను బిరుదునిచ్చి సత్కరించింది, భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ”భరత రత్నను” అందించి గౌరవించింది.
నీటి పారుదల రంగానికి దశాదిశా నిర్దేశ్యం చేసిన ఇంజనీర్‌గా, ఆధునిక కార్ణటక రాష్ట్ర నిర్మాతగా, 10 సంవత్సరాలు జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన విశ్వేశ్వరయ్య ఏప్రిల్ 14,1962న బెంగుళూరులో మరణించారు. ఆయన భౌతికంగా ఈ లోకంలో లేక పోయినా ఆయన చేసిన కార్యములు ఆయనని శాశ్వతంగా, సజీవంగానిలిపాయి.
-వైరాగ్యం ప్రభాకర్