నా శవ పేటికపై ఉత్సవాలా!

హైదరాబాద్‌ విలీన, స్వతంత్రోత్సవాలు ఎవరి కోసం?
ఈ వ్యాసం హసనుద్దీన్‌ అహ్మద్‌ అనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసరు ఒక పుస్తకానికి రాసిన ముందు మాట. ఆయన 1948కు ముందు నిజాం ప్రభుత్వంలోనూ, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలలో  వివిధ స్థాయిల్లో పని చేసారు. 1948కి ముందు, తరువా త జరిగిన అనేక సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి రాసిన ”సెప్టెంబరు 17: ప్రాముఖ్యత లేని దినం’ అనే పేపరుకు ఈ వ్యాసం ముందు మాట. తెలంగా ణాకు చెందిన ఈ కెప్టెన్‌ 1948లో హైదరాబాదు రాజ్యంపై భారత ప్రభుత్వం సాగించిన ‘ఆపరేషన్‌ పోలో’లో పాల్గొన్న 11వ గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంటులో పనిచేసారు. 2008లో సంవత్సరంలో డిసెం బరు 28,30ల మధ్య కేరళలోని కన్నూరులో జరిగిన ’69వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌’లో ఈ పేపరును ఆయన సమర్పిం చారు. హైదరాబాదులోని మదీన ఎడ్యుకేషన్‌ సెంటరు ఈ పేపరు ను, హసనుద్దీన్‌ అహ్మద్‌ ఉర్దూలో రాసిన ముందు మాటతో సహా చిన్న పుస్తక రూపంలో ప్రచురించింది. ఉర్దూ రాని వారి కోసం ఈ ముందు మాటను ఇంగ్లీషు, తెలుగుల్లోకి అనువదిస్తున్నాం. ఈ ముందు మాటకున్న ప్రత్యేకత ఏమిటంటే 1948 సెప్టెంబరు వీలీన సమయంలో గల పిరిస్థితుల గురించి ఒక ముస్లిమ్‌ దృక్పథాన్ని అందించటం దీన్ని గుర్తించకుండాక, ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్ట టం వల్ల హైదరాబాదు ముస్లిం పట్ల అనేక అపోహలు పెద్ద ఎత్తున  ప్రబలి పోయాయి. సెప్టెంబరు 17 గురించి ఈ ముస్లిం దృక్పథం ఉందని ఒప్పుకోవటం కూడా చాలా మందికి కష్టం. దాని కి మేధోప రమైన నిజాయితీ, ధైర్యం చాలా అవసరం. ఈ ధోరణి లోనే కెప్టెన్‌ లింగాల పాండు రంగారెడ్డి రాసిన పేపరు ఆర్మీలో పనిచేసిన వరి దృక్పథం నుండి అప్పుడు జరిగిన సంఘటనలను పరిశీలించింది. ఆయన మామూలు పరిశోధకులకు అందుబాటులో వుండని ఆర్మీ పత్రాలను, రికార్డులను ఈ పేపరు కోసం వాడారు. అందు వల్ల ఈ పేపరు ముఖ్యమైనది.

హసనుద్దీన్‌ అహ్మద్‌ ముందుమాట

ఈ పేపరును ఒక ఆర్మీ ఆఫీసరు రాసారు. దీనిలో ప్రతి పదం, రాజకీయాలు, భావోద్వేగాలు, కమ్యూనిజాన్ని అధిగమించి నిజాన్ని, నిజాయితీగా మనముందు ఉంచుతుంది. ఆయన 11వ గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంటులో పనిచేశారు. కానీ ఇప్పుడు గన్‌ బదులు పెన్ను తీసుకున్నారు. పెన్‌కున్న గొప్పతనం ఆయనకు తెలుసు. ఈ దేశ వర్తమాన చరిత్రను ఎంచుకుని దాని గురించి  పేపరు రాసారు.

వర్తమాన చరిత్రను వర్ణించటం చాలా కష్టం. రచయిత 1948లో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షులుగా వుండి ఇప్పటికీ జీవించి వున్న తరానికి చెందినవారు. ఈ ఆపరేషన్‌ గురించి ఉద్దేశపూ ర్వకంగా పరిచిన చిక్కని అబద్ధాల ముసుగును ఛేదించారు. పోలీసు చర్యను రాజకీయ రంగుటద్దాలతోనూ, కమ్యూనల్‌ రంగుల్లోనూ చూస్తున్నారనే రచయిత దృక్పథంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ రాజకీయాలెటువంటివంటే, అవి తొక్కి పెట్టడాన్ని న్యాయంగానూ, అణచివేతను సర్దుకుపోవాల్సిన వ్యవహారంగానూ చూపించేవి. ఈ విషయంలో అత్యంత సంకుచిత ధోరణి, వైషమ్యం కలిసి నిజాలను పూర్తిగా వక్రీకరించాయి. విషయాల మీద ఎంత చిక్కటి ముసుగు వేయబ డిందంటే చివరికి నిజాలను చూసి మనం ఇప్పుడు విస్తుపోయే పరిస్థితులొచ్చాయి.

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిసాలనా కాలాన్ని తప్పుడు అవగాహనతో చూయించడం, హైదరాబాదీయుల పట్ల పెద్ద నేరం చేసినట్లే. ప్రజాహితం కోరేవాళ్ళు ఇప్పటికైనా నిజాలు వెలుగులోని తేవటం ప్రజలకు లాభదాయకం, మంచిది కూడా. వర్తమాన చరిత్రపై పొరలను మాత్రమే తట్టగలిగారు. జరిగిన సంఘటనలను ఇప్పటికే దొరికే రచనల ద్వారా విశ్లేషించే ప్రయత్నం చేసారు. అయితే మనకి ఆ సమయాన్ని గురించి దొరికే రచనల ద్వారా విశ్లేషించే ప్రయత్నం చేసారు. అయితే మనకి ఆ సమయాన్ని గురించి దొరికే రచనలు అన్నీ పాక్షికమైనవే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ పాండురంగారెడ్డి యదార్థ విషయాలను మనముందుంచినందకు ఆయన్ని మనం అభినందించాలి.

నేను నిజాంకు బంధువునే గానీ రాజరికాన్ని ఎప్పుడూ సమర్థించలే దు. నాకు రాజరికం కంటే ప్రజాస్వామ్యమే సమర్థవంతమైన పాలన అందిస్తుందని నేను బలంగా నమ్మాను. కాని పరిస్థితులు ఎంత హా స్యాస్పద స్థాయికి దిగజారాయంటే ప్రజలిప్పుడు ప్రజాస్వా మ్యాన్ని నిజాం పాలనతో పోల్చి ‘అప్పుడే బాగుండేదేమో’ అనుకుం టాన్నరు. ఇవాళ ప్రజాస్వామ్యానికున్న పరిమితులను ప్రపంచం మొత్తం మీద ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదే మనం మీర్‌ ఉస్మాన్‌ అలీఖా న్‌ కాలం నాటి హైదరాబాదు రాజ్యాన్ని తీసుకుంటే రాజుపై ఒత్తిడి చేసే మేధావి వర్గం ఒకటి హైదరాబాదులో ఉండేది. వీళ్ళు ప్రజా బాహుళ్యానికి కావలసిన అవసరాలను, కట్టడాలను గుర్తించి రాజు తో చేయించే వాళ్ళు. వీరి ఒత్తిడి వల్ల ప్రజలందరికీ ఉపయోగపడు తూ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన కట్టడాలు సాధ్యపడినాయి.

అసఫ్‌ జాహీల జెండాపై ఉన్న రొట్టె గుర్తు తన ఏలుబడిలో ఉన్న అందరికి తిండి పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు తెచ్చే చిహ్నం. నాకు తెలిసినంత వరకు ఎవరి జెండాపై కూడా రొట్టె గుర్తు లేదు. కమ్యూనిస్టు దేశాలు కూడ ఇలాంటి గుర్తును పెట్టుకోలేదు. ఇటువంటి ప్రత్యేకత ఒక అసఫ్‌ జాహీల జెండాకే ఉంది.  దక్షిణాసియా చారిత్రక నేపథ్యంలో హైదరాబాద్‌ రాజ్యాన్ని మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సంస్కృతి, స్వభావాలు గల హైదరాబాద్‌ ‘సమాజం’ ఎందుకు అంతమైపోయిందీ అనే ప్రశ్న రాక తప్పదు. దీని వెనుక చాలా రాజకీయార్థిక కోణాలు ఉండొచ్చు గానీ బహుశా దీన్ని భారతదేశంలో ఆధునిక రాజ్యపరిణామ క్రమంలో జరిగిన మార్పుగా కూడా చూడాలేమో!

– హసనుద్దీన్‌ అహ్మద్‌

ఇంగ్లిషు అనువాదం : ఎంఏ మోయిద్‌

తెలుగు అనువాదం : ఏశాల శ్రీనివాస్‌

(తరవాయి భాగం రేపటి సంకలో)