గత వైభవాన్ని చాటాలి

8 శాతం వృద్ధి రేటుకు చేరుకోవాలి
రాష్ట్రపతి ప్రణబ్‌ ఆకాంక్ష
చెన్నై, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :
దేశ గత వైభవాన్ని చాటాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. శుక్రవారం చెన్నైలో 28వ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించారు. జాతీయ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ పురోగతి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడుతూ, గతంలో సాధించిన 8 శాతం వృద్ధి లక్ష్యానికి మళ్లీ చేరుకోవాల్సి ఉందన్నారు. అనుకూల పరిస్థితు వల్లే అది సాధ్యమవుతుందన్నారు. దేశంలోని విద్యాసంస్థలు ఇంజినీరింగ్‌, టెక్నాలజీ రంగాల్లో అనుసంధానం ఏర్పరచుకోవాలని సూచించారు. విద్యార్థులో మేధో సంపత్తిని పెంపొందించుకొని జాతీయ సంపదగా పెంపొందాలని కోరారు. దేశం నుంచి మేధో నిపుణులు వివిధ దేశాలకు వెళ్లి విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి అందిస్తున్నారని గుర్తు చేశారు. తద్వారా జాతీయ సంపద కూడా వృద్ధి చెందుతుందన్నారు. ఇంజినీర్లు దేశ భవితకు మూలస్తంభాలని ఆయన కొనియాడారు.