75వ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు సందర్బంగా వైరాలో భారీ ర్యాలీ ప్రారంభించిన వైరా శాసనసభ్యులు
75వ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు సందర్బంగా వైరాలో భారీ ర్యాలీ ప్రారంభించిన వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియా రాములునాయక్, అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత
సెప్టెంబర్ 16న (జనంసాక్షి న్యూస్ వైరా)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు ఈనెల 16,17,18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 75వ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు భాగంగా వైరా నియోజకవర్గ స్థాయి భారీ ర్యాలీని వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియా రాములునాయక్ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలాత సంయుక్తంగా ప్రారంభించి ఈ ర్యాలీలో సుమారు 15000 మందితో పాత బస్టాండ్ నుంచి వైరా రింగ్ రోడ్ మీదగా వ్యవసాయ మార్కెట్ వరకు చేరుకోవటం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో వైరా శాసనసభ్యులు రాములునాయక్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల వారు అన్ని జాతుల వారు అన్ని మతాలవారు ప్రతి ఒక్కరు భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండాలని ఈ యొక్క సమైక్యత భావంతో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ముందుకు పోతుందని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందని కొనియాడారు . ఈ ర్యాలీలో వైరా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అన్ని మండలాల నుంచి అధికారులు మహిళలు యువత స్కూల్ మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనటం జరిగింది.అదేవిధంగా రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఏసిపి sk రెహమాన్, మున్సిపల్ కమిషనర్ వెంకటపతి రాజు ,మున్సిపల్ చైర్ పర్సన్ సూతకాని జైపాల్, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సితారములు, మార్కెట్ చైర్మన్ బీడేకే రత్నం, వివిధ హోదా లో ఉన్న. ఐదు మండలాల ఎంపీడీవోలు ,జడ్పీటీసీలు ,ఎంపీపీలు ,తాసిల్దార్లు , తదితరులు పాల్గొన్నారు.