మోడీపై పోటీకి నేను సై

ఆమ్‌ ఆద్మీ సమన్వయకర్త కేజ్రీవాల్‌
లక్నో, మార్చి 2 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై పోటీకి తాను సిద్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. నరేంద్రమోడీపై కేజ్రీవాల్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ నేత మనీష్‌ సిసోడియా సూచన ప్రాయంగా తెలిపారు. ఆదివారం ఆయన ఉత్తర ప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా భారీ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ పోటీచేస్తారన్న సందేశాన్ని పంపారు.